రైల్వే టికెట్ కోసం "బుక్ నౌ పే లేటర్" ఫీచర్ ను మొదలెట్టిన IRCTC

|

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC ) ఇప్పుడు వినియోగదారులకు ముందుగా ఎటువంటి మొత్తంను చెల్లించకుండా ఇండియన్ రైల్వే టికెట్ బుక్ చేసుకోవడానికి అనుమతిస్తోంది. అవును మీరు విన్నది నిజం. కాని మీరు తరువాత మాత్రం రైల్వే టికెట్ కోసం డబ్బును చెల్లించవలసి ఉంటుంది. IRCTC కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సర్వీసును 'బుక్ నౌ, పే లేటర్' అని పిలుస్తారు.

IRCTC
 

ఇప్పుడు "ఇ-పే లేటర్" ఎంపికతో IRCTC నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. IRCTC ఇప్పుడు రిజర్వు చేసిన టికెట్ మరియు తత్కాల్ టిక్కెట్ల కోసం కొత్త సర్వీసును ప్రారంభించింది. రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో డబ్బును చెల్లించలేని వారికి సహాయం చేయడం కోసం ఇండియన్ రైల్వే ఈ కొత్త సర్వీసును ప్రారంభించింది. ఇ-టికెట్ల చెల్లింపు కోసం ఈ కొత్త సౌకర్యం ఇపే లేటర్ ద్వారా లభిస్తుందని గమనించండి. ఈ కొత్త సర్వీస్ ద్వారా టికెట్ లను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ పేలో 2 లక్షల రివార్డులను పొందడం ఎలా?

IRCTCలో‘ఇ-పే లేటర్’ ఆప్షన్ ఉపయోగించి టికెట్ బుక్ చేసుకోవడం ఎలా

IRCTCలో‘ఇ-పే లేటర్’ ఆప్షన్ ఉపయోగించి టికెట్ బుక్ చేసుకోవడం ఎలా

కొత్త సర్వీస్ ఆధారంగా టికెట్ ను బుక్ చేసుకోవడానికి మొదటగా మీరు మీ IRCTC అకౌంట్ లో లాగిన్ అవ్వాలి. ఆ తరువాత టికెట్ బుక్ చేసుకోవడానికి మీరు ప్రయాణం చేయగల పూర్తి వివరాలను నింపండి. తరువాత మీరు పేమెంట్ పేజీకి చేరుకున్న తర్వాత మీరు ‘పే లేటర్' ఎంపికను కొత్తగా చూస్తారు.

Jio VS BSNL న్యూ ఇయర్ ప్లాన్స్... ఈ ఆఫర్ల పోటీలో గెలుపు ఎవరిదీ?

ePayLater

మీరు ఈ ఎంపికపై క్లిక్ చేస్తే కనుక మీరు ePayLater కు మళ్ళించబడతారు. అప్పుడు మీరు మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి ‘ఇ-పే లేటర్' వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీకు OTP లభిస్తుంది. మీరు OTP ను సరిగ్గా నమోదు చేస్తే మీ లాగిన్ విజయవంతమవుతుంది. ఇప్పుడు మీరు మీ బుకింగ్ మొత్తాన్ని ధృవీకరించాలి. ఇలా చేసిన తరువాత మీ యొక్క టికెట్ బుక్ చేయబడుతుంది.

ఓపెన్ సేల్స్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ లో Realme X2 సేల్స్

బుకింగ్
 

ఇ-పే లేటర్ వెబ్‌సైట్ ప్రకారం మీ పేమెంట్ ను పరిష్కరించడానికి వినియోగదారులకు వారి లావాదేవీ తేదీ నుండి 14 రోజుల వ్యవధి ఉంటుంది. "బుకింగ్ సమయంలో చెల్లించాల్సిన అవసరం లేకుండా లేదా సుదీర్ఘమైన బ్యాంక్ వివరాలను తెలుపడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐఆర్‌సిటిసి యాప్ సురక్షితంగా ఉంటుంది" అని కంపెనీ పేర్కొంది. వినియోగదారుడు 14 రోజుల్లో టికెట్ ధర చెల్లించడంలో విఫలమైతే అతడు లేదా ఆమె దానికి వర్తించే పన్నులతో సహా 3.50 శాతం వడ్డీ ఛార్జీని చెల్లించవలసి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
IRCTC Launches "Book Now-Pay Later" Feature For Book Advance Railway Ticket

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X