ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్‌లను వేగవంతంగా బుక్ చేయటమెలా..?

|

రైల్వే టికెట్‌లను ఆన్‌లైన్‌‌లో బుక్ చేసుకునేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఒక్కటే మార్గం. అనుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చినపుడు అప్పటికప్పుడు రైలు టిక్కెట్ రిజర్వేషన్ అంటే కుదరదు. ఏ ట్రెయిన్ చూసినా ఎసీ ఫస్ట్‌క్లాసు మొదలు సీటింగ్ వరకు అన్నీ సాధారణంగా వెయిట్ లిస్టులోనే ఉంటాయి. అటువంటి ప్రయాణికుల కోసం అంటూ తత్కాల్ విధానాన్ని రైల్వేలు ప్రారంభించాయి.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

 

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్‌లను వేగవంతంగా బుక్ చేయటమెలా..?

కొంత అదనపు రుసుముతో అదే రోజు ప్రయాణానికి టిక్కెట్లను తత్కాల్ ద్వారా రిజర్వ్ చేయించుకోవచ్చు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో లేదా ఇంటర్నెట్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ టిగెంగ్ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఉదయం పది గంటలలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ ద్వారా ఐర్‌సీటీసీ తత్కాల్ టికెట్‌లను వేగవంతంగా బుక్ చేసుకేనే మార్గాలను మీముందుంచుతున్నాం.

ముందుగా నోట్‌ప్యాడ్‌ను ఓపెన్ చేసి టికెట్ బుకింగ్ అవసరమైన వివరాలను ( పేరు, వయసు, ప్రూఫ్, డ్రైవింగె లెసెన్స్ లేదా పాన్ కార్డ్ వివరాలు) నమోదు చేసుకుని సేవ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో సమయం ఆదా అవుతుంది. 9.45 గంటలకు ఐఆర్ సీటీసీ సైట్‌లోకి లాగిన్ అవ్వండి. సైట్‌లోకి లాగిన్ అయిన వెంటనే వెబ్‌సైట్‌లోని సర్వర్ టైంను చెక్ చేసుకోండి. మీరు వెళ్లాల్సిన గమ్మస్థానానికి సంబంధించిని వివరాలను ఎంచుకోండి.

సర్వర్ టైమ్ 10గంటలు కాగానే బుక్ బటన్ పై క్లిక్ చేయండి. ఇలాంటి సందర్భాల్లో చాలా సార్లు ‘Service unavailable' అని చూపిస్తుంటుంది. ఈ సమస్య తలెత్తినప్పుడు విండోను క్లోజ్ చేయటం లేదా బ్యాక్ బటన్‌ను నొక్కదు. పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

కాప్సా (ఆంగ్ల పదాలతో తికమకగా ఉండే సెక్యూరిటీ కోడ్) ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అసహనానికి లోనుకాకుండా కొత్త కాప్చాను ఎంచుకోండి. పేమెంట్ చెల్లించే సమయంలో చాలా సార్లు ‘Service unavailable' అని చూపిస్తుంటుంది. ఇటువంటి సమస్య తలెత్తినప్పుడు విండోను క్లోజ్ చేయటం లేదా బ్యాక్ బటన్‌ను నొక్కదు. పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

బ్యాంక్ చెల్లింపు ప్రక్రియ పూర్తికాగానే విండోను క్లోజ్ చేయకండి. మీ లావాదేవీ సక్రమంగా నిర్వహించబడినదని నిర్థారించుకున్న తరువాతనే విండోను క్లోస్ చేసేందుకు పూనుకోండి. తత్కాల్ బుకింగ్ సమయంలోనే ఓర్సు సహనం ఎంతో ముఖ్యం.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యేందుకు లింక్ అడ్రస్: www.irctc.co.in.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X