ఐఆర్‌సీటీసీ విండోస్ ఫోన్ అప్లికేషన్ ఆవిష్కరణ

Posted By:

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తన ఆన్‌లైన్ ఈ -టికెటింగ్ సర్వీసులను మరింత విస్తరింపజేసే క్రమంలో విండోస్8 ప్లాట్‌ఫామ్ పై స్పందించే సరికొత్త ఐఆర్‌సీటీసీ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ విండోస్ 8 ఫోన్ కోసం ఉచిత ఐఆర్‌సీటీసీ అప్లికేషన్

ఐఆర్‌సీటీసీ ఆవిష్కరించిన ఈ ప్రత్యేక ఐఆర్‌సీటీసీ రైల్వే టికెట్ బుకింగ్ అప్లికేషన్ కేవలం విండోస్ ఫోన్ ఇంకా విండోస్ 8 పరికరాలను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ఐఆర్‌సీటీసీ యాప్‍‌‌ను మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో వృద్ధి చేయటం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా విండోస్ ఫోన్ యూజర్లు తమ ప్రయాణాలకు సంబంధించి టికెట్లను బుక్ చేసుకోవటంతో పాటు పీఎన్ఆర్ స్టేటస్ మొదలుగు లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్న ఐఆర్‌సీటీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot