Nano Banana Trend : నానో బనానా ట్రెండ్ సంగతి సరే.. మరి ఈ జాగ్రత్తల మాటేమిటి..!
గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్.. అదే నానో బనానా ఫీచర్ (Google Nano Banana) ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఫీచర్ ద్వారా 3D ఇమేజ్‌లు క్రియేట్ చేసుకుంటున్నారు. అదే మహిళలు అయితే శారీ ట్రెండ్‌ను ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టా్గ్రామ్, వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఈ ఫోటోలతో నిండిపోతున్నాయి.
ఏంటీ నానో బనానా ట్రెండ్ :
గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్ (నానా బనానా) లో మీరు ఏదైనా ఫోటోను అప్‌లోడ్ చేస్తే, క్షణాల్లో 3D ఇమేజ్‌గా క్రియేట్ చేసి మీకు అందిస్తుంది. అంటే డిజిటల్ రూపంలోనే అందిస్తుంది. ఇందుకోసం నాణ్యమైన ఫోటో, జెమిని ఏఐ ప్రాంప్ట్ ద్వారా సులభంగా 3D డిజిటల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.

నానా బనానా ఫీచర్ ద్వారా ఎలా క్రియేట్ చేసుకోవాలి :
నానా బనానా ఫీచర్ ద్వారా 3D డిజిటల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొనేందుకు aistudio.google.com ను సందర్శించాలి. అనంతరం నానా బనానా ఫీచర్‌ను ఎంచుకోవాలి. ఇంగ్లీష్‌లో ప్రాంప్ట్ ను అందించాలి. ప్రివ్యూ, రిషైన్ చేసుకోవాలి. అనంతరం మీకు కావాల్సిన 3D డిజిటల్ ఇమేజ్ సేవ్ చేసుకోవచ్చు.
సైబర్ నేరాలు :
నానో బనానా ట్రెండ్ ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్‌లు, యాప్‌లు ప్రొమోట్ చేసి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. అనేక మంది యూజర్ల నుంచి వేల రూపాయలు దోచుకుంటున్నారు.
తెలంగాణలోని హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాల్లో ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నానా బనానా ఫీచర్‌తో 3D ఫోటోలు క్రియేట్ చేసుకొనేందుకు నకిలీ లింక్స్ పైన క్లిక్ చేసి, మోసపోతున్నారు. దీనిపై పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.
అసలు ఏం జరుగుతోంది :
నానా బనానా ఫీచర్‌తో 3D ఫోటోలు క్రియేట్ చేసుకొనేందుకు గూగుల్‌లో సంబంధిత వెబ్‌సైట్ లింక్స్ కోసం వెతుకున్నారు. అందులో ఒరిజినల్ వెబ్‌సైట్‌లతోపాటు నకిలీ వెబ్‌సైట్‌లు కూడా కనిపిస్తున్నారు. పొరపాటున నకిలీ వైబ్‌సైట్ పైన క్లిక్ చేస్తే.. యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోమని చెబుతున్నారు మరియు APK ఫైల్స్ కూడా డౌన్‌లోడ్ అవుతున్నాయి.
వాటిపై క్లిక్ చేస్తే, బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. మరియు కొన్ని ఫైల్స్ ద్వారా ఎనీడెస్క్ యాప్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. దీని ద్వారా సైబర్ నేరగాళ్లు ఇతర ప్రాంతాల నుంచి స్మార్ట్‌ఫోన్‌లను తమ ఆధీనంలోకి తీసుకొని, బ్యాంకు ఖాతాల నుంచి నగదును దోచుకుంటున్నారు.
దీంతోపాటు వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని, నకిలీ వైబ్‌సైట్‌లు, యూప్ లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సి వస్తే అధికారిక యాప్ స్టోర్‌లనే వినియోగించాలని స్పష్టం చేస్తున్నారు.
నానా బనానా వంటి ట్రెండ్స్ సమయాల్లో నకిలీ వెబ్‌సైట్, నకిలీ లింక్స్, నకిలీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతోపాటు కేవలం నానో బనానా ట్రెండ్ సమయంలోనే కాకుండా ఇతర సందర్భాల్లోనూ వ్యక్తిగత ఫోటోలు, వ్యక్తిగత సమాచారాన్ని అప్‌లోడ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలని ఉంటుంది.


Click it and Unblock the Notifications








