Just In
- 6 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 7 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 10 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 13 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
భూమిపై అత్యధిక కాలంగా జీవిస్తున్న కుక్కగా ‘బోబీ’ గిన్నీస్ వరల్డ్ రికార్డ్
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆండ్రాయిడ్ కనుమరుగు కాబోతోందా..?
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ 2016లో Fuchsia పేరుతో ఓ ఆపరేటింగ్ సిస్టంను టీజ్ చేసిన విషయం తెలిసింది. ఈ రహస్య ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికర వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వినిపిస్తోన్న పలు రూమర్స్ ప్రకారం ఈ ఆపరేటింగ్ సిస్టంను ఆండ్రాయిడ్ అలానే క్రోమ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టం స్థానంలో గూగుల్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.తాజాగా XDA డెవలపర్స్ లో ఒకరైన మిషాల్ రెహ్మాన్ ఈ ఆపరేటింగ్ సిస్టం గురించి ప్రస్తావించారు. భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పూర్తిగా ఛేంజ్ అయ్యే అవకాశముందని ఇదే సమయంలో అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ కూడా Fuchsia OSను సపోర్ట్ చేస్తాయని ఆయన తెలిపారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను Fuchsia OSతో రీప్లేస్ చేయాలని గూగుల్ భావించినట్లయితే అన్ని రకాల ఆండ్రాయిడ్ అప్లికేషన్ లను Fuchsia ఆధారిత డివైసుల్లో వినియోగించుకునే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోంది...
మొబైల్ ఫోన్ అనుభవాలను రోజురోజుకు మార్చేస్తున్న గూగుల్ ఆండ్రాయిడ్ రకరకాల ఆపరేటింగ్ సిస్టంలతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. కప్ కేక్‌తో మొదలైన ఆండ్రాయిడ్ వోఎస్‌ల ప్రస్థానం అంచెలంచెలుగా ఎగబాకుతూ డోనట్, ఇక్లెయర్, ఫ్రోయో, జింజర్‌బ్రెడ్, హనీకూంబ్, ఇస్‌క్రీమ్ శాండ్విచ్, జెల్లీబీన్, కిట్ క్యాట్, లాలీపాప్, మార్ష్‌మల్లో, నౌగట్, ఓరియో ఇంకా ఆండ్రాయిడ్ పీ పేర్లతో విస్తరించింది.

ఆండ్రాయిడ్‌ను గూగుల్ స్థాపించలేదు..
వాస్తవానికి ఆండ్రాయిడ్‍ను గూగుల్ స్థాపించలేదు. ఆండీ రూబిన్, క్రిస్ వైట్, నిక్ సియర్స్, రిచ్ మైనర్ అనే డెవలపర్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఆక్టోబర్ 2003లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత ఆండ్రాయిడ్ మొత్తాన్ని గూగుల్ $50 మిలియన్లకు కొనుగోలు చేసింది.

మొబైల్ ఆపరేటింగ్ సిస్టం కాదు..
గూగుల్ తన మొదటి ఆపరేటింగ్ సిస్టంను 2007లో ఆవిష్కరించింది. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టంను కెమెరాల కోసం డెవలప్ చేసారు. ఆ తరువాత స్మార్ట్‌ఫోన్‌లకు ఓఎస్ కీలకమని గుర్తించిన గూగుల్ మరిన్ని ఫీచర్ల పై పరిశోధనలు చేపట్టింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఆరంభంలో కేవలం డిజిటల్ కెమెరాల కోసమే అభివృద్థి చేయటం జరిగింది. ఆ తరువాత ఈ ఓఎస్‌ను స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ ఉపయోగించింది.

మొదటి ఫోన్ 2008లో...
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ డ్రీమ్. ఈ స్మార్ట్‌ఫోన్ 2008 అక్టోబర్‌లో విడుదలైంది. డివైస్‌లో లైనెక్స్ ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ ఉపయోగించింది. ఆండ్రాయిడ్ వర్షన్ 1.0 నుంచి 1.6 వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

లైసెన్స్‌ను ఉచితంగా పొందవచ్చు..
స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లైసెన్స్‌ను ఏ విధమైన చెల్లింపులు లేకుండా ఆఫర్ చేస్తోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను విశ్వవ్యాప్తం చేయటంతో గూగుల్ మొబైల్ అడ్వరటైజింగ్ విభాగంలో సింహ భాగాన్ని దక్కించుకుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470