మీ స్మార్ట్‌ఫోన్ దొంగిలించబడిందా?? డబ్బు సురక్షిత కోసం వెంటనే ఇలా చేయండి...

|

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగం ప్రస్తుత కాలంలో మరింత అధికం అయింది. ఆన్‌లైన్ పద్దతిలో పేమెంట్లను చెల్లించడం కోసం మొబైల్ వాలెట్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగదారులు వారి యొక్క ఆన్‌లైన్ బ్యాంకింగ్ వివరాలు మరియు మొబైల్ వాలెట్‌లతో సహా మీ ఇతర వ్యక్తిగత సమాచారంను పొందుపరిచి ఉంటారు. అయితే ఇంతటి సమాచారం గల మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌ పోయింది అంటే మీ యొక్క పరిస్థితి ఏమిటి ఊహించుకోండి??

బ్యాంకింగ్ వివరాలు

దొంగలు మొబైల్ ఫోన్‌లను దొంగిలించిన తరువాత అందులో గల మీ యొక్క బ్యాంకింగ్ వివరాలు మరియు ఇతర వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసి త్వరగా డబ్బును సంపాదించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు కోల్పోయిన స్మార్ట్‌ఫోన్ గురించి చింతించకుండా ఆన్‌లైన్ మోసాల భారిన పడకుండా మీ డబ్బును సురక్షితంగా ఉంచడానికి మీరు శ్రద్ధ వహించాలి. మీ స్మార్ట్‌ఫోన్ దొంగిలించబడినప్పుడు డబ్బును సురక్షితంగా ఉంచడానికి మీరు వెంటనే చేయవలసిన విషయాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో,Vi,ఎయిర్‌టెల్ టెల్కోలకు మించిన ప్రయోజనాలతో BSNL దీర్ఘకాలిక ప్లాన్జియో,Vi,ఎయిర్‌టెల్ టెల్కోలకు మించిన ప్రయోజనాలతో BSNL దీర్ఘకాలిక ప్లాన్

SIM కార్డ్‌ను వెంటనే బ్లాక్ చేయడం

SIM కార్డ్‌ను వెంటనే బ్లాక్ చేయడం

స్మార్ట్‌ఫోన్ దొంగిలించబడిన వెంటనే మీ టెలికాం ఆపరేటర్‌కు కాల్ చేసి సిమ్ కార్డును వెంటనే బ్లాక్ చేయండి. తద్వారా దొంగలు ఫైనాన్స్ సర్వీస్ల కోసం OTP లు లేదా ఇతర వ్యక్తిగత మెసేజ్లను యాక్సెస్ చేయలేరు. వాస్తవానికి మీరు అదే మొబైల్ నంబర్‌ను కొత్త సిమ్ కార్డుతో ఉపయోగించడం కొనసాగించవచ్చు. కానీ మీ పాత మొబైల్ నంబర్ కోసం కొత్త SIM కార్డ్ పొందడానికి మొత్తం ప్రక్రియ కొంత సమయం పట్టవచ్చు. ఈ కాల వ్యవధి కీలకం కావున దొంగలు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి సురక్షితంగా ఉండటానికి మీరు వెంటనే ఈ ప్రక్రియను పూర్తిచేయండి.

iPhone 13 సిరీస్ లో శాటిలైట్ కమ్యూనికేషన్ కనెక్టివిటీ!! ఇందులో నిజమెంత!!iPhone 13 సిరీస్ లో శాటిలైట్ కమ్యూనికేషన్ కనెక్టివిటీ!! ఇందులో నిజమెంత!!

మీరు మీ మొబైల్ ఫోన్‌ను కోల్పోయిన వెంటనే మీ బ్యాంక్‌కు కాల్ చేసి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల యాక్సెస్‌ను బ్లాక్ చేయండి. దొంగలు మీ బ్యాంకింగ్ అకౌంట్లను యాక్సెస్ చేయగలిగితే కనుక వారు మీ మొబైల్‌లో OTP లను ఉపయోగించి సులభంగా డబ్బును బదిలీ చేయవచ్చు. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మీ టెలికాం ఆపరేటర్ మీ సిమ్‌ను బ్లాక్ చేయడానికి కొంత సమయం పడుతుంది.

బ్యాంక్ అకౌంటుతో అనుసంధానించబడిన మొబైల్ నంబర్‌ను మార్చడం

బ్యాంక్ అకౌంటుతో అనుసంధానించబడిన మొబైల్ నంబర్‌ను మార్చడం

మీ ఫోన్ దొంగిలించబడిన తర్వాత అదే ఫోన్ నంబర్‌ను బ్యాంకింగ్ సేవల కోసం ఉపయోగించడం అంత మంచిది కాదు. కావున మొబైల్ నంబర్‌ను మార్చడానికి మీ బ్యాంక్‌ని వ్యక్తిగతంగా సందర్శించండి. అలాగే అన్ని పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసిన తర్వాత మాత్రమే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించడం చాలా మంచిది.

ఆధార్ అనుసంధానిత మొబైల్ నంబర్‌ను మార్చడం

ఆధార్ అనుసంధానిత మొబైల్ నంబర్‌ను మార్చడం

దొంగలు ఆధార్ అతంటికేషన్ యాక్సిస్ పొందితే కనుక అప్పుడు వారు పెద్ద స్కామ్‌లను నిర్వహించడానికి మిమ్మల్ని మోసగించడం ప్రారంభించవచ్చు. మీ మొబైల్ ఫోన్ దొంగిలించబడిన వెంటనే మీ మొబైల్ నంబర్‌ను మార్చడానికి మీరు సమీప ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం మంచిది.

ఫోన్ నంబర్‌తో లింక్ చేయబడిన UPI పేమెంట్లను డీయాక్టివేట్ చేయడం

ఫోన్ నంబర్‌తో లింక్ చేయబడిన UPI పేమెంట్లను డీయాక్టివేట్ చేయడం

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను బ్లాక్ చేసిన తర్వాత నిర్దిష్ట మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన UPI మరియు ఇతర మొబైల్ వాలెట్‌లను డీయాక్టివేట్ చేయడం ఎట్టిపరిస్థితులలోను మర్చిపోవద్దు.

Paytm, Google Pay వంటి ఇతర మొబైల్ వాలెట్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేయడం

Paytm, Google Pay వంటి ఇతర మొబైల్ వాలెట్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేయడం

Paytm, Google Pay వంటి యాప్ల ద్వారా అందించిన మొబైల్ వాలెట్ సర్వీసుతో మరియు మీ ఫోన్ నంబర్‌కి లింక్ చేయబడిన ఇతర మొబైల్ వాలెట్‌లకు యాక్సెస్‌ను నిరోధించడానికి ధృవీకరించబడిన హెల్ప్‌డెస్క్‌కి కాల్ చేయడం ద్వారా సంప్రదించండి.

సోషల్ మీడియా, ఇమెయిల్ వంటి ఆన్‌లైన్ సేవలకు యాక్సెస్‌ను నిరోధించండి

సోషల్ మీడియా, ఇమెయిల్ వంటి ఆన్‌లైన్ సేవలకు యాక్సెస్‌ను నిరోధించండి

మీ ఫోన్ దొంగిలించబడినప్పుడు మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన మీ అన్ని ఇమెయిల్ ఐడి మరియు సోషల్ మీడియా అకౌంటులను మీరు వెంటనే డియాక్టివేట్ చేయడం చాలా ఉత్తమం. అలా చేయడం ద్వారా దొంగలు మీ దగ్గరి మరియు ప్రియమైన వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలు చేయలేరు.

సమీప పోలీస్ స్టేషన్‌లో FIR ఫైల్ చేయండి

సమీప పోలీస్ స్టేషన్‌లో FIR ఫైల్ చేయండి

మీరు మీ డబ్బును భద్రపరిచిన తర్వాత సమీప పోలీస్ స్టేషన్‌ను సందర్శించి జరిగిన సంఘటనను నివేదించి FIR ఫైల్ చేయండి. అలాగే ఎవరైనా మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును దొంగిలించినట్లయితే అది బ్యాంకులకు లేదా వాలెట్ కంపెనీలకు సాక్ష్యంగా అవసరమవుతుంది కాబట్టి FIR కాపీని తీసుకోవడం మర్చిపోవద్దు.

Best Mobiles in India

English summary
Is Your Smartphone Stolen? Do This Immediately to Secure Your Money

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X