ఐఆర్‌సిటిసి రీఫండ్ నిబంధనలు మారాయి,చెక్ చేసుకోండి

By Gizbot Bureau
|

రైల్వే ప్రయాణం చేసేవారు వారి జర్నీకి చాలా రోజులు ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటారు.అప్పటికప్పుడు టికెట్లు అందుబాటులో ఉండకపోవచ్చు. తత్కాల్‌లో టికెట్లను బుక్ చేసుకుందామంటే ఎక్కువ డబ్బులు చెల్లించాలి.అందువల్ల చాలా మంది టికెట్లను ముందుగానే బుక్ చేసుకుంటారు.అయితే కొన్ని సందర్భాల్లో ప్రయాణం రద్దు కావొచ్చు.

 Indian Railways refunds rules for cancellation of e-tickets

ఊహించని కారణాల వల్ల జర్నీ క్యాన్సిల్ చేసుకోవలసి రావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవలసి వస్తుంది. రైల్వే టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌లో టికెట్లను క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. అయితే ఐఆర్‌సిటిసి కొత్త రీఫండ్ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది.

కొత్త ఛార్జీలను వసూలు

కొత్త ఛార్జీలను వసూలు

రీఫండ్ నిబంధనల కింద కొత్త ఛార్జీలను వసూలు చేయనుంది. ఏదైనా ప్రతికూల పరిస్థితుల వల్ల రైళ్లు రద్దు అయితే టికెట్ ఛార్జీలను రీఫండ్ చేయనుంది. తన అధికారిక వెబ్ సైట్ irctc.co.in మెబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ టికెట్ రద్దు చేసే సదుపాయాన్ని అందిస్తోంది. రైలు బయలుదేరడానికి 48 గంటల ముందే టికెట్ రద్దు చేసుకున్నట్లు అయితే కొద్దిపాటి ఛార్జీలు ప్రయాణికులు భరించాల్సిఉంటుంది.

బ్యాంక్ అకౌంట్‌కు జమ

బ్యాంక్ అకౌంట్‌కు జమ

రిఫండ్ మొత్తం బ్యాంక్ అకౌంట్‌కు జమవుతుంది. చార్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు. ఎలాంటి రిఫండ్ రాదు.

 ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం ఎలా ?

ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం ఎలా ?

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు వెళ్లండి. ఐఆర్‌సీటీసీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వంటి అకౌంట్ వివరాలతో లాగిన్ అవ్వండి. మై అకౌంట్ సెక్షన్‌లోని మై ట్రాన్సాక్షన్స్ కింద ఉన్న బుక్‌డ్ టికెట్ హిస్టరీపై క్లిక్ చేయండి. క్యాన్సల్ చేయాలని భావిస్తున్న టికెట్‌ను ఎంచుకోండి. క్యాన్సల్ టికెట్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ టికెట్లు క్యాన్సల్ అవుతాయి. రిఫండ్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు వస్తాయి.

 పెరగనున్న సర్వీస్ ఛార్జీలు

పెరగనున్న సర్వీస్ ఛార్జీలు

ఇదిలా ఉంటే రైల్వేలో ప్రయాణం కాస్త ఖరీదు కానుంది! అయితే IRCTC వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకునే రైల్వే టిక్కెట్స్ ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది. ఇదివరకు ఉన్న సర్వీస్ ఛార్జీలను ఇండియన్ రైల్వేస్ తిరిగి ప్రవేశ పెట్టే అవకాశముందని చెబుతున్నారు. ఈ సర్వీస్ ఛార్జీ రూ.20 నుంచి రూ.40 మధ్య ఉండే అవకాశముంది.

Best Mobiles in India

English summary
IRCTC refund rules 2019: Indian Railways' refunds rules for cancellation of e-tickets

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X