కూతురుకి ఫేస్‌బుక్ ఫీచర్ 'లైక్' బటన్ పేరుని పెట్టిన ఇజ్రాయిలీ తండ్రి

Posted By: Super

కూతురుకి ఫేస్‌బుక్ ఫీచర్ 'లైక్' బటన్ పేరుని పెట్టిన ఇజ్రాయిలీ తండ్రి

ఫేస్‌బుక్ ప్రపంచంలో అత్యంత వేగవంతంగా ప్రజల దగ్గరకు చేరువవుతున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ అనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఈ ఫేస్‌బుక్ ప్రజల వద్దకు ఎంతలా చేరువ అయిందంటే ఇజ్రాయిల్‌లో ఓ జంట తమకు పుట్టినటువంటి పాపకు ఫేస్‌బుక్ ఫీచర్ అయినటువంటి లైక్ అని పేరు పెట్టేంతలాగా... దీనిని బట్టి మనకు ఏమి అర్దం అవుతుందంటే ఫేస్‌బుక్ చాలా ఎత్తుకు చేరిందని తెలుస్తుంది.

ఇక ఫేస్‌బుక్‌లో లైక్ బటన్ విషయానికి వస్తే ఫేస్‌బుక్‌లో ఉన్నటువంటి యూజర్స్ తమ యొక్క ఇష్టాఇష్టాలను ముఖ్యంగా ఫోటోగ్రాప్స్, లింక్స్, స్టేటస్ అప్‌డేట్స్ లాంటివి వేరే యూజర్స్‌తో పంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇజ్రాయిల్‌కి చెందినటువంటి లైర్ ఆడ్లర్ అతని భార్య వార్డిట్ ఇద్దరూ ఇజ్రాయిల్ రాజధాని అయినటువంటి టెల్ అవివ్‌‌‌కు దగ్గరలో నివశిస్తున్నారు. తమకు పుట్టినటువంటి పాపకు పెట్టబోయేటటువంటి పేరు చాలా కొత్తగా వినూత్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో లైక్ అని పెట్టినటువంటి డైలీ టెలిగ్రాప్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.

ఈ సందర్బంలో లైర్ ఆడ్లర్ మాట్లాడుతూ మా నిర్ణయం ప్రకారం ఈ పేరుని సమర్దించుకుంటున్నాం. ఇజ్రాయిల్ న్యూస్ పేపర్ అయినటువంటి హార్టీజ్ ప్రకారం ఇజ్రాయిల్‌లో ఎక్కువగా అమ్మాయిల పేర్లు నోవా, మాయ, తామర్ లాంటివి పెడుతుంటారని వెల్లడించారు. అలాంటి సాధారణంగా ఉండేటటువంటి పేర్లు ఇష్టం లేకనే లైక్ అని పెట్టామని తెలియజేశారు. అంతేకాకుండా తన పాప పోటోని, పేరుని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వెంటనే తనకు దాదాపు 40 మంది లైక్ బటన్ క్లిక్ చేసి వాళ్శ ఆనందాన్ని తెలియజేశారని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot