మూతపడనున్న IRCTC, ఛార్జీల బాదుడుపై విస్తుపోయే నిజాలు !

|

నిత్యమూ రైల్వే టికెట్లను రైల్వే మంత్రిత్వ శాఖ అధీకృత వెబ్ సైట్ ఐఆర్సీటీసీ నుంచి బుక్ చేసుకునే లక్షలాది మందికి ముఖ్య గమనిక. దేశీయ రైల్వే టిక్కెటింగ్‌ వెబ్‌సైట్‌ ఐఆర్‌సీటీసీ, ఇతర ఆన్‌లైన్‌ సర్వీసులు కొన్ని గంటల పాటు మూతపడబోతున్నాయి. గురువారం రాత్రి 10.45 గంటల నుంచి తర్వాత రోజు ఉదయం 5 గంటల వరకు అంటే ఆరు గంటల పాటు ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని రైల్వే పేర్కొంది. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్ ను మరింత స్నేహపూర్వకంగా మార్చనున్నామని, ఇందులో భాగంగా కొత్త ఫీచర్లు ప్రవేశపెడతామని కూడా సంస్థ తెలిపింది. మొత్తం ఆరు గంటల పాటు ఈ మూసివేత ఉంటుందని, రైల్వే స్టేషన్లలోని ఐవీఆర్ఎస్ టచ్ స్క్రీన్ లతో పాటు కాల్ సెంటర్, 139 విచారణ తదితరాలు కూడా అందుబాటులో ఉండవని, తమ కస్టమర్లు సహకరించాలని కోరింది. దీనిలో ప్యాసెంజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఐఆర్‌సీటీసీ పై కొన్ని ఆందోళనకర వార్తలు బయటకొచ్చాయి.

 

గత వారం వ్యవధిలో జియో నుంచి వచ్చిన బెస్ట్ ఆఫర్లు ఇవే !గత వారం వ్యవధిలో జియో నుంచి వచ్చిన బెస్ట్ ఆఫర్లు ఇవే !

9 లక్షల మంది నుంచి సుమారు రూ. 3 కోట్లకు పైగానే..

9 లక్షల మంది నుంచి సుమారు రూ. 3 కోట్లకు పైగానే..

టికెట్ బుక్ రద్దు చేసుకునేటప్పుడు కూడా సర్వీస్ చార్జ్ విధిస్తున్న ఐఆర్సీటీసీ వెబ్ సైట్, 9 లక్షల మంది నుంచి సుమారు రూ. 3 కోట్లకు పైగానే వెనకేసుకుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

 

సమాచార హక్కు చట్టాన్ని వినియోగిస్తూ అడిగిన ప్రశ్నకు..

సమాచార హక్కు చట్టాన్ని వినియోగిస్తూ అడిగిన ప్రశ్నకు..

తనకు రావాల్సిన రూ. 35 కోసం ఏడాదిగా ఐఆర్సీటీసీపై పోరాటం చేస్తున్న సుజిత్ స్వామి అనే యువకుడు సమాచార హక్కు చట్టాన్ని వినియోగిస్తూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ వెల్లడించింది.

 ఐఆర్సీటీసీకి లేఖ రాయగా..
 

ఐఆర్సీటీసీకి లేఖ రాయగా..

తాను రూ. 765కు టికెట్ కొని, దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే రూ. 665 మాత్రమే చెల్లించారని ఆయన ఆరోపించాడు. తొలుత ఫిర్యాదు చేస్తే, రిఫండ్ చేస్తామని బదులిచ్చారని, కానీ అలా చేయలేదని ఆరోపిస్తూ, ఐఆర్సీటీసీకి లేఖ రాయగా అక్కడ నుంచి కొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. 

రైల్వే కమర్షియల్‌ సర్క్యులర్ 43' కింద..

రైల్వే కమర్షియల్‌ సర్క్యులర్ 43' కింద..

