Home
News

iQoo Z7 Pro 5G ఇండియా లాంచ్ తేదీ, కలర్ వేరియంట్ ల వివరాలు

By Maheswara

iQoo Z7 Pro 5G ఆగష్టు 31న భారతదేశంలో లాంచ్ చేయబడుతోంది. లాంచ్ వివరాలు ఇప్పటికే నివేదికల ద్వారా విడుదలయ్యాయి. లాంచ్ కు కొద్ది రోజుల ముందే మొబైల్ తయారీదారు రాబోయే హ్యాండ్‌సెట్ యొక్క ప్రాసెసర్, డిస్ప్లే మరియు AnTuTu స్కోర్‌తో సహా పలు కీలక వివరాలను ఇప్పుడు టీజ్ చేసింది. ఇప్పుడు, iQoo ఫోన్ కోసం కొత్త రంగు ఎంపికను వెల్లడించింది.

iQoo Z6 ప్రో కు కొనసాగింపుగా విజయవంతంగా, ఈ ఫోన్ iQoo Z7 5G గా ఉంటుంది. ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో మార్చిలో విడుదల చేయబడింది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 SoC మరియు 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో వచ్చింది.

iQoo Z7 Pro 5G India Launch Set For August 31st, Now New Colour Options Teased Ahead Of The Launch.

అధికారిక iQoo ఇండియా (@IqooInd) హ్యాండిల్ నుండి ఒక ట్వీట్‌లో, iQoo Z7 Pro 5G కొత్త గ్రాఫైట్ మ్యాట్ కలర్ వేరియంట్‌లో టీజ్ చేయబడింది. ఈ ఫోన్ గతంలో బ్లూ లగూన్ కలర్‌వేలో టీజ్ చేయబడింది. ఇది 64 మెగాపిక్సెల్ లెడ్ డ్యూయల్ కెమెరా యూనిట్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు రింగ్-ఆకారపు LED ఫ్లాష్ యూనిట్‌తో కనిపిస్తుంది. దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ వెనుక ప్యానెల్ యొక్క కుడి ఎగువ మూలలో ఉంచబడింది. ఇది ముందు కెమెరా సెన్సార్‌ను ఉంచడానికి డిస్‌ప్లే పైభాగంలో సెంటర్-అలైన్డ్ హోల్-పంచ్ స్లాట్‌ను కూడా కలిగి ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క AnTuTu స్కోర్ 7,28,764 గా ఉంది., iQoo Z7 ప్రో 5G 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడిన మీడియా టెక్ డైమెన్సిటీ 7200 SoC ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుందని నిర్ధారించబడింది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1300నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయితో 3D కర్వ్డ్ సూపర్ విజన్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ధర రూ.25,000 లోపు ఉంటుంది. కానీ ఖచ్చితమైన ధర ఇంకా వెల్లడి కాలేదు. iQoo Z7 ప్రో 5G 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

అదే సమయంలో iQoo Z7 5G భారతదేశంలో 6GB + 128GB మరియు 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ధర వరుసగా రూ. 18,999 మరియు రూ. 19,999 గా ఉన్నాయి. ఇది నార్వే బ్లూ మరియు పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఐకూ నియో 7 ప్రో భారత్‌లో విడుదల అయింది. లాంచింగ్‌ సమయంలో రూ.34,999కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఐకూ నియో 7 ప్రో ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. 8MP ఆల్టావైడ్‌ కెమెరా,2MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQoo Z7 Pro 5G India Launch Set For August 31st, Now New Colour Options Teased Ahead Of The Launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X