చంద్రయాన్-3 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్న ఇస్రో

|

చంద్రయాన్ 2 ప్రయోగం మొదలు పెట్టినప్పుడు ప్రపంచం మొత్తం చూపు మన ఇండియా వైపునకు తిప్పుకున్నది. చంద్రుడి యొక్క దక్షిణ దృవం మీద దిగడానికి ప్రయత్నించి చివరి నిమిషంలో ప్రయోగం నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ ప్రయోగం ద్వారా ఇండియా చాలా ఘనతలను సాధించింది.

ల్యాండర్
 

చంద్రయాన్ 2 ప్రయోగంలో ఆర్బిటర్,ల్యాండర్ మరియు రోవర్ చివరి వరకు భూమికి పంపిన సందేశాల ఆధారంగా మరియు రోవర్ పంపిన కొన్ని కీలకమైన సమాచారం, సిగ్నల్స్ మరియు ఛాయాచిత్రాల ఆధారంగా గతంలో సాదించలేకపోయిన ఘనతను ఇప్పుడు సాదించడానికి మరొక భారీ ప్రయోగానికి ఇస్రో ఇండియా సన్నద్ధమవవుతోంది.

ఈ టెక్నాలజీ మీ సాధారణ కార్లను ఎలక్ట్రిక్ కారుగా మార్చగలదుఈ టెక్నాలజీ మీ సాధారణ కార్లను ఎలక్ట్రిక్ కారుగా మార్చగలదు

కమ్యూనికేషన్

సెప్టెంబర్ 7 న ల్యాండర్‌తో కమ్యూనికేషన్ కోల్పోయే ముందు చంద్రయాన్ -2 యొక్క "విక్రమ్" ను నిర్దేశించని చంద్ర దక్షిణ ధ్రువంపై ఇస్రో మృదువైన ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించింది. అంతరిక్ష సంస్థ యొక్క లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ వి నారాయణన్ నేతృత్వంలోని విద్యావేత్తలు మరియు ఇస్రో నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ నష్టానికి కారణాన్ని విశ్లేషించింది.

స్మార్ట్‌ఫోన్‌తో ఈ కోతి చేసిన పనికి నీవెరపోవడం మన వంతుస్మార్ట్‌ఫోన్‌తో ఈ కోతి చేసిన పనికి నీవెరపోవడం మన వంతు

ISRO

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) 2020 నవంబర్‌లో చంద్రయాన్-3ని ప్రయోగించబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ మిషన్‌ కోసం కావలసిన సమాచారం మరియు చేయవలసిన విషయాలపై శాస్త్రవేత్తలంతా కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్‌ నుండే ఇస్రో చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.

Online Fraud: ఫుడ్ డెలివరీ కస్టమర్ కేర్‌ చేతిలో 4 లక్షలు స్వాహాOnline Fraud: ఫుడ్ డెలివరీ కస్టమర్ కేర్‌ చేతిలో 4 లక్షలు స్వాహా

ఇస్రో
 

ఇస్రో సంస్థ ఏర్పాటు చేసిన భారీ కమిటీ మరియు అందులోని మూడు సబ్ కమిటీలతో ఇప్పటికే నాలుగు ఉన్నతస్థాయి మీటింగ్స్ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఐతే... చంద్రయాన్ 2లో కీలకమైన ఆర్బిటర్ అద్భుతంగా పనిచేస్తోంది కాబట్టి ఈ సారి ప్రయోగించే చంద్రయాన్ 3లో ఆర్బిటర్ అనేది ఉండకపోవచ్చు. ఇందులో కేవలం ల్యాండర్ మరియు రోవర్ మాత్రమే ప్రయోగిస్తున్నట్లు ఉన్నతస్థాయి కమిటిలో ఆమోదించినట్లు సమాచారం.

Tata Sky Binge: ZEE5 సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న టాటా స్కై బింగే సర్వీస్Tata Sky Binge: ZEE5 సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న టాటా స్కై బింగే సర్వీస్

కమిటీ

చంద్రయాన్ 3 ప్రయోగంపై చర్చించడానికి సమావేశమైన కమిటీ మరియు సబ్ కమిటీలు ప్రొపల్షన్, సెన్సార్స్, ఇంజినీరింగ్, నేవిగేషన్, గైడెన్స్ వంటి అంశాలపై తమ తమ రిపోర్టులను ప్రవెశపెట్టినట్లు సమాచారం.

Nokia 55-inch SmartTV: స్మార్ట్ టీవీ విభాగంలోకి నోకియా గ్రాండ్ ఎంట్రీNokia 55-inch SmartTV: స్మార్ట్ టీవీ విభాగంలోకి నోకియా గ్రాండ్ ఎంట్రీ

ఇస్రో

ఇప్పుడు ఇస్రో... చంద్రయాన్ 3లో భాగమైన ల్యాండర్‌ను ఎక్కడ దింపాలి, రోవర్‌ ఎలా ఉండాలి? వంటి అంశాల్ని పరిశీలిస్తోంది. ఈసారి ల్యాండర్‌కి లెగ్స్ (కాళ్లు) అత్యంత బలంగా ఉండేలా చెయ్యబోతున్నట్లు తెలిసింది. ఎందుకంటే చంద్రయాన్ 2లో ల్యాండర్ కాళ్లు మరీ అంత బలమైనవేమీ కాదు. అందువల్ల అది వేగంగా ల్యాండ్ అయేటప్పుడు దానికి శక్తి సరిపోలేదని అర్థమైంది. మొత్తంగా కొత్త ల్యాండర్ మరియు కొత్త రోవర్‌ను తయారుచేస్తున్నట్లు తెలిసింది.

చంద్రయాన్-3

ఈమధ్య చంద్రయాన్-2 ఆర్బిటర్‌కి ఉన్న టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా-2 (TMC-2)... చంద్రుడిపై లిండ్‌బెర్గ్‌ దగ్గర్లోని ఓ పగులు లోయకి సంబంధించి త్రీడీ వ్యూని పంపింది. అలాగే డోర్సా గెయికీ దగ్గర్లోని ముడతల పగులు లోయకి సంబంధించిన త్రీడీ వ్యూ కూడా పంపింది. తద్వారా చందమామకు సంబంధించి మరిన్ని విషయాల్ని ఇస్రో తెలుసుకోగలుగుతోంది.

--ఇలా తాజా సమాచారాన్ని క్రోఢీకరించుకుంటూ తదుపరి సంవత్సరం నవంబర్‌ నాటికి చంద్రయాన్ 3ని ప్రయోగించడమే లక్ష్యంగా ఇస్రో అడుగులు వేస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
ISRO Might Launch Chandrayaan-3 Sometime In November 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X