మోడీని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు

Written By:

ప్రపంచదేశాలను గత కొంతకాలంగా తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తాజాగా సంచలన ప్రకటన చేసారు. భారత్ పైన యుద్ధం ఇక ప్రారంభిస్తామంటూ ఉగ్రవాద సంస్థ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తుంది. ఈ సారి ఐఎస్ఐఎస్ చేసిన హెచ్చరికలో భారత రాజకీయ పరిస్థితులను ప్రస్తావించడం విశేషం. భారత ప్రధాని నరేంద్ర మోడీ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజలను ఉసిగొల్పుతున్నారని ఐఎస్ఐఎస్ ఆరోపించింది. తగిన మూల్యం చెల్లించుకుంటారని తన ఈ బుక్ లో ఐఎస్ఐఎస్ వివరించింది.

Read more: ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న బ్రిటన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉగ్రవాదులు భారత్ లో మారణహోమం సృష్టించేందుకు

ఉగ్రవాదులు భారత్ లో మారణహోమం సృష్టించేందుకు

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారత్ లో మారణహోమం సృష్టించేందుకు సిద్ధంకావాలని, అందుకు కావాల్సిన సహాయ సహకారాలను అందించేందుకు రెడీగా ఉన్నామని పాకిస్తాన్ కు ఐఎస్ఐ సూచించినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్, హిజుబుల్ ముజిహుదీన్ లతో ఇప్పటికే పాక్ ఉగ్రవాదులు చర్చలు జరుపుకున్నట్లుగా సమాచారం.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పేరు చెబితేనే

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పేరు చెబితేనే

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పేరు చెబితేనే యావత్ ప్రపంచం భాయందోళనకు గురవుతుంది. ఇటీవల వరుసగా పారిస్ సహా పలు దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదలు సృష్టించిన బీభత్సం ఘటనల నేపథ్యంలో వారంటేనే ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ నాలుగు దేశాల అధినేతలు కలసినా

ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ నాలుగు దేశాల అధినేతలు కలసినా

ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ నాలుగు దేశాల అధినేతలు కలసినా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై ఉవ్వెత్తున మండిపడుతున్నాడు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తూ.. ఆ దిశగా ఏకం అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నాడు.

మరోమారు ముంబై తరహా దాడులకు ఉగ్రవాదులు

మరోమారు ముంబై తరహా దాడులకు ఉగ్రవాదులు

దీంతో మోడీని, కేంద్రంలోని బీజేపిని టార్గెట్ చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భారత్ ను తదుపరి టార్గెట్ గా ఎంచుకున్నారా..? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. మరోమారు ముంబై తరహా దాడులకు ఉగ్రవాదులు తెగబడనున్నారా..? ఇందుకు ప్రణాళికలు రచించారా..? అన్న సందేహాలు భారతీయులను కలవరాన్ని పెంచుతున్నాయి.

రొటీన్ కు భిన్నంగా భారత్ లోని రాజకీయ పరిస్థితులను కూడా

రొటీన్ కు భిన్నంగా భారత్ లోని రాజకీయ పరిస్థితులను కూడా

ఇందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు క్రితం రోజున చేసిన సంచలన ప్రకటనే కారణం. భారత్ పైనా యుద్ధం ప్రారంభిస్తామంటూ ఆ ఉగ్రవాద సంస్థ చేసిన ప్రకటన పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రొటీన్ కు భిన్నంగా భారత్ లోని రాజకీయ పరిస్థితులను కూడా ఉగ్రవాదులు తమ హెచ్చరికల్లో ప్రస్తావించడం గమనార్హం.

ఐసిస్ తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ పేరును

ఐసిస్ తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ పేరును

ఐసిస్ తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ పేరును నేరుగా ప్రస్తావించింది. ప్రతి ప్రాంతంలో తాము తాజా ప్రపంచం తీరు పైన పోరాడుతామని ప్రకటించారు. ఐసిస్ దాద్రీ ఘటనను పేర్కొంది. ప్రధాని మోడీ పేరును పేర్కొంది. అంతేకాక ముస్లింలకు వ్యతిరేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపడుతున్నారని, ముస్లింలపైకి ప్రజలను ఉసిగొల్పుతున్నారని కూడా ఐఎస్ ఆరోపించింది.

ఈ మేరకు నిన్న తన అధికారిక పత్రికలో ఐఎస్ ఉగ్రవాదులు

ఈ మేరకు నిన్న తన అధికారిక పత్రికలో ఐఎస్ ఉగ్రవాదులు

ఈ మేరకు నిన్న తన అధికారిక పత్రికలో ఐఎస్ ఉగ్రవాదులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ తదితర దేశాలపైనా దాడులు మొదలుపెడతామంటూ ఉగ్రవాదులు ప్రకటించారు.సున్నీ రాడికల్ ఆర్గనైజేషన్.. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఇందుకు సంబంధించి జిహాదీకి చెందిన ఈ-బుక్‌లో ప్రకటించింది.

హిందూ సంస్థలకు ఆర్థికపరమైన అండ ఇస్తున్న కొన్ని సంస్థలు

హిందూ సంస్థలకు ఆర్థికపరమైన అండ ఇస్తున్న కొన్ని సంస్థలు

హిందూ సంస్థలకు ఆర్థికపరమైన అండ ఇస్తున్న కొన్ని సంస్థలు పెద్ద సంఖ్యలో ముస్లిం వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నాయి. భవిష్యత్తులో ముస్లింలకు వ్యతిరేకంగా యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయి'' అని ఐఎస్ ఉగ్రవాదులు భారత్ లో జరుగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలను విశ్లేషించారు. ఈ నేపథ్యంలో భారత్ పై యుద్దానికి తాము సమరశంఖం పూరిస్తున్నామని హెచ్చరించారు.

దొంగ దెబ్బ తీయడం కూడా యుద్దమేనా..?

దొంగ దెబ్బ తీయడం కూడా యుద్దమేనా..?

భారత్ లో గోమాంసం తినే ముస్లింలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఐఎస్ఐఎస్ తమ అధికారిక పత్రిక ద్వారా హెచ్చరించింది. అయితే దొంగ దెబ్బ తీయడం కూడా యుద్దమేనా..? ఎదురుగా వచ్చి తలపడటం చేతకాని ఉగ్రవాదులు.. భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పలువురు బీజేపి నేతలు అంటున్నారు.

30 మందికి పైగా ఇందులో పాల్గొన్నట్లు

30 మందికి పైగా ఇందులో పాల్గొన్నట్లు

అయితే పాకిస్థాన్ లోని పెషావర్ నుండి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో దీనికి సంబందించిన చర్చలు నిర్వహించినట్లు , 30 మందికి పైగా ఇందులో పాల్గొన్నట్లు ఇంగ్లీష్ మీడియా తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఇండియా ఇంటెలిజెన్స్ తెలిసినట్లు సమాచారం.

భారత్ లో కాల్పులు,దాడులు నిర్వహించడమే ముఖ్య లక్ష్యంగా

భారత్ లో కాల్పులు,దాడులు నిర్వహించడమే ముఖ్య లక్ష్యంగా

భారత్ లో కాల్పులు,దాడులు నిర్వహించడమే ముఖ్య లక్ష్యంగా ఈ సభలో మాట్లాడుకున్నట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్, హిజుబుల్ ముజిహుదీన్ లతో కలిసి ఐఎస్ఐ దాడులు చేసేందుకు సన్నద్ధమైనట్లు వార్తలు వస్తున్న నేఫధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని సూచిస్తున్నారు.

పాక్ ఐఎస్ఐ రెచ్చగొడుతూ

పాక్ ఐఎస్ఐ రెచ్చగొడుతూ

భారత్ లో దాడులు జరిపేందుకు లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్, హిజుబుల్ ముజిహుదీన్ ఉగ్రవాద సంస్థలను పాక్ ఐఎస్ఐ రెచ్చగొడుతూ, ఎలాంటి సాకారాన్ని అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం.

ఎలాంటి దాడులనైనా ఎదుర్కునేందుకు

ఎలాంటి దాడులనైనా ఎదుర్కునేందుకు

ఎలాంటి దాడులనైనా ఎదుర్కునేందుకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉంటూ, తగినన్ని భద్రతా ఏర్పాట్లను భారత అధికారులు సిద్ధం చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Islamic State threatens India PM Modi Its E book
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot