Home
News

ISRO పుష్పక్‌ అటానమస్ ల్యాండింగ్‌ ప్రయోగం విజయవంతం.. 4.5 కి.మీ ఎత్తు నుంచి కిందకు..!!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్‌ టెస్ట్ రేంజ్‌ నుంచి రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ (RLV LEX-02) అటానసమ్‌ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతం పూర్తి చేసింది. ఈ RLV కు ఇస్రో పుష్పక్‌ (Pushpak) గా పేరుపెట్టింది.

గత సంవత్సరం RLV LEX-01 టెస్టింగ్‌ను పూర్తిచేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. తాజాగా అటానమస్ సామర్థ్యం కలిగిన RLV LEX-02 ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ ను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చినూక్ హెలికాప్టర్‌.. 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టింది.

Pushpak autonomous reusable launch vehicle

అక్కడ నుంచి అటానమస్ సామర్థ్యం కలిగిన RLV LEX-02 విజయవంతంగా ల్యాండింగ్ అయింది. బ్రేక్‌ పారాచూట్, నోస్‌ వీల్‌ స్టీరింగ్‌ సిస్టమ్‌, ల్యాండింగ్‌ గేర్‌ బ్రేక్‌ సాయంతో అత్యంత కచ్చితత్వంతో ల్యాండ్‌ అయింది. అయితే రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది.

ఈ పుష్పక్‌ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. బ్రేక్‌ పారాచూట్‌, ల్యాండింగ్‌ గేర్‌ బ్రేక్‌ సహా నోస్‌ వీల్‌ స్టీరింగ్‌ సిస్టమ్‌ సాయంతో అధునాతన డీసీలరేషన్‌ మెకానిజంతో సురక్షితంగా ల్యాండింగ్‌ చేసింది. అంతరిక్షం నుంచి అత్యధిక వేగంతో తిరిగివచ్చే వాహనాల అటానమస్‌ ల్యాండింగ్‌కు అవసరం అయిన అత్యాధునిక టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో భారత్‌ సత్తా మరోసారి రుజువైంది.

రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ అంతరిక్షం నుంచి భూమికి చేరే సమయంలో ఉన్న కఠినమైన పరిస్థితులను ఈ మిషన్‌ సమగ్రంగా ఎదుర్కొంది. సురక్షితమైన మరియు సమర్థవంతమైన ల్యాండింగ్ కోసం మెరుగైన టెక్నాలజీని వినియోగించింది. ఫలితంగా అంతరిక్ష యాత్రల్లో ఇస్రో సామర్థ్యం మరోసారి రుజువైంది.

ఈ మిషన్‌కు అవసరం అయిన అనేక పరికరాలు, సాంకేతికతను ఇస్రో దేశీయంగానే అభివృద్ధి చేసింది. నావిగేషన్‌, కంట్రోల్‌ సిస్టమ్‌, ల్యాండింగ్‌ గేర్‌ మరియు డీసిలరేషన్‌ సిస్టమ్‌లను దేశీయంగానే అభివృద్ధి చేసింది. ఫలితంగా అంతరిక్ష యాత్రలో స్వదేశీ సాంకేతికతో సత్తా చాటినట్లు అయింది.

పుష్పక్ వాహనాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో 2016 లో తొలిదశలో టెస్టింగ్‌ చేశారు. అనంతరం అనేక కీలక పరీక్షలతో తాజా ప్రయోగానికి శ్రీకారం చు‌ట్టారు. ఫలితంగా అధునాతన సాంకేతికత సహా అత్యంత కచ్చితత్వంతో టెస్టింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

** భారత రక్షణ పరిశోధన. అభివృద్ధి సంస్థ DRDO తయారు చేసిన ప్రత్యేక టెక్నాలజీతో అగ్ని 5 రాకెట్‌ను ఇటీవల పరీక్షంచారు. ఈ మిస్సైల్‌ను MIRV (మల్టిపుల్‌ ఇండిపెండెట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌) టెక్నాలజీ ద్వారా ప్రయోగించారు. ఈ ప్రయోగం ద్వారా దీని ద్వారా ఎక్కువ వార్‌హెడ్లను మోసుకెళ్లే సాంకేతిక భారత్‌ సొంతమైంది.

ఇప్పటికే ఈ తరహా సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాలు కలిగి ఉన్నాయి. మల్టిపుల్‌ ఇండిపెండెట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌- MIRV ద్వారా ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడిచేయవచ్చు. సాధారణంగా ఒక మిస్సైల్‌ ద్వారా ఒక ప్రాంతంలోనే దాడి చేయగలం. ఈ మల్టిపుల్‌ ఇండిపెండెట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌ ద్వారా ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో దాడి చేయవచ్చు.

ఈ టెక్నాలజీ ద్వారా ఒకే రాకెట్‌లో ఎక్కువ వార్‌హెడ్లను అమర్చవచ్చు. అంటే ఒకేసారి ఎక్కువ లక్ష్యాలపై గురిపెట్టవచ్చు. వీటిని ప్రయోగించాక.. కొంత దూరం వెళ్లాక వాటి లక్ష్యాలకు అనుగుణంగా విడిపోతాయి. అనంతరం పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. నిర్దేశించిన వేగం, లక్ష్యానికి అనుగుణంగా ప్రయాణిస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
ISRO tests Pushpak autonomous reusable launch vehicle successfully
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X