iQOO Z6 Lite 5G ధ‌రలు లీక‌య్యాయి.. రూ.15వేల లోపే ఉండొచ్చ‌ని అంచ‌నా!

|

iQOO కంపెనీ భారతదేశంలో త‌మ స‌రికొత్త iQOO Z6 Liteని సెప్టెంబర్ 14వ తేదీన లాంచ్ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప‌లు నివేదిక‌లు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. కాగా, Onsitego అనే నివేదిక తాజాగా రానున్న ఆ కొత్త iQOO Z6 Lite ధరను ప్రకటించింది. భారతదేశంలో, మీరు ఈ iQOO ఫోన్‌ని Amazon మరియు iQOO యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.

iQOO Z6 Lite 5G

ఇది రెండు వేరియంట్ల‌లో భార‌త మార్కెట్లోకి వస్తుందని వెల్ల‌డించింది. ఈ కంపెనీ నుంచి Qualcomm Snapdragon 4 Gen 1 CPUని క‌లిగిన మొదటి స్మార్ట్‌ఫోన్ iQOO Z6 Lite అని స‌మాచారం. Onsitego ప్ర‌కారం.. భారతదేశంలో iQOO Z6 Lite ఛార్జర్ లేకుండా వ‌స్తుంద‌ని స‌మాచారం. అమెజాన్‌లోని iQOO Z6 Lite మైక్రోసైట్ ద్వారా దాని డిజైన్‌, ఫీచర్ల మరియు AnTuTu స్కోర్ వెల్ల‌డి చేసింది.

భారతదేశంలో iQOO Z6 Lite 5G ధర:
iQOO Z6 Lite 5G రెండు వేరియంట్ల‌లో అందించబడుతుందని నివేదిక పేర్కొంది. ఎంట్రీ-లెవల్ మోడల్ 4GB RAM మరియు 64GB నిల్వను కలిగి ఉంది. దాని ఖ‌రీదు వ‌చ్చేసి.. రూ.13,499 (దాదాపు $159) ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రో వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999 (దాదాపు $188) గా ఉంటుంద‌ని స‌మాచారం. కాబ‌ట్టి, ఇది భారతదేశంలో అతి తక్కువ ఖరీదైన 5G-సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా అందుబాటులోకి వ‌స్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

iQOO Z6 Lite 5G

లాంచ్ ఎప్పుడంటే!
అమెజాన్ ఇండియాలో విడుద‌లైన పోస్ట్‌లో పేర్కొన్న ప్ర‌కారం.. iQOO Z6 Lite 5G భారతదేశంలో సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. డిజైన్ విష‌యానికి వ‌స్తే.. డివైజ్ ముందు భాగంలో, వాటర్‌డ్రాప్ ఆకారపు నాచ్ ఉంది. మరియు ఈ మొబైల్‌కు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

iQOO Z6 Lite 5G లీక్‌డ్‌ స్పెసిఫికేష‌న్లు:
iQOO Z6 Lite 5G ఎల్‌సిడి డిస్‌ప్లే ప్యానెల్‌ను క‌లిగి ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుందని నిర్ధారించబడింది. ఫోన్‌లో డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ ఫీచ‌ర్ అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని ల్యాండింగ్ పేజీ పేర్కొంది. సెప్టెంబరు 7న కంపెనీ చిప్‌సెట్ పేరును వెల్లడిస్తుందని స‌మాచారం. సెప్టెంబర్ 8న, iQOO Z6 Lite 5G గేమ్‌ల కోసం ఏమి చేయగలదో మరియు దాని కెమెరా ఎలా పనిచేస్తుందో ల్యాండింగ్ పేజీ వెల్లడిస్తుంది.

iQOO Z6 Lite 5G

ఇటీవలి నివేదిక ప్రకారం, iQOO Z6 Lite 5G కొత్త స్నాప్‌డ్రాగన్ 4-సిరీస్ చిప్‌తో అమర్చబడుతుందని తెలుస్తోంది. ఇక ఛార్జ్ విష‌యానికొస్తే.. ఇది 5,000mAh సామ‌ర్థ్యం క‌లిగిన బ్యాటరీ తో వ‌స్తుంద‌ని స‌మాచారం. మరియు ఈ మొబైల్‌ 50-మెగాపిక్సెల్ క్వాలిటీ గ‌ల ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇక భార‌త మార్కెట్లో దీని ధ‌ర బ‌డ్జెట్‌లో రూ.15 వేల లోపు ఉండొచ్చ‌ని తెలుస్తోంది.

iQOO Z6 Lite 5G భారతదేశంలో Z6-సిరీస్ నుంచి విడుద‌లైన వాటిలో నాలుగో ఫోన్. గత కొన్ని నెలల్లో, కంపెనీ iQOO Z6 5G, iQOO Z6 Pro 5G మరియు iQOO Z6 44W వంటి ఇతర మోడళ్లను విడుదల చేసింది. లైనప్‌లో iQOO Z6 Pro SE అని పిలువబడే మరొక మోడల్ కూడా వ‌స్తుంద‌ని అంచ‌నాలు ఉన్నాయి. అయితే దానిపై ఇంకా కంపెనీ నుంచి అధికారిక నిర్ధారణ లేదు.

Best Mobiles in India

English summary
iQOO Z6 Lite 5G Price in India Leaked Before its Launch

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X