భూమిని దాటిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’

Posted By:

భారత అంతిరక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తొలి అంగారక ఉపగ్రహం మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్) దిగ్విజయంగా భూమిని దాటి అరుణగ్రహాన్ని చేరేందుకు నిర్థేశించిన మార్స్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు భూమి చుట్టూ పరిభ్రమించిన మామ్ ఉపగ్రహం తొలిసారిగా మన గ్రహాన్ని దాటి వెల్లిపోయింది. దీంతో భూ కక్ష్యను దాటి వెళ్లిన మొట్టమొదటి భారత ఉపగ్రహంగా మామ్ చరిత్ర సృష్టించి, భారత అంతరిక్ష పరిశోధనా చరిత్రలో మైలురాయిగా నిలిచింది.

భూమిని దాటిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’

మార్స్ (అంగారక) గ్రహం గురించిన అన్వేషణ కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్' (మామ్) ఉపగ్రహం నవంబర్ 5 మంగళవారం మధ్యాహ్నం 2.38గంటలకు శ్రీహరికోటలోని షార్ ప్రయోగవేదికగా నింగిలోకి చొచ్చుకెళ్లింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ - సీ25) మామ్ ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది

మార్స్ గ్రహం చుట్టూ పరిభ్రమించే ఉపగ్రహాన్ని రూపొందించి అక్కడి పరిస్థితులను తెలుసుకోగలిగే సామర్ధ్యం భారత్‌కు ఉందని నిరూపించాలన్నదే మార్స్ మిషన్ ప్రాథమిక ధ్యేయం. మామ్ ఉపగ్రహం అంగారుకుడి పై జీవాన్వేషణ జరపటంతో పాటు అక్కడి పరిస్థితులను ఫోటోల ద్వారా పంపడం, వాతవరణాన్ని అధ్యయనం చేయటం వంటి లక్ష్యాలను ఈ ఉపగ్రహానికి నిర్థేశించడం జరిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot