విశ్రాంత గదులను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ

Posted By:

ఆన్‌లైన్ రైల్వే టికెట్ బుకింగ్ సేవలను అందిస్తున్న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నేరుగా ఆన్‌లైన్ ద్వారా రైల్వే స్టేషన్‌లలోని విశ్రాంత గదుల (రిటైరింగ్ రూమ్స్)ను బుక్ చేసేకునే సదుపాయాన్ని ప్రారంభించింది.

రైల్వే స్టేషన్లలో విశ్రాంత గదులను ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకోవచ్చు!

ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురావటం ద్వారా ఆన్‌లైన్ ద్వారా రైల్వే టికెట్లను బక్ చేసుకుంటున్న వినియోగదారులకు విశ్రాంత గదులను పొందటం మరింత సులభతరమవుతుంది.

సీటు నిర్థారణ అయినా/ఆర్ఏసీ పీఎన్ఆర్‌తో ఎవరైనా విశ్రాంతి గదిని బుక్ చేసుకోవచ్చు. అది కౌంటర్ కావొచ్చు లేదా ఈ-టికెట్ కావొచ్చని ఐఆర్ సీటీసీ అధికారి ప్రదీప్ కందు శుక్రవారంతెలిపారు. ప్రస్తుతం ఈ సదుపాయం ముంబైలో అమల్లో ఉంది. దీనిని దిశలవారీగా ఢిల్లీ, కోల్ కతా ఇంకా ఇతర ప్రధాన నగరాల రైల్వే స్టేషన్‌లలో త్వరలో విస్తరింపజేస్తారు.

ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్‌లను వేగవంతంగా బుక్ చేయటమెలా..?

కొంత అదనపు రుసుముతో అదే రోజు ప్రయాణానికి టిక్కెట్లను తత్కాల్ ద్వారా రిజర్వ్ చేయించుకోవచ్చు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో లేదా ఇంటర్నెట్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ టిగెంగ్ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఉదయం పది గంటలలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ ద్వారా ఐర్‌సీటీసీ తత్కాల్ టికెట్‌లను వేగవంతంగా బుక్ చేసుకేనే మార్గాలను మీముందుంచుతున్నాం.

ముందుగా నోట్‌ప్యాడ్‌ను ఓపెన్ చేసి టికెట్ బుకింగ్ అవసరమైన వివరాలను ( పేరు, వయసు, ప్రూఫ్, డ్రైవింగె లెసెన్స్ లేదా పాన్ కార్డ్ వివరాలు) నమోదు చేసుకుని సేవ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో సమయం ఆదా అవుతుంది. 9.45 గంటలకు ఐఆర్ సీటీసీ సైట్‌లోకి లాగిన్ అవ్వండి. సైట్‌లోకి లాగిన్ అయిన వెంటనే వెబ్‌సైట్‌లోని సర్వర్ టైంను చెక్ చేసుకోండి. మీరు వెళ్లాల్సిన గమ్మస్థానానికి సంబంధించిని వివరాలను ఎంచుకోండి.

సర్వర్ టైమ్ 10గంటలు కాగానే బుక్ బటన్ పై క్లిక్ చేయండి. ఇలాంటి సందర్భాల్లో చాలా సార్లు ‘Service unavailable' అని చూపిస్తుంటుంది. ఈ సమస్య తలెత్తినప్పుడు విండోను క్లోజ్ చేయటం లేదా బ్యాక్ బటన్‌ను నొక్కదు. పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

కాప్సా (ఆంగ్ల పదాలతో తికమకగా ఉండే సెక్యూరిటీ కోడ్) ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అసహనానికి లోనుకాకుండా కొత్త కాప్చాను ఎంచుకోండి. పేమెంట్ చెల్లించే సమయంలో చాలా సార్లు ‘Service unavailable' అని చూపిస్తుంటుంది. ఇటువంటి సమస్య తలెత్తినప్పుడు విండోను క్లోజ్ చేయటం లేదా బ్యాక్ బటన్‌ను నొక్కదు. పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

బ్యాంక్ చెల్లింపు ప్రక్రియ పూర్తికాగానే విండోను క్లోజ్ చేయకండి. మీ లావాదేవీ సక్రమంగా నిర్వహించబడినదని నిర్థారించుకున్న తరువాతనే విండోను క్లోస్ చేసేందుకు పూనుకోండి. తత్కాల్ బుకింగ్ సమయంలోనే ఓర్సు సహనం ఎంతో ముఖ్యం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot