Home
News

ఐక్యూ Z7 5G ఇండియా లాంచ్ తేదీ, ధర & స్పెసిఫికేషన్ల వివరాలు!

By Maheswara

ఐక్యూ Z7 5G స్మార్ట్ ఫోన్ భారతదేశంలో మార్చి 21 న లాంచ్ కాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే దాని విడుదలకు ముందే, ఈ ఫోన్ యొక్క ధర మరియు రంగు ఎంపికలు ఆన్‌లైన్‌లో లీక్ చేయబడ్డాయి. రాబోయే iQoo 5G స్మార్ట్‌ఫోన్ రెండు రంగు ఎంపికలు మరియు రెండు ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుందని తెలుస్తోంది.

ఐక్యూ Z7 5G స్మార్ట్ ఫోన్ సాధారణంగా 8GB RAM మరియు 128GB స్టోరేజీను అందించగలదు. దీని ధర రూ.20,000 లోపే ఉండవచ్చని అంచనా. ఐక్యూ Z7 5G ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 920 5G SoC ప్రాసెసర్ ని కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఇది ఫన్ టచ్ OS 13 తో పనిచేస్తుంది. మరియు 64 మెగాపిక్సెల్ OIS కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉండేలా టీజ్ చేయబడింది. ఇది 44W ఫ్లాష్ ఛార్జ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది.

iQoo Z7 5G Set To Launch On March 21 In Indian Market, India Price And Colour Options Leaked.

ప్రముఖ ఆన్లైన్, నివేదికల ప్రకారం,ఐక్యూ Z7 5G భారతదేశంలో 6GB మరియు 8GB RAM ఎంపికలతో 128GB నిల్వతో లాంచ్ చేయబడుతుంది.ఈ ఫోన్ ధర బేస్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.17,000 గా ఉంటుంది. ఇది నార్వే బ్లూ మరియు పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది.

ఐక్యూ Z7 5G స్మార్ట్ ఫోన్ ఐక్యూ Z6 ఫోన్ కు కొనసాగింపుగా వస్తుందని భావిస్తున్నారు. ఐక్యూ Z6 ధర గత ఏడాది మార్చిలో భారతదేశంలో విడుదలైనప్పుడు, దీని ప్రారంభ ధర బేస్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.15,499 గా ఉండేది. ఇది క్రోమాటిక్ బ్లూ మరియు డైనమో బ్లాక్ రంగులలో లభిస్తుంది.

ఐక్యూ Z7 5G స్మార్ట్ ఫోన్ మార్చి 21న భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయబడుతుంది. మరియు ఇది అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఐక్యూ Z సిరీస్ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 920 5G SoC ద్వారా అందించబడుతుందని నిర్ధారించబడింది. ఇది ఫన్ టచ్ OS 13పై రన్ అవుతుంది మరియు 64-మెగాపిక్సెల్ OIS కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

ఐక్యూ Z7 5G ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది 44W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది పరికరాన్ని కేవలం 25 నిమిషాల్లో 1 శాతం నుండి 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. ఇది ప్రామాణీకరణ కోసం అమోలెడ్ డిస్‌ప్లే మరియు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.

గత నెలలో కూడా ఐక్యూ నియో 7 5G స్మార్ట్ ఫోన్ భారతదేశంలో ఫిబ్రవరి 16, గురువారం లాంచ్ అయింది. కంపెనీ యొక్క సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా హోస్ట్ చేయబడిన లైవ్ ఈవెంట్ లో ఈ ఫోన్లను లాంచ్ చేశారు. ఈ ఫోన్ 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 8200 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQoo Z7 5G Set To Launch On March 21 In Indian Market, India Price And Colour Options Leaked.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X