రైల్వే ఈ టికెట్స్ బుకింగ్ చేస్తున్నారా, ఇకపై సేవా పన్ను చెల్లించాలి

By Gizbot Bureau
|

రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్. ఐఆర్‌సీటీసీ వెబ్‌పోర్టల్‌లో ఆన్‌లైన్‌ టికెట్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఫీజు చార్జీలను మళ్లీ విధించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రైల్వే ప్రయాణికులపై భారం పడనుంది. మూడేళ్ల క్రితం రద్దు చేసిన సర్వీస్‌ చార్జిని మళ్లీ అమలుచేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. ఈమేరకు ముంబై మిర్రర్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

Irctc e tickets booking to cost more

దాని ప్రకారం.. 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు, ఆన్‌లైన్‌ టికెట్లపై సర్వీస్‌ చార్జిని తొలగించాలని రైల్వేకు ఆర్థిక శాఖ సూచించింది. అందుకయ్యే భారాన్ని తాము చెల్లిస్తామని తెలిపింది.

  స్లీపర్‌ బోగీలకు రూ. 20, ఏసీ బోగీలకు రూ.40

స్లీపర్‌ బోగీలకు రూ. 20, ఏసీ బోగీలకు రూ.40

ఈ ఏడాది జూలై 19న ఆ చార్జిని పునరుద్ధరించుకోవాలని రైల్వేకు ఆర్థిక శాఖ తెలిపింది.తాము పరిమిత సమయానికి మాత్రమే భారాన్ని భరిస్తామన్నామని తేల్చిచెప్పింది. అప్పటికే రూ.88కోట్ల భారాన్ని రైల్వేకు ఆర్థిక శాఖ చెల్లించాల్సి ఉండగా ఆ మొత్తం చెల్లించినా ఐఆర్‌సీటీసీపై పడుతున్న భారం తీరదని రైల్వే బోర్డుకు అధికారులు నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో సర్వీస్‌ చార్జిని పునరుద్ధరించుకునేందుకు అనుమతినిస్తూ ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు లేఖ రాసిందని ముంబై మిర్రర్‌ పేర్కొంది. సాధారణ స్లీపర్‌ బోగీలకు రూ. 20, ఏసీ బోగీలకు రూ.40 వరకూ ధరలు పెరగనున్నట్లు సమాచారం.

 2016-17లో

2016-17లో

ఇకపోతే సర్వీస్ చార్జీ ఎత్తివేత తర్వాత ఇండియన్ రైల్వే టికెటింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఐఆర్‌సీటీకీ 2016-17లో ఇంటర్నెట్ టికెటింగ్ రెవెన్యూ 26 శాతం తగ్గింది. ఐఆర్‌సీటీసీకి ఏకంగా రూ.88 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని భరించేందుకు ఆర్థిక శాఖ సన్నద్ధంగా లేనందున సర్వీస్ చార్జీ పెంపును సూచిస్తూ.. ఈ శాఖ రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

 తాత్కాలిక వెసులుబాటు
 

తాత్కాలిక వెసులుబాటు

సేవా పన్నుకు సమానమైన మొత్తాన్ని తాము చెల్లించడమన్నది తాత్కాలిక వెసులుబాటు మాత్రమేనని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ మొత్తాన్ని రాబట్టుకోవాలని రేల్వే శాఖ సూచించింది. ఇకపై తాము ఈ భారం భరించలేమని అన్యాపదేశంగా వెల్లడించింది. దీంతో ‘సరైన సమయం'లో ఈ-టికెట్లపై మళ్లీ సేవా పన్నును విధించాలని భారతీయ రైల్వే నిర్ణయించినట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

  కొత్త ఛార్జీలను వసూలు

కొత్త ఛార్జీలను వసూలు

ఇదిలా ఉంటే రీఫండ్ నిబంధనల కింద కొత్త ఛార్జీలను వసూలు చేయనుంది. ఏదైనా ప్రతికూల పరిస్థితుల వల్ల రైళ్లు రద్దు అయితే టికెట్ ఛార్జీలను రీఫండ్ చేయనుంది. తన అధికారిక వెబ్ సైట్ irctc.co.in మెబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ టికెట్ రద్దు చేసే సదుపాయాన్ని అందిస్తోంది. రైలు బయలుదేరడానికి 48 గంటల ముందే టికెట్ రద్దు చేసుకున్నట్లు అయితే కొద్దిపాటి ఛార్జీలు ప్రయాణికులు భరించాల్సిఉంటుంది.రిఫండ్ మొత్తం బ్యాంక్ అకౌంట్‌కు జమవుతుంది. చార్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు. ఎలాంటి రిఫండ్ రాదు.

  ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం ఎలా ?

ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం ఎలా ?

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు వెళ్లండి. ఐఆర్‌సీటీసీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వంటి అకౌంట్ వివరాలతో లాగిన్ అవ్వండి. మై అకౌంట్ సెక్షన్‌లోని మై ట్రాన్సాక్షన్స్ కింద ఉన్న బుక్‌డ్ టికెట్ హిస్టరీపై క్లిక్ చేయండి. క్యాన్సల్ చేయాలని భావిస్తున్న టికెట్‌ను ఎంచుకోండి. క్యాన్సల్ టికెట్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ టికెట్లు క్యాన్సల్ అవుతాయి. రిఫండ్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు వస్తాయి.

పెరగనున్న సర్వీస్ ఛార్జీలు

పెరగనున్న సర్వీస్ ఛార్జీలు

ఇదిలా ఉంటే రైల్వేలో ప్రయాణం కాస్త ఖరీదు కానుంది! అయితే IRCTC వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకునే రైల్వే టిక్కెట్స్ ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది. ఇదివరకు ఉన్న సర్వీస్ ఛార్జీలను ఇండియన్ రైల్వేస్ తిరిగి ప్రవేశ పెట్టే అవకాశముందని చెబుతున్నారు. ఈ సర్వీస్ ఛార్జీ రూ.20 నుంచి రూ.40 మధ్య ఉండే అవకాశముంది.

Best Mobiles in India

English summary
Booking e-tickets on IRCTC portal to cost more

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X