Home
News

iQOO కొత్త స్మార్ట్‌ఫోన్‌ వివరాలు లీక్‌.. వచ్చే వారంలో విడుదల..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐకూ నుంచి త్వరలో కొత్త ఫోన్‌ విడుదల కానుంది. భారత్‌లో వచ్చే వారం iQoo Z7 pro 5G లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ తాజాగా అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సహా ఇతర వివరాలు వెల్లడికాలేదు.

గత నెలలో ఐకూ ఇండియా సీఈవో నిపున్‌ మార్యా ఐకూ Z7 ప్రో ఫోన్‌ ఫోటోను తన ట్విట్టర్‌ (X) హ్యాండిల్‌ ద్వారా షేర్‌ చేశారు. ఐకూ Z7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ కర్వడ్‌ డస్‌ప్లే, పంచ్‌ హోల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ 6.78 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుంది.

iQOO Z7 Pro 5G smartphone

దీంతోపాటు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత Funtouch OS 13, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌+ 128GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఐకూ కొత్త ఫోన్‌ 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4600mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫోన్‌ వెనుక వైపు 64MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ముందువైపు 16MP కెమెరాతో రానుందని తెలుస్తోంది.

ఈ ఫోన్‌ 25 వేల రూపాయల నుంచి రూ.30000 మధ్య ధరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్‌ ధరలు, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇతర వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే విధంగా విడుదల తేదీపైనా స్పష్టత రావాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త ఐకూ ఫోన్‌ ఈ విభాగంలో వస్తున్న స్మార్ట్‌ఫోన్ల కంటే వేగంగా పనిచేస్తుందని తెలుస్తోంది.

*ఈ సంవత్సరం ప్రారంభంలో ఐకూ నియో 7 ప్రో భారత్‌లో విడుదల అయింది. లాంచింగ్‌ సమయంలో రూ.34,999కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా పనిచేస్తుంది.

ఐకూ నియో 7 ప్రో ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.88 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. f/2.2 అపేచర్‌తో 8MP ఆల్టావైడ్‌ కెమెరా, f/2/4 అపేచర్‌తో 2MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. ముందువైపు f/2.45 అపేచర్‌తో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z7 Pro 5G smartphone details leaked ahead of launch by next week in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X