iQoo Z6 5G గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో..

|

గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా iQoo బ్రాండ్ కు మంచి గుర్తింపు ఉంది. iQoo బ్రాండ్ యొక్క Z సిరీస్‌లో తాజా స్మార్ట్‌ఫోన్‌గా iQoo Z6 5G నేడు భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఈ కొత్త iQoo ఫోన్ 120Hz డిస్‌ప్లేను కలిగి ఉండి ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే ఇది 8GB వరకు RAM మరియు ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. సూపర్ నైట్ మోడ్ మరియు బోకె మోడ్‌ కెమెరా ఫీచర్లు స్మార్ట్‌ఫోన్లో ప్రీలోడ్ చేయబడి ఉన్నాయి. ఇది థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఐదు-పొరల లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇండియన్ మార్కెట్ లో Redmi Note 11 Pro+ 5G, Vivo T1 5G వంటి వాటితో పోటీపడుతున్న ఈ బ్రాండ్ కొత్త ఫోన్ యొక్క స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

iQoo Z6 5G ధరలు మరియు లాంచ్ ఆఫర్లు

iQoo Z6 5G ధరలు మరియు లాంచ్ ఆఫర్లు

భారతదేశంలో iQoo Z6 5G స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM వేరియంట్ యొక్క ధర రూ.15,499 కాగా 6GB ర్యామ్ మోడల్‌ యొక్క ధర రూ.16,999. చివరిగా టాప్-ఆఫ్-ది-లైన్ 8GB ర్యామ్ మోడల్ ధర రూ.17,999. ఇది క్రోమాటిక్ బ్లూ మరియు డైనమో బ్లాక్ కలర్ లలో లభిస్తుంది. ఇది మార్చి 22 నుండి అమెజాన్ మరియు iQoo India eStore ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. iQoo Z6 5G ఫోన్ యొక్క లాంచ్ ఆఫర్‌ల విషయానికి వస్తే HDFC బ్యాంక్ కార్డ్ యొక్క EMI లావాదేవీల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ.2,000 తక్షణ తగ్గింపు. అదనంగా నో కాస్ట్ EMI ఎంపికలు మరియు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో కూడా ఫోన్ అందుబాటులో ఉంటుంది.

iQoo Z6 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

iQoo Z6 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

iQoo Z6 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12లో ఫన్ టచ్ OS 12తో రన్ అవుతుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద ఇది 8GB వరకు LPDDR4X RAMతో జతచేయబడి ఉండి ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతుంది.

ఆప్టిక్స్

iQoo Z6 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది.ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సామ్ సంగ్ ISOCELL JN1 సెన్సార్ f/1.8 లెన్స్‌తో ఉంది. కెమెరా సెటప్‌లో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ బోకె కెమెరా కూడా ఉన్నాయి. అయితే బోకె కెమెరా 6GB మరియు 8GB మోడల్‌లకు పరిమితం చేయబడింది మరియు బేస్ 4GB వేరియంట్‌లో అందుబాటులో లేదు. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.0 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ Samsung 3P9 సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ఇది స్టాండర్డ్‌గా 128GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. ఫోన్లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.1, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది.

Best Mobiles in India

English summary
iQoo Z6 5G Gaming Smartphone Launched in India With Qualcomm Snapdragon 695 SoC: Price, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X