నోకియా 4జి ఫీచర్ ఫోన్లో QWERTY కీ బోర్డు!

Posted By: Madhavi Lagishetty

నోకియా 9, నోకియా 6 రిలీజ్ గురించి గత కొన్ని రోజులుగా ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. హెచ్ఎండి గ్లోబల్ 2018లో నోకియా 6 లేదా నోకియా 3310ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. హెచ్ఎండి గ్లోబల్ 4జి వెర్షన్ను తొలిసారిగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే నోకియా 9 మరియు నోకియా 6ను జనవరి 19న ప్రారంభించనున్నట్లు చాలా రిపోర్టులు వెల్లడించాయి.

నోకియా 4జి ఫీచర్ ఫోన్లో QWERTY కీ బోర్డు!

కంపెనీ తన ప్లాన్స్ గురించి వివరించింది. నోకియా ఫీచర్ ఫోన్ల గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించింది. కొన్ని ఫోన్ల గురించి రూమర్స్ మరియు వాటి గురించి కొనని లీక్స్ వస్తుంటే ...వాటి గురించి వినడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు కనిపిస్తుంది. కొత్త నోకియా మోడల్ నెంబర్ TA-1047 గురించి FCC తన సైట్లో ఈ కొత్త ఫోన్ గురించి కొంత సమాచారాన్ని బయట పెట్టింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి మార్కెట్లో భిన్నమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

FCC రిపోర్టు ప్రకారం...స్మార్ట్ ఫోన్ డ్యుయల్ సిమ్ తో వస్తుంది. 133 × 68 mm కలిగి ఉంది. నోకియా 2తోపాటు నోకియా ఫీచర్ ఫోన్లతో పోల్చి చూసినట్లయితే...వాటి కంటే ఒక బిట్ పెద్దదిగా ఉంటుంది. నోకియా 3310 4జి వెర్షన్ కూడా ఇలాగే ఉండవచ్చని రూమర్స్ వస్తున్నాయి.

FCC డివైస్ GSM/WCDMA/LTE మొబైల్ గా 4జి, బ్లూటూత్, వై-ఫై, FMతోపాటు వోల్ట్ సపోర్టు ఇస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే... గిజ్ చైనా నుంచి రిలీజ్ అయిన నేదికలో ఈ డివైస్ యుఎస్ మార్కెట్లో అందుబాటులో లేదని పేర్కొంది.

డ్రైవింగ్ లైసెన్స్ మరచిపోయారా, పోలీసులకు ఈ యాప్ చూపిస్తే చాలు !

నోకియా E72మాదిరిగానే QWERTY కీబోర్డుతో కొత్త నోకియా 4జి ఫీచర్ ఫోన్ను రిలీజ్ చేసేందుకు హెచ్ఎండి గ్లోబర్ ప్లాన్ చేస్తుంది. మోడల్ సంఖ్యలు TA1047, TA-1060 లు సంయుక్తంగా ఫెడరల్ కమ్యునికేషన్స్ కమీషన్ (FCC) సైట్లో గతంలో కనిపించాయి. ఇప్పుడు నోకియా యొక్క కొత్త 4జి ఫీచర్ ఫోన్ బ్లూటూత్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ నుంచి బ్లూటూత్ సర్టిఫికేషన్ పొందింది.

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ 480 × 480 రిజల్యూషన్ తోపాటు 3.3 అంగుళాల డిస్ల్పేను కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 230తోపాటు కై OSపై రన్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

అయితే ఈ ఫోన్ గురించి స్పష్టమైన ఆధారాలు ఇప్పటివరకు లేకున్నా....ఈ హ్యాండ్ సెట్ కు సంబంధించిన ఇమేజ్ లు రానున్న రోజుల్లో ఇంటర్నెట్లో హల్ చల్ చేయనున్నాయి.

English summary
A new Nokia smartphone with code TA-1047 has passed certification at FCC revealing some information about it.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot