మార్చ్ 31 నుండి మీ పాన్ కార్డులు పని చేయవు ఎందుకో తెలుసుకోండి

|

మనం జనరల్ గా ఏదన్నా ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ మరియు ఫారం ఫిల్లింగ్ కి ఆధార్ కి పాన్ కార్డు లింక్ చేయాలి అని చాల దగ్గర అడుగుతుంటుంది. ఈరోజుల్లో ఆధార్ కార్డు , పాన్ కార్డు రెండు చాల ముఖ్యమైనవి.ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ చేయకపోతే మనకు ఈరోజుల్లో చాల ట్రాన్సక్షన్స్ జరగవు.ఈ నేపథ్యంలో పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలనీ సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా కొత్తగా పాన్ కార్డు కొరకు అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందిగా కోరింది.మార్చ్ 31లోపు పాన్ కార్డు ను ఆధార తో లింక్ చేయకోపోతే పాన్ కార్డులు చెల్లవు అంతే కాకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం కూడా సాధ్యం కాదు. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా పాన్ కార్డును నెంబర్ ను ఆధార్ తో లింక్ చేయడం ఎలాగో మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

 

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లు భారీ డిస్కౌంట్లలో లభిస్తున్నాయి

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా గూగుల్ క్రోమ్ లో incometaxindiaefiling.gov.in ను ఓపెన్ చేయండి.

step 2

step 2

లింక్ క్లిక్ చేయగానే మనకు ఆఫిషల్ హోమ్ పేజీ వస్తుంది ఇక్కడ మీకు ఎడమ వైపున link aadhar అని ఆప్షన్ ఉంటుంది దీనిని క్లిక్ చేయండి.

step 3

step 3

ఇక్కడమీకు ఒక ఫారం ఓపెన్ అవుతుంది దీనిలో మీరు మీ పాన్ కార్డు నంబరు, ఆధార్ కార్డు నంబరు, ఆధార్ కార్డులో ఉన్న లాగా మీ పేరు. అలాగే మీకు ఒక క్యాప్చర్ కోడ్ వస్తుంది అది టైపు చేసి link aadhar అని ఆప్షన్ క్లిక్ చేయాలి.

step 4
 

step 4

ఒకవేళ మీరు ముందుగానే ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేసి ఉంటే మీకు ఎడమ వైపు పైన click here అని కనిపిస్తుంది దాని క్లిక్ చేస్తే మన స్టేటస్ ని తెలుసుకోవచ్చు.

 step 5

step 5

మీకు మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ ఐపోయింది అని తెలుసుకోవాలి అంటే ముందుగా చెప్పినట్లు click here అని క్లిక్ చేస్తే మీకు మీ పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఎంటర్ చేయమని అందుతుంది .మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత view my Aadhar Status అని ఆప్షన్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు పాన్ కార్డు తో లింక్ చేయబడుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Is your PAN card linked to your Aadhaar number? How to check.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X