Home
News

iQoo Z6 5G స్మార్ట్‌ఫోన్‌ మొదటి సేల్ లో ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు

iQoo స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ iQoo Z సిరీస్ విభాగంలో గత వారం భారతదేశంలో iQoo Z6 5G గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ యొక్క అమ్మకాలు మొదటిసారిగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యాయి. ఈ కొత్త హ్యాండ్‌సెట్ iQoo India eStore మరియు Amazon ద్వారా కొనుగోలు చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతూ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. అలాగే ఇది 120Hz డిస్‌ప్లే మరియు థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఐదు-లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో పాటుగా ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్లతో మూడు రకాల RAM మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. కస్టమర్‌లు ఈ హ్యాండ్‌సెట్‌ను రెండు విభిన్న కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

iQoo Z6 5G ధరలు మరియు డిస్కౌంట్ ఆఫర్లు

iQoo Z6 5G ధరలు మరియు డిస్కౌంట్ ఆఫర్లు

భారతదేశంలో iQoo Z6 5G స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులో 4GB RAM వేరియంట్ యొక్క ధర రూ.15,499 కాగా 6GB ర్యామ్ మోడల్‌ యొక్క ధర రూ.16,999. చివరిగా టాప్-ఆఫ్-ది-లైన్ 8GB ర్యామ్ మోడల్ ధర రూ.17,999. ఇది క్రోమాటిక్ బ్లూ మరియు డైనమో బ్లాక్ కలర్ లలో లభిస్తుంది. అమెజాన్ మరియు iQoo India eStore ద్వారా నేడు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్ ను ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ.2,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అదనంగా నో కాస్ట్ EMI ఎంపికలు మరియు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

iQoo Z6 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

iQoo Z6 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

iQoo Z6 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12లో ఫన్ టచ్ OS 12తో రన్ అవుతుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద ఇది 8GB వరకు LPDDR4X RAMతో జతచేయబడి ఉండి ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతుంది.

ఆప్టిక్స్

iQoo Z6 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది.ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సామ్ సంగ్ ISOCELL JN1 సెన్సార్ f/1.8 లెన్స్‌తో ఉంది. కెమెరా సెటప్‌లో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ బోకె కెమెరా కూడా ఉన్నాయి. అయితే బోకె కెమెరా 6GB మరియు 8GB మోడల్‌లకు పరిమితం చేయబడింది మరియు బేస్ 4GB వేరియంట్‌లో అందుబాటులో లేదు. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.0 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ Samsung 3P9 సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ఇది స్టాండర్డ్‌గా 128GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. ఫోన్లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.1, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQoo Z6 5G Smartphone First Sale Live in Amazon and Company Website: Price, Specs, Sales Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X