రైలు ప్రయాణికులకు శుభవార్త IRCTCలో కొత్త ఫీచర్ వచ్చింది
భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) సరికొత్త ఫీచర్లతో ముందుకు వచ్చింది.
భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) సరికొత్త ఫీచర్లతో ముందుకు వచ్చింది. తమ యూజర్ల కోసం వెబ్‌సైట్‌లో భారీ మార్పులను చేపట్టింది.ఇప్పుడు లేటెస్ట్ గా 'iPay' పేరుతో డిజిటల్ పేమెంట్ గేట్‌వే ను ఐఆర్‌సిటిసి ప్రారంభించింది ఆన్‌లైన్ ట్రావెల్ సంబంధిత సేవల్ని మరింత సులభంగా పొందేందుకు ప్రత్యేకంగా రైలు ప్రయాణికుల కోసం రూపొందించిన సర్వీస్ అని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.

ఐఆర్‌సిటిసి iPay
ఐఆర్‌సిటిసి ఈ 'iPay' ప్రారంభించడంతో రైలు ప్రయాణికులు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఐఆర్‌సీటీసీ iPay ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నేషనల్ కార్డులు ఉపయోగించి పేమెంట్స్ చేయొచ్చు.

త్వరలో ఐఆర్‌సిటిసి ప్రీపెయిడ్ కార్డు కమ్ వ్యాలెట్
త్వరలో ఐఆర్‌సిటిసి ప్రీపెయిడ్ కార్డు కమ్ వ్యాలెట్,ఆటో డెబిట్ వంటి సదుపాయాలు కూడా రానున్నాయి.

పేమెంట్స్ ఫెయిల్యూర్స్ పూర్తిగా
ఈ iPay ను ప్రారంభించడం వల్ల పేమెంట్స్ ఫెయిల్యూర్స్ పూర్తిగా తగ్గిపోతుందని ఐఆర్‌సీటీసీ చెబుతోంది.ఒకవేళ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ అన్ సక్సెఫుల్ అయిన లేదా వేరే లోపాలు సంభవించినప్పుడు ఇతర ఇంటర్మీడియట్ సోర్స్ మీద ఆధారపడకుండా నేరుగా బ్యాంకును సంప్రదిస్తామని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

ఐఆర్‌సిటిసి వారి సర్వే లెన్స్ కింద
ఐఆర్‌సిటిసి వారి సర్వే లెన్స్ కింద ఇతర ప్రభుత్వ వ్యాపారాలకు అనుకూలీకరించిన చెల్లింపు ఎంపికలను అందించగలదని పేర్కొంది. ఐఆర్‌సిటిసి యొక్క టెక్నాలజీ పార్టనర్ ఢిల్లీ బేస్డ్ MMAD కమ్యూనికేషన్స్ బ్యాక్ ఎండ్ మద్దతును అందిస్తుంది.


Click it and Unblock the Notifications








