Apple నుంచి తోలి ఫోల్డబుల్.. iPhone లేదా iPad రెండిట్లో ఏది ముందు!
ప్రస్తుతం మార్కెట్లో చాలా బ్రాండ్లు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల సెగ్మెంట్ పై ద్రుష్టి కేంద్రీకరిస్తున్నాయి. దీంతో ఫోల్డబుల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే Samsung, వివో మరియు Motorola బ్రాండ్లు అనేక జెనరేషన్ల ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రముఖ టెక్ దిగ్గజం Apple కూడా త్వరలో ఈ ఫోల్డబుల్ సెగ్మెంట్ ఉత్పత్తుల జాబితాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే, యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్లకు బదులుగా, ఫోల్డబుల్ iPad లను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.

Apple కంపెనీ 2024లో ఫోల్డబుల్ ఐఫోన్‌కు బదులుగా ఫోల్డబుల్ iPadను ప్రారంభించవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి. యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకురావడానికి ముందు ఆపిల్ ఫోల్డబుల్ ఐప్యాడ్‌ను లాంచ్ చేస్తుందని టాప్ అనలిస్ట్ సంస్థ CCS ఇన్‌సైట్ పేర్కొంది. యూజర్ల యొక్క రియాక్షన్ పరీక్షించడానికి కంపెనీ ఐప్యాడ్ లను ఫోల్డబుల్ సెగ్మెంట్ కోసం ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

యాపిల్ ఫోల్డబుల్ iPad 2024లో రాబోతుంది!
టెక్ విశ్లేషకుల సంస్థ (CCS ఇన్‌సైట్) నుండి వచ్చిన వార్షిక నివేదిక ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యాపిల్ కంపెనీ నుంచి 2024లో ఫోల్డబుల్ ఐప్యాడ్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. CCS ఇన్‌సైట్ రీసెర్చ్ చీఫ్ బెన్ వుడ్, CNBCకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో "ఫోల్డబుల్స్ ఊపందుకుంటున్నాయి" అని తెలిపారు. ఇదే అనుకూల సమయంగా యాపిల్ దూసుకుపోతోందని స్పష్టంగా తెలుస్తోంది అని బెన్ పేర్కొన్నారు.

iPad తోనే ఎంట్రీనా!
Samsung, Motorola, Vivo మరియు Oppo కంపెనీ మాదిరి కాకుండా, Apple ఫోల్డబుల్ టాబ్లెట్ ను తీసుకువచ్చేందుకు పనిచేస్తోందని అన్నారు. "ప్రస్తుతం ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను తయారు చేయడం అంత మంచి పరిణామం కాదు, వారు ఫోల్డబుల్ ఐప్యాడ్ ను తీసుకువస్తారని మేం భావిస్తున్నాం " అని బెన్ వివరించాడు.

ఫోల్డబుల్ iPad ఎందుకు, ఐఫోన్ ఎందుకు వద్దు!
యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ ను తీసుకు రావడం చాలా ఖరీదుతో కూడుకున్న విషయం.. కాబట్టి, ఫోల్డబుల్ ఐఫోన్ తీసుకు రావడం ఆపిల్‌కు రిస్కీ విషయమనే చెప్పొచ్చు నివేదిక పేర్కొంది. ఒకవేళ ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్లోకి తీసుకు వస్తే దాని ధర USD 2,500 (సుమారు రూ. 2,05,943) ఉంటుందని విశ్లేషకుల నివేదిక పేర్కొంది. ప్రస్తుతం, 1TB స్టోరేజ్‌తో కూడిన iPhone 14 Pro Max ధర రూ. 1,89,990 గా ఉంది. ఇప్పటివరకు ఈ బ్రాండ్ నుండి అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇదే.
ఫోల్డబుల్ ఐఫోన్‌లను తీసుకురావడం కంటే ఫోల్డబుల్ డిజైన్‌తో కొత్త శ్రేణి iPadలను ప్రారంభించడం యాపిల్ కు మంచిదని నివేదిక వెల్లడించింది. తద్ద్వారా ఆ కంపెనీ భవిష్యత్తులో ఫోల్డబుల్ ఐఫోన్‌లను తీసుకు రావాలనుకున్నప్పుడు ఈ అనుభవాలు చాలా మెరుగైన రీతిలో ఉపయోగపడతాయని పేర్కొంది.

ఫోల్డబుల్ సెగ్మెంట్లోకి యాపిల్ రాకతో Samsungకు పోటీ తప్పదా;
ప్రస్తుతం ఫోల్డబుల్ సెగ్మెంట్ లో Samsung కంపెనీ మార్కెట్ లీడర్‌గా ఉంది. మరియు ఇప్పటికే ఆ కంపెనీ తమ నాలుగో తరం ఫోల్డబుల్ ఉత్పత్తుల్ని Galaxy Z Fold మరియు Galaxy Z Flip మార్కెట్లోకి తెచ్చింది. Motorola కొన్ని Razr ఫోల్డబుల్ ఫోన్‌లపై పని చేస్తోంది. మరియు Oppo మరియు Vivo వారి మొదటి తరం ఫోల్డబుల్ ఫోన్‌లతో మార్కెట్లో చేరాయి. ఆపిల్ తన ఫోల్డబుల్ ఐప్యాడ్‌ను మరో కొన్ని సంవత్సరాలలో ప్రారంభించినట్లయితే, శామ్సంగ్ కు అతిపెద్ద పోటీదారుల్లో ఒకటిగా ఉంటుంది. అంతేకాకుండా, ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేసే సమయానికి, శామ్‌సంగ్ 10వ తరం ఫోల్డబుల్ ఫోన్‌లపై పని చేస్తుంది. ఏదేమైనప్పటికీ.. Apple తన ఫోల్డబుల్ పరిధిలోకి ఎలాంటి ప్రత్యేక ఫీచర్లు, డిజైన్‌లు మరియు స్టైల్‌ను తీసుకువస్తుందో చూడాలి. అయితే అందుకు కనీసం రెండేళ్లయినా వేచి చూడాల్సిందే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications








