ఇక రిజర్వేషన్ కౌంటర్స్‌లో బుక్ చేసుకున్న ట్రెయిన్ టికెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చు
ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్న ట్రెయిన్ టికెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఇండియన్ రైల్వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్న ట్రెయిన్ టికెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఇండియన్ రైల్వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా అప్‌డేట్ నేపథ్యంలో రిజర్వేషన్ కౌంటర్స్‌లో బుక్ చేసుకున్న ట్రెయిన్ టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది.

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..
కౌంటర్స్‌లో బుక్ చేసుకున్న టికెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకునే క్రమంలో యూజర్లు ముందుగా IRCTC వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తరువాత ‘Trains' సబ్‌హెడ్డింగ్ క్రింద కనిపించే ‘Cancel Ticket' మెనూను సెలక్ట్ చేసుకోవాలి. ఈ మెనూలో ‘Counter Ticket' అనే ఆప్షన్‌ను మీరు సెలక్ట్ చేసుకున్నట్లయితే వేరొక పేజీలోకి మీరు రీడైరెక్ట్ కాబడతారు.

Cancel Ticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి..
ఈ పేజీలో మీ ట్రెయిన్ టికెట్‌కు సంబంధించి పీఎన్ఆర్ నెంబర్ అలానే ట్రెయిన్ నెంబర్‌లను ఎంటర్ చేయాలి. డిటెయిల్స్ ఎంటర్ చేసిన తరువాత టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను ఓకే చేసి ‘Submit' బటన్ పై క్లిక్ చేసినట్లయితే, టికెట్ బుకింగ్ సమయంలో మీరిచ్చిన మొబైల్ నెంబర్‌కు ఓ OTP వస్తుంది. ఈ ఓటీపీని సంబంధిత కాలమ్‌లో ఎంటర్‌చేసి Cancel Ticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

రీఫండ్ అమౌంట్ అక్కడికే వెళ్లి తీసుకోవచ్చు..
టికెట్ క్యాన్సిల్ అయిన వెంటనే అదే మొబైల్ నెంబర్‌కు సంబంధిత పీఎన్ఆర్ నెంబర్‌తో పాటు రీఫండ్ అమౌంట్ డిటెయిల్స్ పంపబడతాయి. రీఫండ్ అమౌంట్‌ను మీరు టికెట్ బుక్ చేసుకున్న రిజర్వేషన్ కౌంటర్ నుంచి లేదా సమీపంలో శాటిలైట్ పీఆర్ఎస్ స్టేషన్ నుంచీ యూజర్లు పొందవచ్చు.

నాలుగు గంటల ముందే ప్రాసెస్ కంప్లీట్ చేయాలి..
రిజర్వేషన్ కౌంటర్స్‌లో బుక్ చేసకున్న టికెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవాలనుకునే యూజర్లు ప్రయాణానికి నాలుగు గంటల ముందే ఈ ప్రాసెస్‌ను కంప్లీట్ చేయవల్సి ఉంటుంది. RAC/Waitlistలో ఉన్న టికెట్లను ప్రయాణానికి 30 నిమిషాల ముందే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంది. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని ఇండియన్ రైల్వేస్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








