ఆ గ్రహంపై మంచుకొండలు

By Hazarath
|

ఆకాశం అంచులు.. గ్రహాల తీరాలను దాటుతున్న నాసా సంచలనాత్మక పరిశోధనలు.. జీవం ఉండే అకాశం ఉందంటున్న సైటిస్టులు... ఫ్లూటో గుట్టును న్యూహ్పరైజన్ ఇప్పుతోందా? అంతరిక్ష నౌక ఫ్లూటో ఫోటోలను విడుదల చేస్తోంది. ఫ్లూటో గ్రహంపై పరిశోధకుల కన్ను పడిందా? ఈ సృష్టిలో భూమి కాకుండా ఎక్కడైనా జీవం ఉందా? గ్రహాంతర వాసులపై స్టీఫెన్ హకింగ్ బృందం పరిశోధనలు చేస్తోందా? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరిచేస్తూనే ఉన్నాయి.తాజాగా ప్లూటో గ్రహంపై మంచుకొండలు ఉన్నాయని, దానిపైన సముద్రం ఉందని నాసా శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

Read more :అంతరిక్షంలో అరుదైన ఫోటోలు

11వేల అడుగుల ఎత్తైన మంచుకొండలు

11వేల అడుగుల ఎత్తైన మంచుకొండలు

మరుగుజ్జుగ్రహంగా పిలవబడే ప్లూటోపై భూమధ్యరేఖ ప్రాంతంలో 11వేల అడుగుల ఎత్తైన మంచుకొండలు ఉన్నాయని న్యూహారిజాన్స్ వ్యోమనౌక పంపిన ఫోటో ద్వారా తెలుస్తోందని నాసా తెలిపింది.

మంచుకొండలు ఇంకా అభివృద్ధి దశలోనే

మంచుకొండలు ఇంకా అభివృద్ధి దశలోనే

సౌరకుటుంబం వయసు 456 కోట్ల ఏళ్లు కాగా ... ఫ్లూటోపై మంచుకొండలు 10 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని వీటిని సౌరకుటుంబంలో అతి యుక్తవయసు మంచుపర్వతాలుగా భావించవచ్చని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ప్లూటోపై మంచుకొండలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉండవచ్చని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.

77వేల కి.మీ దూరం నుంచి ఈ మంచుకొండల క్లోజ్ అప్
 

77వేల కి.మీ దూరం నుంచి ఈ మంచుకొండల క్లోజ్ అప్

న్యూహారిజాన్స్ 77వేల కి.మీ దూరం నుంచి ఈ మంచుకొండల క్లోజ్ అప్ ఫోటోలను తీసింది.

ఫ్లూటో ఓ మంచు ఖండం..

ఫ్లూటో ఓ మంచు ఖండం..

నవగ్రహాల్లో చివరిదైన ప్లూటో గ్రహంపై సముద్రం ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. నాసా లేటెస్ట్ గా తీసిన ఫోటోలతో ఈ విషయం వెలుగు చూసింది. వాస్తవానికి ఫ్లూటో ఓ మంచు ఖండం... ఫ్లూటోపై ఉష్ణోగ్రత మైనస్ 229 డిగ్రీల సెంటిగ్రేడ్.. ఈ ఉష్ణోగ్రత దగ్గర మంచు నీరుగా మారే అవకాశమే లేదు. కానీ.. ఈ మంచు పలకల అడుగున సముద్రం ఉండొచ్చని భావిస్తున్నారు.

.ఫ్లూటో ఉపరితంలో చీలికలు వస్తే నీరు బయటపడే అవకాశం

.ఫ్లూటో ఉపరితంలో చీలికలు వస్తే నీరు బయటపడే అవకాశం

ఈ పలకలు...ఫ్లూటో ఉపరితంలో చీలికలు వస్తే ఈ నీరు బయటపడే అవకాశం ఉందట. జీవి ఉద్భవించడానికి జలానికి మించిన అనుకూల వాతావరణం మరొకటి లేదన్న సంగతి తెలిసిందే. అసలు భూమిపై జీవి పుట్టింది కూడా బురద నుంచే అన్న సంగతి తెలిసిందే. మరి ఆ విధంగా చూస్తే.. ఫ్లూటోపై జీవం ఉండే అవకాశాలే ఎక్కువన్నమాట.

