iQoo U1 బడ్జెక్ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూడండి!!!

|

వివో సంస్థ యొక్క సబ్ బ్రాండ్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న iQoo సంస్థ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నది. ఈ లైనప్‌లో మిడ్-టైర్ స్మార్ట్‌ఫోన్‌గా ఐక్యూ U1 ఈ రోజు లాంచ్ చేసారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు సెల్ఫీ షూటర్ కోసం హోల్-పంచ్ కటౌట్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరు వేరు ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. సరసమైన స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో విడుదలైన ఐక్యూ U1 బ్రాండ్ యొక్క ధర మరియు ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

iQoo U1 ధరల వివరాలు

iQoo U1 ధరల వివరాలు

iQoo U1 స్మార్ట్‌ఫోన్‌ మూడు కాన్ఫిగరేషన్లలో విడుదల అయింది. ఇందులో బేస్ మోడల్ 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర CNY 1,198 (సుమారు రూ .12,900). 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,398 (సుమారు రూ .15,000). చివరిగా టాప్-టైర్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర CNY 1,598 (సుమారు రూ .17,200). ఈ ఫోన్ సీక్రెట్ బ్లాక్, స్టార్ బ్లూ మరియు ఫారెస్ట్ వైట్ వంటి మూడు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.

 

 

Also Read: Oppo 125W సూపర్ ఫ్లాష్ ఛార్జర్!!! 20min లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్...Also Read: Oppo 125W సూపర్ ఫ్లాష్ ఛార్జర్!!! 20min లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్...

iQoo U1 స్పెసిఫికేషన్స్

iQoo U1 స్పెసిఫికేషన్స్

iQoo U1 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు iQoo UI మీద రన్ అవుతుంది. ఇది 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే 1,080x2,340 పిక్సెల్స్ పరిమాణం కలిగి ఉండి 19.5: 9 కారక నిష్పత్తితో మరియు 90.72 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. అలాగే ఇది అడ్రినో 618 GPUతో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 720G ప్రాసెసర్ మరియు 8GB LPDDR4Xర్యామ్‌తో జత చేయబడి వస్తుంది.

iQoo U1 కెమెరా సెటప్

iQoo U1 కెమెరా సెటప్

iQoo U1 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ లెన్స్‌, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా మరియు ఎఫ్/ 2.4 ఎపర్చర్‌తో 2మెగాపిక్సెల్ సెన్సార్తో మాక్రో లెన్స్ కెమెరాలు ఉన్నాయి. అలాగే ముందు వైపు స్క్రీన్ యొక్క ఎడమవైపు ఎగువ మూలలో ఉన్న పంచ్-హోల్ కటౌట్‌లో ఎఫ్ / 2.05 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరా లెన్స్‌లతో సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి.

iQoo U1 స్మార్ట్‌ఫోన్  ఫీచర్స్

iQoo U1 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్

IQoo U1 స్మార్ట్‌ఫోన్ 128GB UFS 2.1 స్టోరేజ్ తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, 4G, బ్లూటూత్ V5.1, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ కోసం మైక్రో-USB పోర్ట్ లను కలిగి ఉన్నాయి. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు OTG రివర్స్ ఛార్జింగ్ మద్దతుతో 4,500mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆన్‌బోర్డ్‌లోని సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, గ్రావిటీ సెన్సార్ మరియు దిక్సూచి వంటివి ఉన్నాయి. iQoo U1 స్మార్ట్‌ఫోన్ 162.05x76.61x8.46mm కొలతలతో 190 గ్రాముల బరువుతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
IQoo U1 Smartphone Launched with With Triple Rear Camera Setup: India Price, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X