Home
News

నథింగ్‌ నుంచి ఫోల్డింగ్‌ ఫోన్‌ రానుందా.. ఎప్పుడంటే?

ఒకప్పుడు అంటే స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో ఫోల్డింగ్‌ మరియు ప్లిప్‌ ఫోన్లకు మంచి ఆదరణ ఉండేది. ఆ సమయంలో ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ శ్యామ్‌సంగ్‌ టాప్‌ రేస్‌లో ఉండేది. ప్రస్తుతం అదే శ్యామ్‌సంగ్‌ సంస్థ ఒప్పో, వివో, వన్‌ ప్లస్‌ వంటి బ్రాండ్స్‌ నుంచి గట్టి పోటీని ఎదుర్కోనుంది.

ఈ పోటీలో గూగుల్‌ కూడా వచ్చి చేరింది. Google Pixel Fold స్మార్ట్‌ఫోన్‌తో రేస్‌లో నిలిచింది. అయితే ఈ రేస్‌లోకి నథింగ్ ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. నథింగ్‌ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Nothing Fold 1 పేరిట ఫోన్‌ తీసుకొస్తున్నామని ట్వీట్‌ చేసింది.

Nothing Fold 1

ఇందులో కొన్ని ఫోటోలను షేర్‌ చేస్తూ తమ సంస్థ నుంచి వస్తున్న తాజా ఆవిష్కరణ అని పేర్కొంది. అయితే చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు నథింగ్‌ సంస్థ ట్వీట్‌పై ఆసక్తి కనబరిచారు. త్వరలో నథింగ్‌ నుంచి పోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని భావించారు. అయితే ఆ ట్వీట్‌ చేసింది సంస్థ కమ్యూనిటీలోని ఓ సభ్యుడని, అది కూడా కేవలం ఓ ఆలోచన అని తెలిసింది.

ఆ ట్వీట్‌ను కొందరు అభిమానులు ట్రోలింగ్‌ చేశారు. అయితే నథింగ్ వ్యవస్థాపకుడు Car Peiకి టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టమని, ప్రస్తుతం ఫోల్డింగ్‌ ఫోన్లపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు ఈ తరహా ఫోన్లు తయారీకి ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఏదో ఒక సమయంలో నథింగ్ సంస్థ నుంచి కూడా ఫోల్డ్‌ ఫోన్‌ వచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.

ఒకవేళ నథింగ్ నుంచి ఫోల్డింగ్‌ ఫోన్‌ విడుదల చేస్తే.. స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ను ప్రత్యేకంగా తయారుచేస్తుందని పలువురు భావిస్తున్నారు. ఐకానిక్‌ గ్లిఫ్‌ లైటింగ్‌ సిస్టమ్‌ మరియు పూర్తి పారదర్శక డిజైన్‌తో లాంచ్‌ కావాలని స్మార్ట్‌ఫోన్‌ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సంస్థ ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచన చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఈ ఫోల్డింగ్‌ ఫోన్లతో ముఖ్యమైన Hingeను నథింగ్ సంస్థ ఎలా తయారుచేస్తుందనేది ఆసక్తికర విషయం. అయితే సంస్థకు ఉన్న వనరులు అన్నింటినీ వినియోగించి అద్భుతమైన ఫోన్‌ను తయారుచేస్తుందని భావించవచ్చు. అయితే నథింగ్‌ సంస్థ తక్కువ ధర, అద్బుతమైన డిజైన్‌, ఫీచర్‌తో ఆకట్టుకొనే అవకాశం ఉంది.

ఈ కథనం అంతా కేవలం ఉహజనితం. నథింగ్‌ సంస్థ తన ఫోన్‌ గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. ఆ సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన వచ్చినా మీకు తెలియజేస్తాము.

గూగుల్ పిక్స్‌ల్‌ ఫోల్డ్‌ను కొద్దిరోజుల్లోనే ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ ఫోల్డింగ్‌ స్మార్‌ఫోన్‌ గూగుల్‌ టెన్సార్‌ G2 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. 12GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజీ మరియు 12GB ర్యామ్‌, 512 GB ఇంటర్నల్‌ స్టోరేజీతో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ కెమెరాలనే పిక్స్‌ల్‌ ఫోల్డ్‌ కలిగి ఉండే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Is Nothing trying to enter into Foldable smartphone market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X