ఐకూ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000mAh బ్యాటరీ, 8GB ర్యామ్‌తో త్వరలో లాంచ్..?
ఐకూ నుంచి భారత్‌లో మరో స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. ఐకూ Z9X 5G (iQOO Z9x 5G) త్వరలో విడుదల కానుంది. ఈ హ్యాండ్ సెట్ చైనా, మలేషియాలో లాంచ్ అయింది. తాజాగా ఈ హ్యాండ్ సెట్ తాజాగా ఐకూ ఇండియా వెబ్ సైట్‌లో కనిపించింది. ఫలితంగా ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు వెల్లడయ్యాయి.
ఐకూ Z9X 5G హ్యాండ్ సెట్ ఇటీవల విడుదలైన వివో T3x 5G ఫోన్‌కు రీబ్రాండెడ్ గా వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్లలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఐకూ Z9X 5G హ్యాండ్ సెట్ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే విడుదలపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే స్మార్ట్ వాచ్ ప్రారంభ ధర రూ.13,000 గా ఉండే అవకాశం ఉంది. అయితే వివో T3x స్మార్ట్ ఫోన్‌కు రీబ్రాండెడ్‌గా రానున్న నేపథ్యంలో ఇదే తరహా స్పెసిఫికేషన్లను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ హ్యాండ్ సెట్ 6.72 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లే ను కలిగి ఉండే అవకాశం ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ కానుందని సమాచారం. దీంతోపాటు 4nm స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 FuntouchOS 14 పైన పనిచేసే అవకాశం ఉంది.
దీంతోపాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
భద్రత పరంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా విడుదల కానుందని తెలుస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, వైఫై 6, బ్లూటూత్ 5.1, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుందని సమాచారం.
అయితే ఈ ఐకూ Z9x 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఐకూ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతోపాటు కచ్చితమైన విడుదల తేదీ వివరాలను కూడా సంస్థ వెల్లడించలేదు. భారత సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








