ఎవరూ నమ్మవద్దు, ఆ జియో వార్త అబద్దం..

Written By:

ఈ మధ్య జియో వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.. అదేమిటంటే జియో ఫైబర్ నెట్ అతి త్వరలో దూసుకొస్తోందని. ఈ దీపావళికి జియో ఫైబర్ నెట్ మీ దగ్గర ఉంటుందని ముఖేష్ అంబాని కూతురు ఇషా అంబాని ట్విట్టర్లో పోస్ట్ చేసినట్లుగా వార్త ఒకటి వెలువడింది. అయితే అందులో నిజమెంత అనేది చూద్దాం.

అన్నకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన తమ్ముడు , రూ 299కే అన్నీ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫైబర్ నెట్ వర్క్ పేరుతో

ఫైబర్ నెట్ వర్క్ పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తపై జియో యాజమాన్యం స్పందించింది.

ఇషా అంబానీ పేరుతో

ఇషా అంబానీ పేరుతో వచ్చిన ట్విట్ నకిలీది అని తేల్చారు. జియో ఫైబర్ పై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని.. ఆ వార్త అబద్ధం అని స్పష్టం చేశారు. ప్రచారం ఉన్న వార్తతో కంపెనీకి సంబంధం లేదని వెల్లడించారు.

రూ.500 చెల్లిస్తే చాలు

జియో రూటర్. ఈ దీపావళికి జియో ఫైబర్ వచ్చేస్తుంది. నెలకు రూ.500 చెల్లిస్తే చాలు 100GB డేటా.. 1 GBPS స్పీడ్ తో ఉంటుంది. వంద నగరాల్లో దీపావళికి ప్రారంభం కాబోతున్నదంటూ ట్వీట్ వచ్చిన సంగతి విదితమే.

ట్విట్ సోషల్ మీడియాను

ఈ ట్విట్ సోషల్ మీడియాను ఊపేసింది. జియో ఫైబర్ రూటర్ ఫొటోతో సహా బయటకు వచ్చిన వార్త టెలికాం కంపెనీలకు షాక్ ఇచ్చింది. కంపెనీ ప్రతినిధులకు ఫోన్లు చేసి మరీ.. కనెక్షన్ కోసం ఆరా తీశారు కస్టమర్లు.

ప్రచారాన్ని గమనించిన జియో ప్రతినిధులు

ఈ ప్రచారాన్ని గమనించిన జియో ప్రతినిధులు జియో పేరు ఎక్కడ పోతుందోనని వెంటనే రంగంలోకి దిగి అది ఫేక్ న్యూస్ అంటూ వివరణ ఇచ్చారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Isha Ambani's tweet on Reliance Jio Fiber's launch this Diwali is fake Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting