బుకింగ్‌కి 25 సెకన్లు,పేమెంట్‌కు 5 సెకన్లు,IRCTC 10 కొత్త రూల్స్ తెలుసుకోండి

మారిన IRCTC ట్రైన్ టికెట్ రిజర్వేషన్స్ రూల్స్, మొత్తం 10 రకాల రూల్స్ గురించి తెలుసుకోండి.

|

దేశంలో అతి పెద్ద రవాణా సంస్థ ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ తీసుకుస్తూనే ఉంది. మొన్నటికి మొన్న వెబ్ సైట్లో మార్పులు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ సరికొత్త మార్పులతో వినియోగదారులను ఆకర్షించేందుకు రెడీ అయింది. మొత్తం 10 రకాల రూల్స్ ను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ముఖ్యంగా సమయంపై నియంత్రణ విధించింది. టికెట్ గడువు తేదీలను పెంచింది. IRCTC కొత్తగా తీసుకొచ్చిన ఓ 10 రూల్స్ మీకందిస్తున్నాం.మారిన నిబంధనలను ఓ సారి చెక్ చేసుకోండి.

IRCTC వెబ్‌సైట్‌లో భారీ మార్పులు, కొత్తగా వచ్చిన స్టన్నింగ్ ఫీచర్లు ఇవేIRCTC వెబ్‌సైట్‌లో భారీ మార్పులు, కొత్తగా వచ్చిన స్టన్నింగ్ ఫీచర్లు ఇవే

మొదటి రూల్

మొదటి రూల్

passenger తమ టికెట్లను ఇకపై 120 రోజులు ముందుగా బుక్ చేసుకోవచ్చు.ఒక వినియోగదారుడు ఒక ఐడీ మీద నెలకు ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. ఇక ఆధార్ వెరిఫై పూర్తి అయితే, నెలకు 12 టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

2వ రూల్

2వ రూల్

10 నుంచి 12 గంటల మధ్య ఒక యూజర్ ఐడీపై రెండు టికెట్లను మాత్రమే ఇస్తారు.ఇకపై ఏసీ తరగతులకు ఉదయం 10 గంటల నుంచి, స్లీపర్ క్లాస్ కు 11 గంటల నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది.

3వ రూల్

3వ రూల్

తత్కాల్ టికెట్ల బుక్ చేసుకునే సమయంలో ఒక యూజర్ ఐడీ మీద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో కేవలం రెండు టికెట్లకు మాత్రమే బుకింగ్ అనుమతి ఉంటుంది.

4వ రూల్

4వ రూల్

కేవలం ఒకసారికి మాత్రమే రిజర్వేషన్ చేసుకునేందుకు అనుమతిస్తారు. రిటన్ జర్నీకి ఈ విషయంలో మినహాయింపు ఉంది. మీరు ఒకసారి బుకింగ్ చేసుకున్న తరువాత మళ్లీ రెండో సారి బుకింగ్ కి అనుమతించరు. ఒకవేళ మీరు ఆరు సీట్లను బుకింగ్ చేసుకుంటే జర్నీ సమయంలో రెండు స్టేషన్ల మధ్య దూరాన్ని కూడా పరిగణలోకి తీసుకునే మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.

5వ రూల్

5వ రూల్

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో మీకు Single page or quick book services అందుబాటులో ఉండదు. మీరు ఆ సమయంలో లాగిన్ మాత్రమే కాగలరు. మిగతా సమాచారం మీకు ఆ సమయంలో అందుబాటులోకి రాదు.

6వ రూల్

6వ రూల్

ఏజెంట్లు టికెట్ల బుకింగ్ సమయానికి పరిమితులు విధించారు. ఉదయం 8 నుంచి 8.30 మధ్యలో, అలాగే 10 నుంచి 10.30 మధ్యలో. అలాగే 11 నుంచి 11.30 మధ్యలో మాత్రమే బుకింగ్ కి అనుమతి ఇస్తారు. ట్రావెల్ ఏజెంట్లకు కూడా కేవలం 30 నిమిషాల సమయాన్ని మాత్రమే కేటాయించారు. ప్యాసింజర్లకు సమయం అందుబాటులో ఉండాలని ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు.

7వ రూల్

7వ రూల్

టికెట్లను బుక్ చేసుకునే సమయంలో నిదానంగా ఉంటే కుదరదు. రైల్లో ఖాళీలు చూసుకుని టికెట్ బుక్ చేసుకునేందుకు 25 సెకన్ల సమయం మాత్రమే ఇస్తారు. పేమెంట్ కు మరో ఐదు సెకన్ల సమయాన్నేఇస్తారు. ఈలోగానే బుకింగ్ పూర్తి కావాల్సి వుంటుంది.

8వ రూల్

8వ రూల్

ఇకపై పేమెంట్లు అన్నీవన్ టైం పాస్ వర్డ్ కింద అనుమతిస్తారు. రిఫండ్స్ నిబంధనల సడలింపుల ప్రకారం, రైలు మూడు గంటలు ఆలస్యమైనా, దారి మళ్లినా ప్రయాణికుడికి పూర్తి చార్జీ తిరిగిస్తారు. వారు వన్ టైం పాస్ వర్డ్ వెరిఫై చేసుకుని పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

9వ రూల్

9వ రూల్

ప్యాసింజర్లకు ఇకపై రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. టికెట్ వేరే వారికి బదిలీ చేయడం కుదరదు. ఫస్ట్ క్లాస్ లో టికెట్ బుక్ చేసుకుని ఇతర తరగతులకు మారితే, చార్జీల మధ్య ఉన్న తేడాను వెనక్కు ఇస్తారు.

10 రూల్

10 రూల్

ప్రయాణానికి 24 గంటల ముందు చీఫ్ రిజర్వేషన్ సూపర్ వైజర్స్ అనుమతితో బుక్ చేసుకున్న టికెట్ ను మరో వ్యక్తి పేరుమీదకు మార్చుకునే అవకాశాన్ని కల్పించారు.మీ పేరు కాని లేక ఇతర ఏవైనా కాని మార్చుకోవాలనుకుంటే ఈ సమయంలో మాత్రమే మార్చుకోవాలి.

11వ రూల్

11వ రూల్

మీరు మీ ప్రయాణ టికెట్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని రైల్వేశాఖ కల్పిస్తోంది. father, mother, brother, sister, son, daughter, husband and wife వీరిలో ఎవరికైనా మీరు మీ టికెట్ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
IRCTC train ticket reservations new rules: 10 things to know More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X