రైలు ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన IRCTC

రైలు ప్రయాణీకులకు IRCTC(Indian Railway Catering and Tourism Corporation) మంచి శుభవార్తను మోసుకొచ్చింది. 'Charts/Vacancy' పేరిట సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

|

రైలు ప్రయాణీకులకు IRCTC(Indian Railway Catering and Tourism Corporation) మంచి శుభవార్తను మోసుకొచ్చింది. 'Charts/Vacancy' పేరిట సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పటిదాకా IRCTC లో కేవలం టికెట్ మాత్రం బుక్ చేసుకునే వీలుండేది అయితే ఇప్పుడు ఈ ఫీచర్ ద్వారా ప్ర‌యాణికులు తాము ప్ర‌యాణించాల‌నుకున్న రైలులో ఖాళీగా ఉన్న బెర్తుల వివ‌రాల‌ను టీటీఈతో సంబంధం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవ‌చ్చు. వెబ్ అలాగే మొబైల్ వెర్షన్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఈ రోజు నుంచి షియోమి Mi TV 4A Pro 32 సేల్ షురూ..!ఈ రోజు నుంచి షియోమి Mi TV 4A Pro 32 సేల్ షురూ..!

IRCTC  వెబ్‌సైట్‌లో రిజర్వేషన్ చార్టులను  ఇలా చెక్ చేయండి

IRCTC వెబ్‌సైట్‌లో రిజర్వేషన్ చార్టులను ఇలా చెక్ చేయండి

- IRCTC వెబ్‌సైట్‌లో 'Charts/Vacancy' అనే కొత్త ఆప్షన్ అందుబాటులో ఉంటుంది అది గమనించండి
- మీరు ట్రైన్ నెంబర్ , ప్రయాణ తేదీ మరియు బోర్డింగ్ స్టేషన్ వంటి ప్రయాణ వివరాలను అందించాలి.
- ఆ తరువాత క్లాస్ వారీగా మరియు కోచ్-వారీగా ఖాళీగా ఉన్న బెర్తుల సంఖ్య చూడవచ్చు
- మీరు బెర్త్-వారీగా అకామడేషన్ స్టేటస్ తో పాటు లేఅవుట్ ను చూడటానికి ప్రత్యేక కోచ్ మీద కూడా క్లిక్ చేయవచ్చు.

IRCTC యొక్క కొత్త ఫీచర్ గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది

IRCTC యొక్క కొత్త ఫీచర్ గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది

- ఇండియన్ రైల్వేస్ వెబ్‌సైట్‌ IRCTC, బుక్ చేయబడిన సీట్లు, ఖాళీలు మరియు పాక్షికంగా బుక్ సీటింగ్ లేఅవుట్ ను వేర్వేరు రంగులతో ప్రదర్శిస్తుంది.
- ఈ కొత్త వ్యవస్థ భారతీయ రైల్వే రిజర్వు రైళ్లలో ఉపయోగించే తొమ్మిది తరగతుల కోచ్ లేఅవుట్ను ప్రదర్శిస్తుంది మరియు 120 కన్నా ఎక్కువ కోచ్ లేఅవుట్లు చేర్చబడ్డాయి.
- ఈ ఫీచర్ రైలు యొక్క మొదటి చార్ట్ ప్రకారం తరగతి వారీగా మరియు కోచ్ వారీగా ఖాళీగా ఉన్న బెర్త్ లభ్యత సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఫస్ట్ చార్ట్ ట్రైన్ డిపార్చర్ అయ్యే 4గంటల ముందే సిద్ధం అవుతుంది
- రెండవ చార్ట్ కూడా సిద్ధంగా ఉంటే, రెండవ చార్ట్ సమయంలో అందుబాటులో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను వీక్షించే అవకాశం కూడా ప్రదర్శించబడుతుంది. రెండవ చార్టులో రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు సిద్ధమవుతుంది

IRCTC  ఇప్పుడు లేటెస్ట్ గా 'iPay' పేరుతో డిజిటల్ పేమెంట్ గేట్‌వే ను ప్రారంభించింది

IRCTC ఇప్పుడు లేటెస్ట్ గా 'iPay' పేరుతో డిజిటల్ పేమెంట్ గేట్‌వే ను ప్రారంభించింది

IRCTC ఇప్పుడు లేటెస్ట్ గా 'iPay' పేరుతో డిజిటల్ పేమెంట్ గేట్‌వే ను ప్రారంభించింది ఆన్‌లైన్ ట్రావెల్ సంబంధిత సేవల్ని మరింత సులభంగా పొందేందుకు ప్రత్యేకంగా రైలు ప్రయాణికుల కోసం రూపొందించిన సర్వీస్ అని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.

IRCTC  iPay

IRCTC iPay

IRCTC ఈ 'iPay' ప్రారంభించడంతో రైలు ప్రయాణికులు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. IRCTC iPay ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నేషనల్ కార్డులు ఉపయోగించి పేమెంట్స్ చేయొచ్చు.

త్వరలో IRCTC ప్రీపెయిడ్ కార్డు కమ్ వ్యాలెట్

త్వరలో IRCTC ప్రీపెయిడ్ కార్డు కమ్ వ్యాలెట్

త్వరలో IRCTC ప్రీపెయిడ్ కార్డు కమ్ వ్యాలెట్,ఆటో డెబిట్ వంటి సదుపాయాలు కూడా రానున్నాయి.

పేమెంట్స్ ఫెయిల్యూర్స్ పూర్తిగా

పేమెంట్స్ ఫెయిల్యూర్స్ పూర్తిగా

ఈ iPay ను ప్రారంభించడం వల్ల పేమెంట్స్ ఫెయిల్యూర్స్ పూర్తిగా తగ్గిపోతుందని ఐఆర్‌సీటీసీ చెబుతోంది.ఒకవేళ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ అన్ సక్సెఫుల్ అయిన లేదా వేరే లోపాలు సంభవించినప్పుడు ఇతర ఇంటర్మీడియట్ సోర్స్ మీద ఆధారపడకుండా నేరుగా బ్యాంకును సంప్రదిస్తామని IRCTC వెల్లడించింది.

IRCTC వారి సర్వే లెన్స్ కింద

IRCTC వారి సర్వే లెన్స్ కింద

IRCTC వారి సర్వే లెన్స్ కింద ఇతర ప్రభుత్వ వ్యాపారాలకు అనుకూలీకరించిన చెల్లింపు ఎంపికలను అందించగలదని పేర్కొంది. IRCTC యొక్క టెక్నాలజీ పార్టనర్ ఢిల్లీ బేస్డ్ MMAD కమ్యూనికేషన్స్ బ్యాక్ ఎండ్ మద్దతును అందిస్తుంది.

Best Mobiles in India

English summary
IRCTC’s new feature: Check vacant train seats, reservation chart online.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X