Home
News

ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు లీక్‌.. 6000mAh బ్యాటరీ సహా కీలక ఫీచర్లు..?

ఐకూ సంస్థ నుంచి మార్చి 12వ తేదీన ఐకూ Z9 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ హై ఎండ్‌ మోడల్‌ త్వరలో లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఐకూ Z9 టర్బో (iQOO Z9 Turbo) ఫోన్‌ ప్రస్తుత బేస్‌ వేరియంట్‌ కంటే మెరుగైవ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ విడుదలపై ఐకూ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

1.5k రిజల్యూషన్‌ డిస్‌ప్లేతో కొత్తఫోన్‌ :
అయితే తాజాగా ఈ ఐకూ Z9 టర్బో హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి. ఇందులో డిస్‌ప్లే, చిప్‌సెట్, బ్యాటరీ సహా మరిన్ని వివరాలు ఉన్నాయి. మరియు లాంచ్‌ తేదీని కూడా అంచనా వేశారు. ఈ ఫోన్‌ డిస్‌ప్లే 2712*1220 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది.

iQOO Z9 Turbo smartphone specs leaked and may launch in india soon

దీంతోపాటు ఈ ఐకూ Z9 టర్బో స్మార్ట్‌ఫోన్‌ V2352A మోడల్‌ నంబర్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని టిప్‌స్టర్‌ అంచనా వేశారు. మరియు క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8S జెన్‌ 2 SoC ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఫోన్‌ వివరాలు మార్చి 18న వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఇటీవల లాంచ్‌ అయిన ఐకూ ఫోన్‌ స్పెసిఫికేషన్లు:
ఇటీవల వచ్చిన ఐకూ Z9 5G స్మార్ట్‌ఫోన్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత FuntouchOS 14 పైన పనిచేస్తుంది. మరియు 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

పుల్‌ HD డిస్‌ప్లే, 256GB ర్యామ్‌ :
ఈ ఐకూ Z9 హ్యాండ్‌సెట్‌ 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వచ్చింది. దీంతోపాటు ఈ ఫోన్‌ IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. మరియు 8GB +128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్లలో లభిస్తోంది.

సోనీ కెమెరా సహా .. :
కెమెరాల విషయానికి వస్తే ఈ ఐకూ ఫోన్ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX802 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో వచ్చింది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ 16MP కెమెరాను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z9 Turbo smartphone specs leaked and may launch in india soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X