iQoo Z5 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! అమెజాన్ సేల్ లో మొదటి అమ్మకం...

|

iQoo Z5 చైనాలో ఆవిష్కరించబడిన కొన్ని రోజుల తర్వాత నేడు భారతీయ మార్కెట్లో విడుదల చేయబడింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పంచ్-హోల్ డిస్‌ప్లే మరియు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను మరియు 44W ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో 5,000WAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను మరియు ఫేస్ వేక్ ఫేషియల్ రికగ్నిషన్‌ మద్దతు ఫీచర్లను కలిగి ఉండి అక్టోబర్ 3 న జరగబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో మొదటిసారి అమ్మకానికి వచ్చే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

iQoo Z5 స్మార్ట్ ఫోన్ భారతదేశంలో రెండు వేరియంట్ లలో విడుదలైంది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,990 కాగా 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.26,990. ఇది ఆర్కిటిక్ డాన్ మరియు మిస్టిక్ స్పేస్ కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ iQoo.com మరియు Amazon.in లో అక్టోబర్ 3 నుండి అంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ యొక్క మొదటిరోజు నుంచి కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా HDFC బ్యాంక్ డెబిట్ మరియు EMI లావాదేవీలతో సహా క్రెడిట్ కార్డులపై రూ.1,500 తగ్గింపుతో రూ.1500 విలువైన అమెజాన్ కూపన్‌, ఆరు నెలల స్క్రీన్ రీప్లేస్‌మెంట్ మరియు 9 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి.

Amazon Great Indian Festival సేల్ డేట్ వచ్చేసింది!! డిస్కౌంట్ ఆఫర్లపై లుక్ వేయండిAmazon Great Indian Festival సేల్ డేట్ వచ్చేసింది!! డిస్కౌంట్ ఆఫర్లపై లుక్ వేయండి

iQoo Z5 స్పెసిఫికేషన్స్

iQoo Z5 స్పెసిఫికేషన్స్

iQoo Z5 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11- ఆధారిత ఆరిజిన్ OS 1.0 పై రన్ అవుతూ డ్యూయల్-నానోసిమ్ స్లాట్‌లకు మద్దతును ఇస్తుంది. ఇది 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 20: 9 యాస్పెక్ట్ రేషియో, DCI-P3 కలర్ స్వరసప్తకం మరియు HDR 10 సపోర్ట్ కలిగి ఉంది. ఇది TUV Rheinland ధృవీకరించబడింది. ఈ ఫోన్ 6nmQualcomm Snapdragon 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 12GB LPDDR5 ర్యామ్‌తో జత చేయబడి వస్తుంది. అలాగే ఇది 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ మద్దతుతో అందించబడుతుంది.

ఆప్టిక్స్

iQoo Z5 ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఇందులో f/1.79 ఎపర్చరుతో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా, f/2.2 ఎపర్చర్ లెన్స్ తో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ మరియు ఎఫ్/2.4 ఎపర్చరు లెన్స్‌తో స్థూల సెన్సార్ తో 2-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.కెమెరా ఫీచర్లలో డ్యూయల్ వ్యూ వీడియో, సూపర్ నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్ మరియు మరిన్ని ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో f/2.45 ఎపర్చరు లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

5,000mAh బ్యాటరీ

iQoo Z5 ఫోన్ 44W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉండడమే కాకుండా ఫేస్ వేక్ ఫేషియల్ రికగ్నిషన్ కూడా కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో USB టైప్-సి పోర్ట్, బ్లూటూత్ v5.2, USB OTG, ట్రై-బ్యాండ్ Wi-Fi 2.4GHz, 5.1GHz, మరియు 5.8GHz బ్యాండ్‌లు, GPS మరియు 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. అలాగే ఇది 164.7x76.68x8.49mm కొలతల పరిమాణంతో 193 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. అలాగే గేమింగ్ సెషన్‌లలో వేడిని వెదజల్లడానికి VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. లీనియర్ మోటార్‌తో 4G గేమ్ వైబ్రేషన్, అల్ట్రా గేమ్ మోడ్ 2.0 మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు ఇతర ఫీచర్లు.

Best Mobiles in India

English summary
iQoo Z5 Gaming Smartphone Released in India With 44W Flash Charge: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X