ఇండియన్ టెలికం మార్కెట్లో జియో జోరు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మొబైల్ నెట్‌వర్క్ విభాగంలో ఈ టెల్కో రాణిస్తోన్న తీరు విప్లవాత్మక పోకడలకు దారి తీస్తోంది.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో జియో అందిస్తోన్న టెలికామ్ సేవలు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా మారటంతో జియో దూకుడు ఇప్పుడప్పుడే తగ్గేటట్టు కనిపించటం లేదు. మొబైల్ నెట్‌వర్క్ విభాగంలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్న జియో డీటీహెచ్ సేవల పై ఫోకస్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేవలు ఇంకా అఫీషియల్ గా అందుబాటులోకి రానప్పటికి తెరవెనుక కసరత్తులు మాత్రం భారీగానే జరుగుతున్నట్లు సమాచారం.
జియోని క్రాస్ చేసిన ఎయిర్‌టెల్, 4జీ స్పీడ్‌లో అమితమైన వేగం
వివరాలు హ్యాకర్ల చేతిలో..
జియో డీటీహెచ్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జియోకు వస్తోన్న క్రేజును తమకు అనుగుణంగా క్యాష్ చేసుకునేందుకు పలువరు మోసగాళ్లు బరితెగిస్తున్నారు. వీళ్ల ఉచ్చులో చిక్కుకుంటోన్న పలువురు తమ బ్యాంక్ అకౌంట్ల వివరాలను హ్యాకర్ల చేతిలో పెట్టేస్తున్నారు.
వెలుగులోకి మరో మోసం...
తాజాగా జియో డీటీహెచ్ పేరుతో జరుగుతోన్న మరో మోసాన్ని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం "JIO PHONE & DTH Rs. 10 only for lifetime free channels register now offer for 1st 1000 customers avail this offer http://jiodevices.online/ Book now" అంటూ ఓ ఎస్ఎంఎస్ విస్తృతంగా మార్కెట్లో సర్క్యులేట్ అవుతోంది.
కార్డ్ నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది..
పొరపాటున ఈ మెసేజ్‌లోని http://jiodevices.online/ లింక్ పై క్లిక్ చేసినట్లయితే జియో వెబ్‌సైట్‌ను పోలి ఉన్న నకిలీ వెబ్‌సైట్‌లోకి యూజర్లు డైవర్డ్ కాబడుతున్నారు. ఈ వెబ్ పేజీలో కనిపించే బుక్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పేర్లతో రెండు పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వీటిలో దేనిని సెలక్ట్ చేసుకున్నా కార్డ్ నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ కోడ్ వంటి వివరాలను ఎంటర్ చేయమని హ్యాకర్లు అడుగుతున్నారు.
పేమెంట్ పై క్లిక్ చేస్తే ఎర్రర్ మెసేజ్..
ఇవే కాకుండా మీ కార్డ్ పిన్, పుట్టిన తేదీ, కార్డ్ హోల్డర్ నేమ్ వంటి వివరాలను కూడా ఇందులో భాగంగా హ్యాకర్లు రాబట్టేప్రయత్నం చేస్తున్నారు. తీరా ఈ వివరాలను ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేస్తే పేమెంట్ సక్సెస్ ఫుల్ మెసేజ్‌కు బదులు ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. పొరపాలు మనదగ్గరే ఉందనుకుని మళ్లీమళ్లీ ట్రై చేసిన ఈ ఎర్రర్ మేసేజే ప్రత్యక్షమవుతోంది.
వెంటనే పాస్‌వర్డ్స్ మార్చుకోండి...
ఈ నకిలీ మెసేజ్ ఉచ్చులో పడటం వల్ల బ్యాంక్ అకౌంట్ల వివరాలను హ్యాకర్ల చేతిలో పెట్టడం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ నకిలీ వెబ్‌సైట్‌లో ఎవరైనా తమ బ్యాంక్ వివరాలను వివరాలు నమోదు చేసి ఉంటే వెంటనే వారివారి ఆన్‌లైన్ ఖాతాల పాస్‌వర్డ్స్‌ను మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వెలుగులోకి మరో మోసం..
ఈ మధ్య కాలంలో మరో నకిలీ వెబ్‌సైట్ జియో సిమ్‌లను ఉచితంగా అందిస్తున్నట్లు తన సైట్‌లో పేర్కొంది. యూజర్లు తమ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలను నమోదు చేసుకోవటం ద్వారా నేరుగా జియో సిమ్‌ను వారి వారి ఇళ్లకే డెలివరీ చేస్తామని ఈ వెబ్‌సైట్ చెబుతోంది. డెలివరీ సమయంలో అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ఇంకా పాస్‌ర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. 7 నుంచి 10 రోజుల్లో ఈ సిమ్‌ను డెలివరీ చేస్తామని ఛార్జీల క్రింద రూ.199 చెల్లించాల్సి ఉంటుందని వెబ్‌సైట్ పేర్కొంది. ఇది పూర్తిగా నిరాధారమైన ఆఫర్. ఇలాంటి పుకార్లను నమ్మి మోసపోకండి.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.