ఎయిర్‌సెల్ ఆఫర్ మంచిదేనా?

Posted By: Prashanth

ఎయిర్‌సెల్ ఆఫర్ మంచిదేనా?

 

‘ఆపిల్ ఐఫోన్ 3జీఎస్ ఇప్పుడు రూ.9,999కే అంటూ ఎయిర్‌సెల్ ప్రవేశపెట్టిన ఆఫర్‌ను వినగానే కొనేయాలన్న భావన మదిలో కలుగుతోంది. అయితే, ఈ రాయితీ వెనుక మతలబేంటి..?, కొనుగోలుదారుకు లాభమా..నష్టమా?, ఐఫోన్ 3జీఎస్‌లో ఆధునిక ఫీచర్లు ఉన్నాయా..? ప్రాసెసర్ సామర్ధ్యం ఎంత..? మొదలగు ప్రశ్నలు పలువురి గ్యాడ్జెట్ ప్రియుల్లో మెదులుతున్నాయి’...

ప్రముఖ నెట్‌వర్క్ ప్రొవైడర్ ఎయిర్‌సెల్ తాజాగా ఆపిల్ ‘ఐఫోన్ 3జీఎస్’హ్యాండ్‌సెట్‌ను రూ.9,999 (అసలుధర రూ.19,999)కు ఆఫర్ చేసి సర్వత్రా ఉత్కంఠకు తెరతీసింది. పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ల వరుకే పరిమితమైన ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగదారుల నుంచి అన్‌లిమిటెడ్ డేటా యూసేజ్ వాడకం కింద రూ.3,000 వార్షిక అద్దెను బ్రాండ్ వసూలు చేస్తుంది.

ఎయిర్‌సెల్ ఆఫర్ ఉత్తమమైనది కాదనటానికి మూడు కారణాలు:

ఫ్రంట్ కెమెరా లేదు:

ఎయిర్‌సెల్ అందిస్తున్న ఆపిల్ ఐఫోన్ 3జీఎస్‌లో ఫ్రంట్ కెమెరా, స్కైప్ వంటి ఫీచర్లు లోపించాయి. ఫ్రంట్ కెమెరాలేని ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ను ఊహించుకోగలమా..?.

నెమ్మదైన ప్రాసెసర్, తక్కువ స్టోరేజ్:

ఐఫోన్ 3జీఎస్‌లో నిక్షిప్తం చేసిన 800మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్ నేటితరం క్వాడ్ కోర్ ప్రాసెసర్‌లతో ఏమాత్రం పోటీ పడలేదు. డివైజ్ ర్యామ్ సామర్ధ్యం 256ఎంబీ మాత్రమే. ఐఫోన్ 3జీఎస్ కొనుగోలుకు వెచ్చించే రూ.9,999తో క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను ఒదిగి ఉన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

అదనపు అద్ది:

యూజర్లు ముఖ్యంగా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఫోన్ కోనుగోలు ధర రూ.9,999 కాకుండా వార్షిక అద్ది కింద రూ.3,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫోన్ నిమిత్తం అవుతున్న మొత్తం వ్యయం 13,000న్నమాట.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting