సామ్‌సంగ్ ఫోన్‌లు సేఫ్ కాదంటూ పుకార్లు?

Posted By:

గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్ల వ్యక్తిగత డేటాను సామ్‌సంగ్ దొంగిలిస్తోందంటూ రెండు వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లలోని బ్యాటరీ భాగంలో సామ్‌సంగ్ రహస్య మైక్రోచిప్‌లను అమర్చిందని, ఈ చిప్ వినియోగదారుడికి తెలియకుండానే అతని ప్రైవేట్ డేటాను దొంగిలించి వేరొక సర్వర్‌లో అప్‌లోడ్ చేస్తోందంటూ సదరు వీడియోలు ఆరోపించాయి. అలాంటి చిప్‌లు మీ ఫోన్‌లో కూడా ఉండే వాటిని వెంటనే తొలగించి వేయండంటూ హెచ్చరికలు కూడా జారీ చేసాయి.

Read More: గూగుల్.. సోనీ.. యాహూ (ఈ పేర్లు ఏలా వచ్చాయ్..?)
అయితే, ఈ వీడియోల్లోని ఆరోపణలు ఏ మాత్రం నిజం లేదని కొద్ది గంటల్లోనే తేలిపోయింది. వాస్తవానికి సామ్‌సంగ్ తన ప్రీమియమ్ క్వాలిటీ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లలోని బ్యాటరీ భాగంలో ఎంబెడెడ్ చేస్తున్న మైక్రోచిప్ ఎన్ఎఫ్‌సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) ఫీచర్‌కు సంబంధించినది. ఈ ఫీచర్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను ఇతర డివైజ్‌లతో సులువుగా కనెక్ట్ చేసుకుని కంటెంట్‌ను షేర్ చేసుకోవటంతో పాటు నగదు చెల్లింపులను చేపట్టవచ్చు.

Read More: 70 స్మార్ట్‌ఫోన్‌లు.. చూసినోళ్లకు చూసినంత 

ఈ ఫీచర్ సరిగ్గా పనిచేందుకే ఎన్ఎఫ్‌సీ చిప్‌లను ఫోన్ వెనుక భాగంలో సామ్‌సంగ్ ఏర్పాటు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది తెలియని కొందరు ఆ మైక్రోచిప్‌ను సామ్‌సంగ్ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగిస్తుంటూ ఆరోపించటం శోచనీయం. ఇలాంటి నకిలీ వీడియోలను నమ్మి మీ సామ్‌సంగ్ గెలాక్సీలోని చిప్‌లను తొలగించకండి. మీరే నష్టపోతారు జాగ్రత్త.

ఉప్పు చేపలతో మొదలైన సామ్‌సంగ్ చరిత్రకు సంబంధించిన ఆసక్తికర వివరాలను క్రింది స్లైడ్‌షోలో చేసేయండి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ ఆవిర్భావం

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

సామ్‌సంగ్‌ను బయుంగ్ - చుల్ లీ అనే వ్యక్తి 1938లో ప్రారంభించారు. తొలినాళ్లలో ఈ సంస్థ కొరియా నుంచి చైనాకు ఎండుచేపలు, కూరగాయలు ఇంకా పిండి పదార్థాలను ఓడల సాయంతో ఎగుమతి చేసేది.

1951 నుంచి 1965 వరకు

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

 తమ వ్యాపార విస్తరణలో భాగంగా మరో అడుగువేసిన సామ్‌సంగ్ చెయిల్ పరిశ్రమలను ప్రారంభించి దేశీయంగా వివిధ ఉత్పత్తులను ప్రజలకు అందించింది. 1963లో జుల్‌డాంగ్ బ్యాంగ్‌లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీని కొనుగోలు చేసిన సామ్‌సంగ్ 1989లో ఆ కంపెనీ పేరును సామ్‌సంగ్ లైఫ్‌ఇన్స్యూరెన్స్‌గా మార్చింది. 1965లో పేపర్ పరిశ్రమలోకి సామ్‌సంగ్ అడుగుపెట్టంది.

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ పుట్టక

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

1968, డిసెంబర్ 30.. చైర్మన్ బయుంగ్ - చుల్ లీ నేతృత్వంలోని సామ్‌సంగ్ బృందం సామసంగ్ ఎలక్ట్రానిక్స్ స్థాపించాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 1969, జనవరి 13వ తేదిన సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌ను ప్రారంభించారు. 1970, నవంబర్ నెలలో 12అంగుళాల బ్లాక్‌ అండ్ వైట్ టీవీని సామ్‌సంగ్ ఉత్పత్తి చేయగలిగింది. రెండు నెలల వ్యవధిలోనే తమ ఉత్పత్తిని మరింత పెంచుకుని పనామాకు ఎగుమతి చేయగలిగింది.

అదే సంవత్సరం

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

అదే సంవత్సరం... వ్యాపారాభివృద్థిలో భాగంగా సామ్‌సంగ్ అదేసంవత్సరం (1970) పెట్రో కెమికల్స్ సంస్థను స్థాపించి వాషింగ్ మెషీన్స్, రిఫ్రీజరేటర్స్ ఇంకా మైక్రోవేవో ఓవెన్స్ వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను పరిచయం చేసింది.

సామ్‌సంగ్ ప్రపంచానికి విస్తరించింది

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

1980లో సెమీ కండెక్టర్‌ల తయారీ పై దృష్టిసారించిన సామ్‌సంగ్ తన పరిధిని మరింత విస్తరించుకుంది. ఈ సంవత్సరంలోనే కలర్ టీవీలతో పాటు పర్సనల్ కంప్యూటర్‌లు, వీ.సీ.ఆర్‌లు, టేప్ రికార్డర్లను తయారు చేసి అమెరికాకు ఎగుమతులు మొదలుపెట్టింది.

మెమరీ కార్డులు, హార్డ్‌డిస్క్‌ల తయారీ

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

వ్యాపారన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో సామ్‌సంగ్ 1990 మధ్య మెమెురీ కార్డులతో పాటు హార్డ్‌డిస్క్‌లను తయారు చేయడం ప్రారంభింది.

1995లో మొదటి సెల్‌ఫోన్ తయారీ

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

1995లో మొదటి సెల్‌ఫోన్ తయారీ.. ప్రతికూల పరిస్థితులు తప్పలేదు: 1995లో సామ్‌సంగ్ తయారీ చేసిన తొలి మొబైల్ ఫోన్ అనుకున్న స్థాయలో ఫలితాలను రాబట్టలేకపోయింది. ఆ సమయంలో కంపెనీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కుస్-హీ లీ పనికిరాని వేలాది ఫోన్‌లను ధ్వంసం చేయించారు.

పడిలేచిన కెరటం

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

మొబైల్ ఫోన్‌ల తయారీని సీరియస్‌గా తీసుకన్న సామ్ సంగ్ 1999లో ఇంటర్నెట్‌కు అనువైన ఫోన్‌లను తయారు చేసింది.

మొదటి డిజిటల్ టీవీ తయారు

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

మొదటి డిజిటల్ టీవీ తయారు, 1999లో ఉత్పత్తి: ఓ వైపు మొబైల్ ఫోన్ మరోవైపు టెలివిజన్‌ల తయారీ పై దృష్టిపెట్టిన సామ్‌సంగ్ 1998లో తన మొదటి డిజిటల్ టీవీని తయారు చేసింది. 1999లో వీటి ఉత్పత్తి ప్రారభమైంది.

2000వ సంవత్సరంలో హైడెఫినిషన్ టీవీ

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

2000వ సంవత్సరం హైడెఫినిషన్ టీవీని సామ్‌సంగ్ అందుబాటులోకి తెచ్చింది.

2010లో నుంచి సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

2010 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్‌లో సామ్‌సంగ్ మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. పేరు ‘గెలాక్సీ ఎస్'.

గెలాక్సీ సిరీస్ టాబ్లెట్ కూడా 2010లోనే

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

2010లోనే 7 అంగుళాల గెలాక్సీ సిరీస్ టాబ్లెట్‌ను సామ్‌సంగ్ విడుదల చేసింది.

2013 నుంచి స్మార్ట్ ఉత్పత్తులను సామ్‌సంగ్ పరిచయం చేస్తూనే ఉంది

సామ్‌సంగ్ ప్రస్థానంలో ఎన్నో మైళు రాళ్లు

2013 నుంచి ఆధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఉత్పత్తులను సామ్‌సంగ్ పరిచయం చేస్తూనే ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Two videos claiming that Samsung is stealing your personal data saved on your smartphone are going viral over the web.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot