ఆన్‌లైన్ మ్యూజిక్ సర్వీస్‌ని ప్రారంభించనున్న ఫేస్‌బుక్

Posted By: Super

ఆన్‌లైన్ మ్యూజిక్ సర్వీస్‌ని ప్రారంభించనున్న ఫేస్‌బుక్

న్యూయార్క్‌: ప్రముఖ సోషల్‌ వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌..తన ఖాతాదారుల ఆనందం కోసం కొత్త సర్వీస్‌ని ప్రవేశపెట్టనుంది. ఇన్నాళ్ళు ప్రియమైన ఖాతాదారుల ముచ్చట్లూ, వారి తీపి జ్ఞాపకాలను పంచుకున్న ఫెస్‌బుక్‌.. ఇక వారిని సంగీత ప్రపంచంలో ఒలలాడించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎంతోమంది తమ జీవితాల్లో జరిగిన సంఘటనలు, ఆత్మీయుల ఫోటోలను బాహ్య ప్రపంచంలోకి విడుదల చేస్తూ ఫేస్‌బుక్‌ వ్యక్తిగత మీడియాగా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి మరింత ఉత్సాహాన్ని అందించేందుకు పాటలు, సినిమాలు, వీడియోగేమ్స్‌ను వినేందుకు, చూసేందుకు ఏర్పాటు చేయాలని ఫేస్‌బుక్‌ నిర్వహకులు భావిస్తున్నారు.

దీంతో ఇప్పటికే పలు ఆన్‌లైన్‌ సంగీత సేవలతో ఆకట్టుకుంటున్న ఫేస్‌బుక్‌ పేజీలు ఇకపై మరింత ముస్తాబుకానున్నాయి. అంతేగాక ఫ్రీ మ్యూజిక్‌, వ్యక్తిగతంగా సేకరించిన పాటలు, దృశ్యాలను అప్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్నీ ఫేస్‌బుక్‌ అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా ప్రముఖ ప్రతిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఈ వివరాలన్నిటినీ ప్రచురించగా..ఇప్పటికే ప్రముఖ సోషల్‌ వెబ్‌సైట్లు గూగుల్‌, యూట్యూబ్‌లు ఈ తరహా సేవలను తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఇప్పుడు గూగుల్‌, యూట్యూబ్‌ సంస్థలకు పోటీనిచ్చేలా తయారవుతోంది.

మార్చి 22న జరిగిన ఫేస్‌బుక్ ఎఫ్‌8 కాన్ఫరెన్స్‌లో మ్యూజిక్, వేరే మీడియా ప్లాట్ ఫామ్స్ గురించి చర్చించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తం మీద 700 మంది మిలియన్ యూజర్లను కలిగిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్ ఇలాంటి అత్యాధునిక ఫీచర్స్‌ని విడుదల చేయడం యూజర్స్‌కు అమితానందాన్ని కలిగిస్తుంది. మరికొంత మంది యూజర్స్ మాత్రం ఫేస్‌బుక్ ఇలాంటి కొత్త ఫీచర్స్‌ని ప్రవేశపెట్టడానికి కారణం ఇటీవల గూగుల్ విడుదల చేసిన గూగుల్ ప్లస్ నుండి కాంపిటేషన్‌ని తట్టుకొవడానికేనని అభిప్రాయపడుతున్నారు. గూగుల్ ప్లస్ విడుదల చేసిన కొన్ని వారాలకే సుమారుగా 19 మిలియన్ యూజర్స్ సబ్‌స్క్రైబ్ అయిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot