Just In
Don't Miss
- Movies
బిగ్ బాస్ 4 హోస్ట్‌పై క్లారిటీ: నిర్వహకుల ప్లాన్ వర్కౌట్.. రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో
- News
Disha murder: దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు.. షాద్ నగర్ లోనే ... సరిగ్గా ఆ సమయానికే
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 6-12-2019
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
టిక్ టాక్‌కి పోటీగా ఫేస్బుక్ యాప్ నిజమా?
ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది యూజర్లతో ఫేస్బుక్ ఒక వెలుగు వెలిగింది. తర్వాత వాట్సాప్ వచ్చిన తరువాత ఫేస్బుక్ ను చాలా మంది వాడడం మానేశారు దీని వలన ఫేస్బుక్ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. తరువాత కాలంలో ఫేస్బుక్ వాట్సాప్‌తో కలిసిపోయింది . ఇప్పుడు చైనా కంపెనీ నుంచి వచ్చిన టిక్ టాక్ ఫేస్ బుక్ మరియు వాట్సాప్ రెండింటికీ గట్టి పోటీ ఇస్తోంది.
దీనికి తోడు హెలో, రోపోసో, షేర్ చాట్ లాంటి వీడియోలతో కూడా నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఫేస్బుక్ ని వాడడం దాదాపు సగానికి పడిపోయింది. వాట్సాప్ కూడా ఎప్పుడో ఓసారి అలా చూసి ఇలా క్లోజ్ చేస్తున్నారు. ఈ పోటీని తట్టుకోవాలంటే టిక్ టాక్ లాంటిదే ఓ యాప్ తేవాలని ఫేస్ బుక్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

ఫేస్బుక్ పోర్ట్‌ఫోలియో:
ఫేస్బుక్ ఈ పోర్ట్‌ఫోలియో కోసం గూగుల్ యొక్క మాజీ ఉద్యోగి జాసన్ టోఫ్తో ఫేస్బుక్ ప్రయాత్నాలు చేస్తోంది. సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం చిన్న వీడియో-షేరింగ్ యాప్ ద్వారా టిక్‌టాక్‌కు గట్టి పోటీని ప్రారంభించటానికి సిద్ధమవుతున్నట్లు ఉహాగానాలు చెలరేగాయి. ఇందుకోసం ఇంతకుముందు ట్విట్టర్ యొక్క షార్ట్-వీడియో షేరింగ్ సర్వీస్ వైన్ కోసం జనరల్ మేనేజర్‌గా పనిచేసిన జాసన్ టోఫ్ పని చేయనున్నట్లు సమాచారం. ఫేస్బుక్ యాజమాన్య సంస్థ ఇటీవల ఏర్పాటు చేసిన న్యూ ప్రోడక్ట్ ఎక్సపెరిమెంటేషన్ (NPE) బృందానికి నాయకత్వం వహించడానికి జాసన్ టోఫ్ ఫేస్బుక్ యొక్క ప్రోడక్ట్ మానేజ్మెంట్ డైరెక్టర్‌గా కొత్తగా బాధ్యతలను తీసుకున్నారు.

జాసన్ టోఫ్ ట్వీట్:
"ఫేస్బుక్ సంస్థ కొత్తగా ప్రారంభించబోయే షార్ట్-వీడియో షేరింగ్ సర్వీస్ యాప్ తయారీ కోసం ఇటీవల ఫేస్బుక్లో ఏర్పడిన NPE బృందంకు PM డైరెక్టర్‌గా చేరబోతున్నాను "అని టోఫ్ సోమవారం ట్విట్టర్లో ప్రకటించారు.

NPE బృందం వివరాలు:
గత వారం ప్రకటించిన ఫేస్బుక్ యొక్క NPE బృందం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే ఫేస్బుక్ బ్రాండ్ నుండి తొలగించబడిన వినియోగదారుల కోసం ప్రయోగాత్మక యాప్ లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్‌లో టోఫ్ వర్చువల్ రియాలిటీ (VR) ప్రాజెక్ట్‌లతో పాటు గూగుల్ యొక్క ఇన్-హౌస్ ఏరియా 120 ఇంక్యుబేటర్‌లో పనిచేశారు. ఇది ఫేస్బుక్ యొక్క NPE బృందానికి సమానంగా ఉంటుంది అని నివేదించారు. తాను పనిచేస్తున్న వివరాలను వెల్లడించలేనని టోఫ్ చెప్పగా తన ట్విట్టర్ పోస్ట్‌లో యుఎక్స్ డిజైనర్లు మరియు ఇంజనీర్ల బృందాన్ని ఈ ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి నియమించాలని చూస్తున్నానని పేర్కొన్నాడు.

టిక్ టాక్ వృద్ధి:
బీజింగ్ ఆధారిత స్టార్ట్-అప్ బైట్ డాన్స్ యాజమాన్యంలోని టిక్ టాక్ 2019 మొదటి అర్ధభాగంలో సంవత్సరానికి 28 శాతం వృద్ధిని సాధించింది. భారతదేశంలో Q2 సమయంలో రెండు వారాల నిషేధం ఉన్నప్పటికీ టిక్ టాక్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 344 మిలియన్లకు పెరిగినట్లు మొబైల్ యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ తెలిపింది.
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500