Just In
Don't Miss
- Sports
న్యూజిలాండ్ సిరీస్‌కు భువనేశ్వర్ అనుమానమే.. ఐపీఎల్‌తో పునరాగమనం?!!
- Finance
విద్యా రుణాలు తగ్గుతున్నాయ్... కారణాలు ఏమిటో తెలుసా?
- News
మరో డీమానిటైజేషన్‌గా మారనున్న పౌరసత్వ బిల్లు : ప్రశాంత్ క్రిషోర్
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Movies
గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి : అది నా దురదృష్టం.. చిరు కన్నీటి వీడ్కోలు
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
స్మార్ట్ఫోన్ల ఆవిష్కరణలో మనం ఆఖరి దశలో ఉన్నామా ?
ఐఫోన్-ఎల్ఈడి స్మార్ట్‌ఫోన్ వచ్చి 13 సంవత్సరాలు అవుతోంది. స్మార్ట్ఫోన్లు ఆరంభంలో కేవలం కాల్స్ మెసేజ్ చేసుకోవడమే చాలా గొప్పగా భావించేవారు. అయితే టెక్నాలజీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్పులు చెందుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే స్మార్ట్‌ఫోన్స్ దశల వారీగా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వచ్చాయి. కెమెరా నుంచి మొదలుపెడితే ఇంటర్నెట్ డివైస్, గేమింగ్ డివైస్, మీడియా ప్లేయర్ ఇలా కొత్త కొత్త ఆవిష్కరణలతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పరుగులు పెట్టింది. అయితే ఇప్పుడు కొత్త ఆవిష్కరణలు ఏమున్నాయి ? స్మార్ట్‌ఫోన్స్ టెక్నాలజీలో వచ్చే ఆవిష్కరణ ఏమై ఉంటుంది? ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఇప్పుడున్న ఫోన్లలో ఫీచర్లు
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ అన్నీ టచ్ స్క్రీన్స్, అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాసుతో వచ్చాయి. వీటితో పాటుగా మూడు నాలుగు కెమెరాలు, మైక్రో ఫోన్లు, స్పీకర్లు ఇన్ బుల్ట్ బ్యాటరీ ఇలా కొత్త కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. అలాగే రెండు ఆపరేటింగ్ సిస్టంలతో కూడిన సాప్ట్ వేర్ కూడా వచ్చింది. దీంతో పాటుగా అనేక రకాలైన సాఫ్ట్ వేర్ అప్లికషన్లు కూడా పుట్టుకొచ్చాయి. ఇక బ్యాటరీ విషయానికిస్తే 3000 నుంచి 6000ఎంఏహెచ్ వరకు అందుబాటులో ఉన్నాయి. డిస్ ప్లే విషయానికి వస్తే 6 ఇంచ్ అమోల్డ్ ఐపీఎస్ ఎల్సీడి టచ్ స్క్రీన్ , ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ , 3 నాలుగు కెమెరాలు, ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇప్పుడున్న ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి.

ధర ఏ రేంజ్ లో ?
ఆపిల్ ఐఫోన్లు ధరలో అన్ని కంపెనీల కంటే ముందున్నాయి. ఈ ఫోన్లు ప్రీమియం ధరలతో పాటు యూజర్ల వ్యక్తిగత డేటాకు అత్యంత భద్రతనిస్తున్నాయి. సాప్ట్ వేర్, హార్డ్ వేర్ పరంగా దీన్ని ఢీకొట్టే కంపెనీలు ఇంకా రాలేదు. అందుకే మార్కెట్లో ఇప్పటికీ ఈ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీని తర్వాత వచ్చి షియోమి, ఒప్పో ఫోన్లు క్వాలిటీ పరంగా బడ్జెట్ పరంగా బాగున్నా సెక్యూరిటీ పరంగా కొంచెం వీక్ గానే ఉన్నాయి. గూగుల్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా నడుస్తున్నాయి. processing power, artificial intelligence (AI) features, facial recognition, number and power of cameras and pixels ఇవన్నీ కొంచెం ధరకు తగ్గట్లుగా లభిస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్ పీక్ దశలో ఉన్నామా ?
ఇప్పటికే మనం processing power, security, photography and battery life వంటి అన్ని రకాల అవిష్కరణలు చూశాము. ఇక చూడటానికి ఏముందనే ఆలోచన రావడం సహజం. ఇప్పుడు స్మార్ట్ హోమ్, home and car automation, entertainment and fashion ఇవన్నీ మొబైల్ రంగం మీదనే ఆధారపడుతున్నాయి. healthcare and financial services అన్నీ మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి.

స్మార్ట్ ఫోన్ రీప్లేస్ ఏమైనా చేస్తాయా ?
లేటెస్ట్ గా వచ్చిన ఐఫోన్ ప్రోలో హైక్వాలిటీ కెమెరాను ప్రవేశపెట్టారు. ఈ కెమెరా ద్వారా మీరు ఫోటోలు, వీడియోలు అత్యధిక క్వాలిటీతో తీసుకోవచ్చు. అదిరిపోయే హార్డ్ వేర్, AI and machine learning, లెన్స్ కెపాసీటి ఇవన్నీ సరికొత్త ఆవిష్కరణతో వచ్చాయి. ఇలాంటి ఫీచర్లతో ఇప్పుడున్న కంపెనీలు ఫోన్ ను తీసుకురావడం కష్టమే.

రూ. లక్ష ఫోన్ గురించి ఆలోచన చేస్తే ?
హైఎండ్ సూపర్ ప్రీమియం ఫోన్లు రానున్న కాలంలో మార్కెట్లో ఎక్కువ శాతం కనిపించనున్నాయి. ఎక్కువ శాతం ఈ ఫోన్ల మీదనే ఫ్యూచర్లో ఆధారపడే అవకాశం ఉంది. రానున్న ఫోన్లు ల్యాపీకన్నా పవర్ పుల్ ప్రాసెసర్లతో వస్తున్నాయి. మొబైల్ ద్వారానే అన్ని పనులు చేసుకునే విధంగా వస్తున్నాయి. కాబట్టి రానున్న కాలమంతా మీ జీవితాన్ని మార్చివేసే గాడ్జెట్లు రానున్నాయి. మీ డబ్బును సేవ్ చేసే ఉత్పత్తులు తప్పకుండా మార్కెట్లోకి వస్తాయి
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790