‘రైల్వే కమర్షియల్‌ సర్క్యులర్ 43' కింద జీఎస్టీ అమలు కంటే ముందే టికెట్‌ బుక్‌ చేసుకున్నా, జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత టికెట్‌ రద్దు జరిగిందని, దీనిపై సర్వీస్‌ ఛార్జీలు వర్తిస్తాయని, అందువల్ల రిఫండ్‌ చెయ్యాల్సిన అవసరం లేదని సమాధానం ఇచ్చింది.

జూలై 1 నుంచి జూలై 11 మధ్య ప్రయాణానికి..

జూలై 1 నుంచి జూలై 11 మధ్య ప్రయాణానికి..

ఇక జీఎస్టీ అమలులోకి వచ్చిన జూలై 1 నుంచి జూలై 11 మధ్య ప్రయాణానికి టికెట్ కొని దాన్ని రద్దు చేసుకున్న వారి నుంచి రూ. 3.34 కోట్ల సర్వీస్ చార్జ్ లను ఐఆర్సీసీటీసీ వసూలు చేసింది.

చాలా మంది ప్రయాణికులకు..

చాలా మంది ప్రయాణికులకు..

చాలా మంది ప్రయాణికులకు ఈ బాదుడు విషయం తెలియదని, కొందరికి తెలిసినా విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సుజిత్ స్వామి వెల్లడించారు. దీనిపై లోక్‌ అదాలత్‌ ను సుజిత్‌ ఆశ్రయించగా, రైల్వే బోర్డుకు, పశ్చిమ మధ్య రైల్వేకు, ఐఆర్‌సీటీసీకి నోటీసులు జారీ అయ్యాయి.

 ఎక్కాల్సిన స్టేషన్‌ను మార్చుకునే వీలు..

ఎక్కాల్సిన స్టేషన్‌ను మార్చుకునే వీలు..

కాగా ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) బుక్‌ చేసుకున్న టికెట్‌లో ఎక్కాల్సిన స్టేషన్‌ను మార్చుకునే వీలును ఈ మధ్య కల్పించింది. సాధారణంగా టికెట్‌ బుకింగ్‌ సమయంలో మనం ఎక్కాల్సిన స్టేషన్‌, చేరాల్సిన స్టేషన్‌ వివరాలను ముందుగానే ఇస్తాం.

ప్రయాణ తేదీకి ఒక్కరోజు ముందు వరకూ..

ప్రయాణ తేదీకి ఒక్కరోజు ముందు వరకూ..

తాజా నిర్ణయంతో ప్రయాణీకులు ఎక్కాల్సిన స్టేషన్‌ను ప్రయాణ తేదీకి ఒక్కరోజు ముందు వరకూ మార్చుకోవచ్చు.ఇందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సివుంటుంది. ఒక టికెట్‌పై ఒకసారి మాత్రమే మార్పులకు అవకాశం ఉంటుంది. కరెంట్‌ బుకింగ్‌, వికల్ప్‌, ఐ టికెట్‌ ద్వారా బుక్‌ చేసుకున్న వాటికి ఇది వర్తించదని ఐఆర్‌సీటీసి పేర్కొంది.

స్టేషన్‌ మార్చుకోవాలంటే...

స్టేషన్‌ మార్చుకోవాలంటే...

స్టేషన్‌ మార్చుకోవాలంటే... ఐఆర్‌సీటీసీ యాప్‌లో బుకింగ్‌ హిస్టరీకి వెళ్లాలి. బుక్‌ చేసుకున్న టికెట్‌ను క్లిక్‌ చేయాలి. చేంజ్‌ బోర్డింగ్‌ పాయింట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఎక్కాల్సిన(మార్చుకోవాల్సిన) రైల్వేస్టేషన్‌ను ఎంచుకోవాలి.

Best Mobiles in India

English summary
Alert! IRCTC website, other online Railway services to remain closed for over six hours tonight More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X