సోనీ, సామ్‌సంగ్‌లకు మైక్రోసాఫ్ట్ డబ్బులిచ్చిందా..?

Posted By:

అంతర్జాతీయంగా తమ విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను మరింతగా విస్తరింపచేసేందుకు మైక్రోసాఫ్ట్ వ్యూహరచన చేస్తోందా..? అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఇటీవల కాలంలో నోకియా కంపెనీని కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్, విండోస్ ఫోన్‌లను తయారు చేసే ఒప్పందంతో సామ్‌సంగ్.. సోనీ కంపెనీలకు భారీగా నిధులు మంజూరు చేసినట్లు సమాచారం.

సోనీ, సామ్‌సంగ్‌లకు మైక్రోసాఫ్ట్ డబ్బులిచ్చిందా..?

పలు అంతర్జాతీయ టెక్నాలజీ వెబ్‌సైట్‌లలో ప్రచురితమవుతున్న సమాచారం మేరకు మైక్రోసాఫ్ట్ తమ విండోస్ ఫోన్ డివైస్‌లను రూపొందించే ఒప్పందంతో సామ్‌సంగ్‌కు $1.2బిలియన్లు, హవావీ కంపెనీకి $600 మిలియన్లు, సోనీ కంపెనీకి $600మిలియన్లను ఇతర కంపెనీలకు $300 మిలియన్లను చెల్లించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో సోనీ తన వయో బ్రాండ్ నుంచి త్వరలో విండోస్ ఫోన్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. గత ఏడాది అగష్టులో ప్రచురితమైన గార్టనర్ నివేదిక ప్రకారం అత్యధికంగా వినియోగించబడుతున్న మొబైల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆండ్రాయిడ్ ముందజంలో ఉంది యాపిల్ ఐఓఎస్ రెండవ స్థానంతో సరిపెట్టుకోగా బ్లాక్‌బెర్రీని వెనక్కినెట్టిన మైక్రోసాఫ్ట్ విండోస్ మూడవ స్థానంలో నిలిచింది. స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాల విభాగంలో సామ్‌సంగ్ మొదటి స్థానంలో నిలిచింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot