మీరు తరచూ రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారా.. ఈ కొత్త నిబంధనల గురించి తెలుసా?
భారతీయ రైళ్లలో ప్రయాణికులు సౌకర్యం మరియు భద్రత కోసం ఇటీవల IRCTC కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. రైలు లోయర్ బెర్త్ రిజర్వేషన్ కేటాయింపులు, మొబైల్, ల్యాప్‌టాప్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ఛార్జింగ్ సమయాల్లోనూ మార్పులు చేసింది. దీంతోపాటు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని వెల్లడించింది. రైల్వే ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసమే ఈ నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది.
రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ఇటీవల రైల్వే అనేక చర్యలు తీసుకుంటోంది. టికెట్ల జారీ విధానంతోపాటు రైల్వే స్టేషన్‌లలో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. జనరల్ టికెట్‌ల జారీని కూడా సులభతరం చేసింది. జనరల్, ప్లాట్‌ఫారమ్ టికెట్లను బుకింగ్ చేసుకొనేందుకు UTS యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా గంటల తరబడి క్యూ లైన్‌లలో నిరీక్షణకు తెరపడినట్లు అయింది.

సాధారణంగా ఎక్కువ మంది దూర ప్రయాణాలకు రైల్వేలను వినియోగిస్తుంటారు. ప్రయాణాల్లో వారి వెంట స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను తీసుకెళ్తుంటారు. వాటిని ఛార్జింగ్ చేస్తున్న సమయాల్లో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. రాత్రింతా ఛార్జింగ్ పెట్టి నిద్రపోతుంటారు. దీంతో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే కొత్త నిబంధలు, ఆంక్షలను విధించింది.
IRCTC కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులు తమ ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, పవర్ బ్యాంక్ సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్య ఛార్జింగ్ చేయకూడదని తెలిపింది. ఈ ఆంక్షలు విధించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా వెల్లడించింది. రాత్రి వేళల్లో జరిగే అగ్నిప్రమాదాలను నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
దీంతోపాటు లోయర్ బెర్త్ రిజర్వేషన్‌లలో వృద్దులు, దివ్యాంగులు, గర్భిణులకు ప్రాధాన్యత ఇస్తామని IRCTC వెల్లడించింది. ఇతరులు లోయర్ బెర్త్‌లను తమ ప్రాధాన్యతలుగా ఎంచుకుంటే వయస్సు ఆధారంగా కేటాయింపులు చేస్తామని వెల్లడించింది. దీంతోపాటు జరిమానాల వివరాలను కూడా వెల్లడించింది.
రైళ్లలో మద్యం సేవించి ప్రయాణం చేసినా, మద్యం బాటిళ్లు తీసుకెళ్లినా రూ.500 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని వెల్లడించింది. గ్యాస్ సిలిండర్లు, కిరోసిన్, ప్రెటోల్, డీజిల్, క్రాకర్లు సహా యాసిడ్ వంటివి మండే గుణం కలిగిన పదార్థాలను ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లకూడదని వెల్లడించింది.
రైళ్లలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు IRCTC ఈ తరహా నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. కొంత మంది ప్రయాణికులు రైళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తమ వెంట ఉన్న గ్యాడ్జెట్‌లను ఛార్జింగ్ చేయడం సహా రాత్రంతా అలానే విడిచిపెడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. లేదా స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లు పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications