Home
News

64MP కెమెరా, 5000mAh బ్యాటరీతో iQOO నుంచి కొత్త ఫోన్‌..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐకూ నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌ కానుంది. iQOO Z7 pro 5G ఫోన్‌ ఫస్ట్‌లుక్‌ను సంస్థ విడుదల చేసింది. ఐకూ ఇండియా సీఈవో నిపున్‌ మార్యా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. త్వరలో ఈ ఫోన్ భారత్‌లో లాంచ్‌ కానుంది. అయితే ఎప్పుడు విడుదల కానుందనే సమాచారం వెల్లడించలేదు.

ఐకూ Z7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఈ ఫోన్ పంచ్ హోల్‌ డిస్‌ప్లే కెమెరాతో రానుందని ఫస్ట్‌లుక్‌ ఆధారంగా తెలుస్తోంది. iQOO Z7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.64 అంగుళాల పుల్‌ HD ఐపీఎస్‌ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 1080*2408 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. 396 PPI పిక్సల్‌ డెన్సిటీతో రానుంది.

iqoo z7 pro 5g smartphone

ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 782G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ Adreno 642L GPUతో రానుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత Funtouch OS 13పై పనిచేస్తుంది. ఐకూ Z7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ గీక్‌బెంచ్‌లో నమోదైంది.

ఐకూ Z7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ర్యాపిడ్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 8GB/12GB ర్యామ్‌, 256 అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ర్యామ్‌, అంతర్గత స్టోరేజీ పూర్తి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

ఈ ఫోన్‌ వెనుక వైపు f/1.8 అపేచర్‌తో, వైడ్‌ యాంగిల్‌ 64MP ప్రైమరీ కెమెరా, f/2.4తో 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంటుంది. మరియు LED ప్లాష్‌లైట్‌ సహా ఈ కెమెరాలు డిజిటల్‌ జూమ్‌, ఆటో ప్లాష్‌, ఫేస్‌ డిటెక్షన్‌, టచ్‌ టూ ఫోకస్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ డ్యూయల్‌ 5G, 4G, WiFi, మొబైల్‌ హాట్‌స్పాట్‌, GPS, లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, యాక్సెలోమీటర్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. పవర్‌, వాల్యూమ్ బటన్లు ఫోన్‌ కుడివైపున ఉంటాయి. మరియు సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ఫ్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంటుంది. టైప్‌-c చార్జర్‌తో రానుంది.

ఈ ఐకూ కొత్త ఫోన్‌ ధర, విడుదల తేది వివరాలు వెల్లడించలేదు. విడుదల తేది ప్రకటించాక మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్‌ సుమారుగా 30 వేల రూపాయలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్లపై సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iqoo z7 pro 5g smartphone teased ahead of launch in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X