iQOO నుంచి కొత్త ఫోన్ వివరాలు లీక్.. 64MP OIS కెమెరా, 8GB RAM..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐకూ కొత్త ఫోన్ విడుదల చేయనుంది. iQOO Z7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 31న లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఇటీవల వచ్చిన Vivo S17e రీబ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వివరాల ఆధారంగా ఐకూ కొత్త ఫోన్ వివో S17e తరహా స్పెసిఫికేషన్లను కలిగి ఉంటాయి.
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వివరాలు ఆధారంగా ఐకూ Z7 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల పుల్ HD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4600mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డెమెన్సిటి 7200పై పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత FuntouchOS ఆధారంగా పనిచేస్తుంది. ఐకూ ఫోన్ WiFi 6, బ్లూటూత్ 5.3, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సహా మరిన్ని అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.
ఐకూ Z7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 64MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ప్రధాన కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌తో వస్తుంది. మరియు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. వీడియో కాల్, సెల్ఫీల కోసం ఈ ఫోన్ 16MP కెమెరాతో వస్తుంది.
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ నివేదిక ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8GB ర్యామ్+ 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుందని సమాచారం.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య కొనుగోలుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 31న ఐకూ Z7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. సంస్థ యూట్యూబ్ ద్వారా లైవ్ వీక్షించవచ్చు. అయితే ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర, ఇతర ఫీచర్లపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఆగస్టు 31 తర్వాత ఈ ఫోన్ ఐకూ స్టోర్లు మరియు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ డిజైన్ సహా ఇతర ఫీచర్లతో టీజర్లను ఈ రెండు వెబ్‌సైట్లలో ప్రదర్శనకు ఉంచాయి. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
iQOO Z7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్.. iQOO Z7s 5G కంటే గణనీయమైన అప్‌గ్రేడ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. iQOO Z7s స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.38 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెట్‌తో వస్తుంది. iQOO Z7s 5G స్మార్ట్‌ఫోన్ పంచ్ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