అక్కడికి భూమి నుంచి వెళ్లిన ఏ వస్తువూ.. ఇప్పటికి చేరలేదు.

అక్కడికి భూమి నుంచి వెళ్లిన ఏ వస్తువూ.. ఇప్పటికి చేరలేదు.

నవ గ్రహాల్లో చివరిదైన ఫ్లూటో ఉనికి ఆసక్తి గొలిపినా.. దాని గురించి పరిశోధన సాగించడం అంత సులభమేంకాదు.. ఎందుకంటే.. అది సూర్యుడి నుంచి 590 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి భూమి నుంచి వెళ్లిన ఏ వస్తువూ.. ఇప్పటికి చేరలేదు.

మన భూమికి ఉన్నట్టు ఓ చందమామ

మన భూమికి ఉన్నట్టు ఓ చందమామ

ఈ ఫ్లూటోకి కూడా మన భూమికి ఉన్నట్టు ఓ చందమామ ఉంది. దాని పేరు చరాన్.

 8 సంవత్సరాల క్రితం నాసా ప్రయోగం

8 సంవత్సరాల క్రితం నాసా ప్రయోగం

మరి ఈ గ్రహం గురించి తెలిసే దారే లేదా.. అంటే ఉంది. అదే న్యూ హోరైజాన్స్ వ్యోమనౌక.దీన్ని నాసా 2006లో ప్రయోగించింది. అంటే 8 సంవత్సరాల క్రితం అన్నమాట.

వచ్చే ఏడాది జూలైలో ఫ్లూటో మీదకు

వచ్చే ఏడాది జూలైలో ఫ్లూటో మీదకు

అప్పటి నుంచి శరవేగంతో వెళ్తున్న ఈ వ్యోమనౌక వచ్చే ఏడాది జూలైలో ఫ్లూటో మీదకు వెళ్తుంది. న్యూ హోరైజాన్స్ వ్యోమనౌక అందించే సమాచారం కోసం ఇప్పుడు నాసాతో పాటు.. ప్రపంచంలోని ఖగోళ శాస్త్రవేత్తలంతా ఎదురుచూస్తున్నారన్నమాట.

ఫ్లూటోను చేరక ముందే కొన్ని ఫోటోలు పంపింది

ఫ్లూటోను చేరక ముందే కొన్ని ఫోటోలు పంపింది

ఈ వ్యోమనౌక ఇంకా ఫ్లూటోను చేరక ముందే కొన్ని ఫోటోలను పంపింది.. ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తున్న అంశాలకు ఈ ఫోటోలే ఆధారం. హరిజాన్స్ పంపుతున్న ఫోటోల ఆధారంగా నాసా సైంటిస్టులు కొన్ని అంచనాలకు వచ్చారు. వాటిలో ఎంత వాస్తవం ఉంది... అన్నదానిపై వచ్చే ఏడాది కానీ పూర్తి క్లారిటీ రాదు.

సముద్రం ఉందా..అక్కడ మంచు పర్వతాలు ఉన్నాయా

సముద్రం ఉందా..అక్కడ మంచు పర్వతాలు ఉన్నాయా

మరి సముద్రం ఉందా..అక్కడ మంచు పర్వతాలు ఉన్నాయా అన్నది ఇప్పటికైతే ఎటువంటి సమాచారం లేదు 

ఏప్రిల్ 2015న ఫ్లూటో మూడు రంగుల్లో ఉన్నప్పటి చిత్రం

ఏప్రిల్ 2015న ఫ్లూటో మూడు రంగుల్లో ఉన్నప్పటి చిత్రం

ఏప్రిల్ 2015న ఫ్లూటో మూడు రంగుల్లో ఉన్నప్పటి చిత్రం 

Best Mobiles in India

English summary
Here write Is It Snowing on Pluto

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X