IRCTC వెబ్‌సైట్‌లో భారీ మార్పులు, కొత్తగా వచ్చిన స్టన్నింగ్ ఫీచర్లు ఇవే

  భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సిటిసి) సరికొత్త ఫీచర్లతో ముందుకు వచ్చింది. తమ యూజర్ల కోసం వెబ్‌సైట్‌లో భారీ మార్పులను చేపట్టింది. యూజర్ ఫ్రెండ్లీ పేరుతో తక్కువ టైంలో పని అయ్యేలా ఈ సైట్లో అధునాతన ఫీచర్లను జోడించింది. రిజర్వేషన్లు, టికెట్ బుకింగ్, వెయిటింగ్ లిస్ట్ లాంటి వాటిల్లో భారీ మార్పులను చేపట్టింది. దీన్ని మీరు ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మీరు వాడే పాత వర్షన్ పేజీలోనే మీకు ఎర్రని ఐకాన్ తో Try New Version of Website అనే ఆప్సన్ కనిపిస్తుంది.

  మరో 5 ఏళ్లు ముఖేష్ అంబానీదే రాజ్యం !

  IRCTC వెబ్‌సైట్‌లో భారీ మార్పులు,కొత్తగా వచ్చిన స్టన్నింగ్ ఫీచర్లు ఇవే

   

  దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు బీటా వర్షన్ లో ఉన్న కొత్త వెబ్‌సైట్‌లోకి ఎంటరవుతారు. ఇంది మీకు 15 రోజులు పాటు ట్రయల్ లాగా ఉంటుంది. దీన్ని వాడుతూ మీ అభిప్రాయాలను Indian Railway చెప్పాలి. ఎందుకంటే మీ అభిప్రాయాలతో వారు IRCTC వెబ్‌సైట్‌లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు IRCTC websiteలో వచ్చిన 12 బెస్ట్ ఫీచర్లు ఏంటో తెలుసుకుని మీ అభిప్రాయం చెప్పవచ్చు. అవేంటో చూద్దాం..

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  లాగిన్ కాకుండా చెక్

  e-ticketing websiteలో ఇప్పుడు యూజర్లు అందులోకి మీ యూజర్ ఐడీ పాస్ వర్డ్ తో లాగిన్ కాకుండానే సీట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అనేదాన్ని తెలుసుకోవచ్చు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది.

  Change font size

  ఇప్పుడు font size కూడా మారింది. మీరు మీకు నచ్చిన విధంగా font sizeని సెట్ చేసుకోవచ్చు.

  Will enable easy and better planning

  ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ ద్వారా యూజర్లు class-wise, train-wise, destination-wise, departure/arrival time wise and quota-wiseగా తమ జర్నీ కోసం ప్లాన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

  New dashboard

  మీకు సింగిల్ స్క్రీన్ మీదనే train number, train name, originating and destination station, దూరం అలాగే చేరాల్సిన , రావాల్సిన సమయం గురించి తెలుసుకోవచ్చు.

  New filters

  యూజర్లు Journey Date, Booking Date, Upcoming Journey and completed journey లాంటి విషయాలను ఒకేసారి తెలుసుకునే విధంగా ఈ కొత్త ఫీచర్ ఉంటుంది. ‘My Transactions'లోకి వెళ్లినప్పుడు ఈ వివరాలన్నీ ఒకచోట మీకు కనిపిస్తాయి.

  Waitlist prediction

  ఈ ఫీచర్ ని కొత్తగా ప్రవేశపెట్టారు. మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే దానికి సంబంధించిన వివరాలు తేదీలతో సహా మీకు కనిపిస్తాయి. ఈ ఫీచర్ ద్వారా మీరు RAC ticket confirmed కాదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

  New algorithm

  కొత్తగా ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రయాణించే మెంబర్ల సంఖ్యను మార్చుకునే వీలు ఉంటుంది. యాడ్ చేసుకోవాలన్నా లేదా తగ్గించుకోవాలన్నా మీరు ఈ ఫీచర్ ద్వారా చేసుకోవచ్చు. ఒకవేళ మెంబర్స్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే సాధ్యమా లేదా అన్న వివరాలు కూడా కనిపిస్తాయి.

  New colours scheme

  ఈ ఫీచర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యూజర్లు ప్రయాణించాలనుకున్న రైళ్ల వివరాలను ఇలా కలర్స్ రూపంలో ఇచ్చారు. ఈ కలర్స్ మీరు ప్రయాణం కోసం బుక్ చేసుకునే రైలులో సీట్లు ఖాళీగా ఉన్నాయా లేవా లాంటి వివరాలను వెంటనే మీకు తెలియజేస్తాయి.

  Advance reservation period

  దీని ద్వారా 120 రోజుల వరకు వివరాలను వెతుక్కునే అవకాశం ఉంది. అయితే ఈ సౌకర్యం కొన్ని రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. మీరు 120 రోజుల వరకు ప్రయాణానికి సంబంధించి రైళ్లలో ఖాళీ వివరాలను తెలుసుకోవచ్చు.

  Perform multiple activities

  ఈ ఫీచర్ ద్వారా యూజర్లు cancellation of tickets, printing of tickets, request for additional SMS, selecting alternative train లాంటి అంశాలను తెలుసుకోవచ్చు. తదనుగుణంగా ప్రయాణ వివరాలను సెట్ చేసుకోవచ్చు.

  Seamless navigation

  mobiles, desktops, laptops and tablets ఇలా అన్నింటో ఈ ఫీచర్లు మీకు అందుబాటులో ఉంటాయి. ఎరుపు రంగులో ఉన్న నావిగేషన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఫీచర్లను అందుకోవచ్చు.

  15-days trial period

  ఇది ఇప్పుడు బీటీ వర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అది యూజర్లకు 15 రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తరువాత పూర్తి స్థాయిలో అభిప్రాయాలు తెలుసుకున్నాక ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

   

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  IRCTC’s new website: Waitlist prediction, check seats without login and 10 other features More News at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more