నిప్పులు చిమ్ముకుంటూ నింగిని ముద్దాడింది

Written By:

పీఎస్‌ఎల్వీ-సీ31 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి గగనంలోకి దూసుకెళ్లింది. బుధవారం ఉదయం 9 గంటల 31 నిమిషాలకు రెండో లాంచ్‌పాడ్ నుంచి ప్రారంభమైన ఈ ప్రయోగంలో భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ (ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) ఉపగ్రహాల శ్రేణిలో ఐదో ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 1,425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరినట్టు ఇస్రో వెల్లడించడంతో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ ఉపగ్రహంపై స్పెషల్ స్టోరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ రాకెట్ ద్వారా దేశ నావిగేషన్‌ వ్యవస్థకు

ఈ రాకెట్ ద్వారా దేశ నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఈ శాటిలైట్‌ను శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించారు. నావిగేషన్‌ వ్యవస్థలో ఇది ఐదో ఉపగ్రహ ప్రయోగం.షార్‌లోని ద్వితీయ ప్రయోగ వేదిక నుంచి దీనిని రోదసిలోకి పంపించారు.

భూ ఉపరితలానికి 503 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని

భూ ఉపరితలానికి 503 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని వదిలిపెట్టిన అనంతరం కర్ణాటకలోని హసన్‌లో ఉన్న మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ (ఎంసిఎఫ్‌) ఈ ఉపగ్రహాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. వారంలోగా ఈ ఉపగ్రహంలోని ద్రవ అపోజీ మోటార్లను నియంత్రిస్తూ దశల వారీగా ఉపగ్రహ కక్ష్యను మార్పుచేస్తారు.

ఈ ప్రయోగ లక్ష్యం ఏమిటంటే...

మనదేశ వాహనచోదకులు మార్గాన్వేషణ కోసం అమెరికాకు చెందిన గ్లోబల్‌ పోజిషన్‌ సిస్టం (జీపీఎస్)పై ఆధారపడుతున్నారు. దేశ ప్రజల కోసం స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ (ఇండియన్‌ రీజియన్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌- ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్)ను రూపొందించేందుకు 2013 నుంచి ఇస్రో ప్రయత్నిస్తోంది.

ఈ ప్రయోగ లక్ష్యం ఏమిటంటే...

ఇందుకోసం 7 నావిగేషన్‌ ఉపగ్రహాలను రోదసిలోకి పంపాలి. ఇప్పటివరకూ నాలుగు ఉపగ్రహాలను పంపారు. ప్రస్తుతం పీఎస్ఎల్‌వీ-సీ31 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1ఈని ప్రయోగిస్తున్నారు.

ఈ ఏడు ఉపగ్రహాలతో దేశవ్యాప్తంగా

ఈ ఏడు ఉపగ్రహాలతో దేశవ్యాప్తంగా వాహన చోదకులకు మార్గదర్శక సంకేతాలు అందజేస్తారు. ఈ ఏడాది చివరికి దేశవ్యాప్తంగా దేశీయ నావిగేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అలాగే మనదేశ సరిహద్దుల నుండి 1500 కిలోమీటర్ల పరిధి వరకు ఈ నావిగేషన్‌ వ్యవస్థ పనిచేస్తుంది. మిగిలిన రెండు ఉపగ్రహాలను వచ్చే ఏప్రిల్లోగా ప్రయోగిస్తారు.

అయితే ఈ ఉపగ్రహంలో రెండు రకాల సాంకేతిక పరికరాలను

అయితే ఈ ఉపగ్రహంలో రెండు రకాల సాంకేతిక పరికరాలను అమర్చారు. నావిగేషన్ (దిక్సూచి) పేలోడ్స్‌లో ఎల్-5 బ్యాండ్, ఎస్‌బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్‌ను పంపారు. ఈ ప్రయోగానికి సంబంధించి సోమవారం ఉదయం 9.31 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు.

48 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఈరోజు పీఎస్‌ఎల్‌వీ సీ-31

48 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఈరోజు పీఎస్‌ఎల్‌వీ సీ-31 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 1425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని మోసుకుని వెళ్లి రోదసీలోకి ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని, రెండో దశలో మంగళవారం 42 టన్నుల ద్రవ ఇంధనం నింపే కార్యక్రమాన్ని పూర్తిచేశారు.

పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఈ ప్రయోగం 33వది కాగా

మంగళవారం రాత్రికి హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లను నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఈ ప్రయోగం 33వది కాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల శ్రేణిలో ఐదో ఉపగ్రహం కావడం గమనార్హం. ఈ ప్రయోగంతో ఐదు ఉపగ్రహాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి, మార్చిలో రెండు ఉపగ్రహాల ప్రయోగాలను పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

ప్రయోగం ఇలా జరిగింది

ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో విజయవంతంగా పూర్తి చేశారు. కోర్‌అలోన్ దశలో 138.2 టన్నులు, ఎక్స్‌ఎల్ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనం ద్వారా 110.9 సెకన్లలో మొదటి దశను పూర్తి చేశారు.

42 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 265 సెకన్లలో

42 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 265 సెకన్లలో రెండో దశను, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 600.6 సెకన్లలో మూడో దశను, 2.5 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 1,123.3 టన్నుల ద్రవ ఇంధనంతో నాలుగో దశను విజయవంతంగా పూర్తిచేశారు.

అనంతరం 1,161 సెకన్లకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని

అనంతరం 1,161 సెకన్లకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని 20,657 కిలోమీటర్లలో అపోజి(భూమికి దూరంగా) 284 పెరిజీ(భూమికి దగ్గరగా) 19 డిగ్రీల భూబదిలీ కక్షలో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించడం ద్వారా దశలవారీగా 284 కిలోమీటర్ల పెరిజీని పెంచుకుంటూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోకి భూస్థిరకక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు.

ఉపగ్రహంతో ఉపయోగాలివీ..

ఇది నావిగేషన్ సర్వీస్ సిగ్నల్స్‌ను వేగంగా అందిస్తుంది.అలాగే రేంజింగ్ పేలోడ్స్‌లో సీ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, రెట్రోరిఫ్లెక్షన్ లేజర్ రేంజింగ్ అనే పరికరాలు పనిచేస్తాయి. దీంతో పాటు ఈ సాంకేతిక పరికరాలన్నీ భారత్‌కు దిక్సూచి వ్యవస్థలను అందిస్తాయి.

ఈ రాకెట్‌ను భూమి నుండి వేగంగా నెట్టేందుకు

ఈ రాకెట్‌ను భూమి నుండి వేగంగా నెట్టేందుకు రాకెట్ మొదటి దశలో ఆరు స్ట్ఫ్రాన్ ఎక్స్‌ఎల్ మోటార్లను బిగించారు.ఈ తరహా ఎక్స్‌ఎల్ ప్రయోగం మొదట చంద్రయాన్-1లో ఉపయోగించారు. ఎక్స్‌ఎల్ మోటార్ల ప్రయోగంలో ఇది 11వ ప్రయోగం కావడం విశేషం.

శ్రీహరికోట శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ

ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌ కుమార్ దగ్గరుండి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. ఈ ప్రయోగం విజయవంతంతో షార్‌ శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీహరికోట శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write ISRO PSLV C31 set for IRNSS-1E launch
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot