అంతరిక్షంలోకి ఒకేసారి 104 శాటిలైట్‌లు, ఇస్రో చరిత్ర సృష్టించబోతోందా..?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో (ISRO) సరికొత్త రికార్డును సృష్టించబోతోంది. ప్రపంచ దేశాలకు ధీటుగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C37) రాకెట్ ప్రయోగం తుది అంకానికి చేరుకుంది. ఈ రాకెట్ ఒకేసారి 104 శాటిలైట్‌లను అంతరిక్షంలోకి తీసుకువెళ్లబోతోంది. ఈ మహా ప్రయోగాన్ని ఫిబ్రవరి 15న ఉదయం 9.32 నిమిషాలకు శ్రీహరికోట స్పేస్‌పోర్ట్ నుంచి నిర్వహించేందుకు ఇస్రో సన్నద్దమవుతోంది.

అంతరిక్షంలోకి ఒకేసారి 104 శాటిలైట్‌లు, ఇస్రో చరిత్ర సృష్టించబోతోందా..?

ఈ రాకెట్ ద్వారా ఇస్రో లాంచ్ చేయబోయే 104 శాటిలైట్లలో 101 ఉపగ్రహాలు ప్రపంచదేశాలకు చెందినవి కాగా మూడు మాత్రమే స్వదేశీ ఉపగ్రహాలు. 320 టన్నుల బరువు ఉండే పీఎస్ఎల్‌వీ - సీ37 రాకెట్ 1,500 కిలోల బరువు గల శాటిలైట్లను కక్ష్యలోకి మోసుకెళ్లబోతోంది. గతంలో ఇస్రో ఒకే రాకెట్ పై 20 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రయోగించగలిగింది. మెరికా, రష్యా తర్వాత ఒకేసారి 20 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. రాకెట్‌ ప్రయోగం తర్వాత నింగిలోకి ఉప గ్రహాలు ప్రవేశ పెట్టేందుకు 26 నిమిషాల సమయం పట్టింది.

అంతరిక్షంలోకి ఒకేసారి 104 శాటిలైట్‌లు, ఇస్రో చరిత్ర సృష్టించబోతోందా..?

అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపాలంటే ఇప్పుడు ప్రపంచదేశాలు ఇస్రో వైపే చూస్తున్నాయి. ఎందుకంటే ఇస్రో నుంచి అంతరిక్షంలోకి ఏ ఉపగ్రహమైన గురి తప్పకుండా కక్ష్యలోకి చేరుకుంటుంది. అంత నమ్మకం ఉంది కాబట్టే విదేశాలు ఇస్రో వైపు చూస్తున్నాయి. 1993 నుంచి ఇస్రోకి అన్ని విజయాలే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంతరిక్షంలోకి మనుషుల కంటే ముందు..

ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఒకప్పుడు అందుబాటులో లేదు. ఒక్కసారి పాత రోజులను గుర్తుచేసుకుంటే మనిషి సాధించిన మైలు రాళ్లు ఒక్కొక్కటిగా మన కళ్ల ముందు మెదులుతాయి. మీకు తెలుసా..? అంతరిక్షంలోకి మనుషుల కంటే ముందు జంతువులు ప్రయాణం చేసాయి. అంతరిక్షంలో వాతవరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు స్పేస్ ఏజెన్సీలు తొలత జంతువులనే ఎంపిక చేసుకున్నాయి. అంతరిక్షంలో కాలు మోపిన 10 నాన్ - హ్యుమన్ వ్యోమగామల వివరాలను ఇప్పుడు చూద్దాం...

స్పుట్నిక్ 2

1957 నవంబర్ 3వ తేదీన రష్యా ప్రయోగించిన ‘స్పుట్నిక్ 2' (Sputnik 2) ఉపగ్రహంలో లైకా అనే కుక్కను పంపించారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి జంతువు ఇదే. వెనక్కి తిరిగొచ్చే అవకాశం లేకపోవటంతో కొన్ని గంటల వవ్యధిలోనే ఈ కుక్క మరణించింది.

హ్యామ్ అనే చింపాంజీ

1961లో హ్యామ్ అనే చింపాంజీని అంతరిక్షంలోకి దిగ్విజయంగా పంపగలిగారు.

అనితా, అరాబిల్లా

1973లో అనితా, అరాబిల్లా అనే రెండు సాలి పురుగులను స్కైల్యాబ్ 3 స్పేస్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి పంపగలిగారు.

ఫెలిక్స్ అనే పిల్లి

1963 అక్టోబర్ 18న ఫ్రెంచ్ ఫెలిక్స్ అనే పిల్లిని అంతరిక్షంలోకి పంపింది. ఆ తర్వాత అది భూమిపైకి క్షేమంగా తిరిగి వచ్చింది.

తాబేళ్లను కూడా..

1968లో సోవియట్ యూనియన్ రెండు తాబేళ్లను జాండ్ 5 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపగలిగింది. స్వల్ప్ అస్వస్థత మినహా ఇవి క్షేమంగా భూమికి తిరిగి వచ్చాయి.

చేపలను కూడా...

అంతరిక్షంలో లోతైన అధ్యయనం నిమిత్తం 1973లో రెండు చేపలను స్కైల్యాబ్ 3 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించగలిగారు. అనంతరం ఈ చేపలను అనేక అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగించారు.

కప్పలను కూడా..

1970లో ఆర్బిటింగ్ ఫ్రాగ్ ఓటోలిత్ (ఓఎఫ్ఓ) అనే ప్రోగ్రామ్ పేరుతో నాసా రెండు కప్పలను అంతరిక్షంలో పంపింది. శాస్త్రవేత్తల ప్రోగ్రామ్ విజయవంతమైంది గాని కప్పలు మాత్రం ఎప్పటికి తిరిగిరాలేదు.

కోతులతో పాటు నీటి ఉడుములు..

1985లో నిర్వహించిన బయోన్ 7 మిషన్‌లో భాగంగా రెండు కోతులతో పాటు 10 నీటి ఉడుములను అంతరిక్షంలోకి పంపారు.

స్పుట్నిక్ 9 స్పేస్‌క్రాఫ్ట్ గయనా పంది

మార్చి 9, 1961లో దివికిఎగసిన సోవియల్ స్పుట్నిక్ 9 స్పేస్‌క్రాఫ్ట్ వెంట మొదటి గయనా పందిని పంపిచారు. వీటితో పాటు పలు కుక్కలు, సరీసృపాలు ఇంకా ఎలుకలను కూడా స్పేస్‌లోకి పంపారు.

17 ఏప్రిల్‌ నుండి 3 మే 1998 వరకు

17 ఏప్రిల్‌ నుండి 3 మే 1998 వరకు జంతుశాలను మొత్తాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళారు. ఈ ప్రయోగాన్ని ఎస్‌టిఎస్‌-90 గా పిలుస్తారు. దానిలో 170 చుంచులను, 18 ఎలుకలను, 229 చేపలను, 135 నత్తలను, 1514గుడ్లను, లార్వాలను తీసుకు వెళ్ళారు.

రకరకాల పురుగులు

1ఫిబ్రవరి 2003న కొలంబియా ఎస్‌టిఎస్‌-107 ద్వారా ఒక క్యాను నిండా రకరకాల పురుగులను తీసుకొని అంతరిక్షానికి వెళ్లారు. ఈ పరిశోధన మిశ్రమ ఫలితాలను చూపించింది. ఈ విధంగా అంతరిక్ష యానానికి మానవులు, జీవరాశి ఎలా తట్టుకో గలదు అనే దానిపై ఇప్పటికీ పరిశోధనలను కొనసాగిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ISRO to Launch Record 104 Satellites on a Single Launch Next Week. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot