Home
News

సంచలనం రేపుతోన్న MarQ, రూ.25,999కే 1.5 టన్ ఇనర్వర్ట్ AC

ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వినియోగం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవిదేశాలకు చెందిన అనేక బ్రాండ్‌లు వివిధ రేంజ్‌లలో గృహోపకరణాలను ప్రొవైడ్ చేస్తున్నాయి.

ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వినియోగం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవిదేశాలకు చెందిన అనేక బ్రాండ్‌లు వివిధ రేంజ్‌లలో గృహోపకరణాలను ప్రొవైడ్ చేస్తున్నాయి. తాజా ఈ జాబితాలోకి ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్ అయిన MarQ చేరిపోయింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో హై-క్వాలిటీ ఉత్పత్తులను అందించటమే లక్ష్యంగా ఈ ప్రయివేట్ లేబుల్ బ్రాండ్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకని ఈ బ్రాండ్ లాంచ్ చేసిన పలు విప్లవాత్మక ప్రొడక్ట్స్ వివరాలను ఇప్పుడు తెలుసకుందాం..

రూ.25,999కే MarQ ఇన్వర్టర్ ఏసీ..

రూ.25,999కే MarQ ఇన్వర్టర్ ఏసీ..

ఫ్లిప్‌కార్ట్ ప్రయివేట్ లేబుల్ బ్రాండ్ MarQ, ఈ ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని విప్లవాత్మక ఇన్వర్టర్ ఏసీ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఎయిర్ కండీషనర్‌లో నిక్షిప్తం చేసిన కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇంకా ఎనర్జీ సేవింగ్ క్యాపబులిటీలు విద్యుత్‌ను ఆదా చేయటంతో పాటు హై-క్వాలిటీ పనితీరును ఆఫర్ చేయగలుగుతాయి. ఈ ఏసీలో నిక్షిప్తం చేసిన డ్యుయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ టెంపరేచర్‌కు అనుగుణంగా సరైన స్పీడ్‌లను మెయింటేన్ చేస్తూ ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా చూస్తుంది. MarQ తన 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీని మార్కెట్లో రూ.25,999 ధర ట్యాగ్ తో విక్రయిస్తోంది. ఇదే విధమైన ఏసీలను మార్కెట్లోని ఇతర బ్రాండ్‌లు భారీ ధర ట్యాగ్‌లతో విక్రయిస్తున్నాయి.

 

 

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సైడ్ బై సైడ్ రిఫ్రీజరేటర్‌...

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సైడ్ బై సైడ్ రిఫ్రీజరేటర్‌...

ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని MarQ, తన ప్రొడక్ట్ లైనప్ నుంచి ‘మార్క్యూ బై ఫ్లిప్‌కార్ట్ 565' పేరుతో విప్లవాత్మక సైడ్ బై సైడ్ రిఫ్రీజరేటర్‌ను లాంచ్ చేసింది. వాటర్ డిస్పెన్సర్ సపోర్టుతో వస్తోన్న ఈ రిఫ్రీజరేటర్‌లో ఎక్స్‌ప్రెస్ కూలింగ్, ఫ్రీజింగ్ వంటి ఉపయోగకరమైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ రిఫ్రీజరేటర్‌లో పొందుపరిచిన మల్టీ ఎయిర్ ఫ్లో టెక్నాలజీ లోపలి పదర్థాలను మరింత తాజాగా ఉంచుతుందిఇదే సమయంలో రిఫ్రీజరేటర్‌లోని స్మార్ట్ డిజిటల్ సెన్సార్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుని రిఫ్రీజరేటర్‌లోని కూలింగ్ టెంపరేచర్‌ను ఓ క్రమపద్థతిలో మెయింటేన్ చేస్తూ వస్తుంది. ఫ్రోస్ట్ ఫ్రీ టెక్నాలజీ, సుర్జ్ ప్రొటెక్షన్, ఎల్ఈడి టచ్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఈ రిఫ్రీజరేటర్‌లో ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలతో వస్తోన్న ఈ సైడ్ బై సైడ్ రిఫ్రీజరేటర్‌ను కేవలం రూ.39,999కే MarQ ఆఫర్ చేస్తోంది. ఇదే విధమైన రిఫ్రీజరేటర్‌‌లను మార్కెట్లోని ఇతర బ్రాండ్‌లు రూ.70,000 కంటే ఎక్కువ ధర ట్యాగ్‌తో విక్రయిస్తున్నాయి.

 

 

 

 

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ క్వాలిటీ వాషింగ్ మెచీన్లు..

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ క్వాలిటీ వాషింగ్ మెచీన్లు..

భారతీయులు అవసరాలను దృష్టిలో ఉంచుకుని MarQ, తన పోర్టిఫోలియో నుంచి సెమీ ఆటోమెటిక్ అలానే ఫుల్లీ ఆటోమెటిక్ ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఫుల్లీ ఆలోమెటిక్ ఫ్రంట్ లోడ్ మెచీన్లు 15 రకాల వాష్ ప్రోగ్రామ్స్‌తో అన్ని రకాల వాషింగ్ అవసరాలను తీర్చగలుగుతాయి. ఈ మెచీన్లలో ఏర్పాటు చేసిన ఎక్స్‌ప్రెస్ వాష్ ఫీచర్ దుస్తులను 18 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో వాష్ చేసేస్తుందట. బడ్జెట్‌ రేంజ్‌తో పాటు మన్నికను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఈ వాషింగ్ మెషీన్లు మీడియమ్ సైజ్ కుటుంబాలకు పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాయని కంపెనీ వెల్లడించింది. గతంలో లాంచ్ చేసిన సెమీ-ఆటోమెటిక్ వాషింగ్ మెచీన్స్ మాదిరిగానే 9ఆర్ పీఎమ్ క్లాత్ రొటేషన్, ప్రీ-సోక్ యాష్, వేగవంతమైన డ్రయ్యింగ్ కోసం ఎక్స్‌ట్రా ఎయిర్ వెంట్స్ వంటి ఫీచర్లను ఈ మెషీన్లలో నిక్షిప్తం చేసినట్లు కంపెనీ తెలిపింది. వాష్ సైకిల్ కంప్లీట్ అయిన వెంటనే యూజర్‌ను అలర్ట్ చేసేలా వాష్ కంప్లీట్ బజ్జర్‌తో పాటు దుస్తు పొరల్లోని మురికిని పీల్చుకునేలా లింట్ ఫిల్టర్ వ్యవస్థలను కూడా ఈ మెషీన్లలో పొందుపరిచినట్లు కంపెనీ తెలిపింది. 7.5 కిలోగ్రాముల కెపాసిటీలో MarQ లాంచ్ చేసిన Flipkart 7.5 KG FAFL వాషింగ్ మెచీన్ రూ.16,999 ధర ట్యాగ్‌తో మార్కెట్లో లభ్యమవుతోంది. దే విధమైన ఫీచర్లతో కూడిన వాషింగ్ మెషీన్లను మార్కెట్లోని ఇతర బ్రాండ్‌లు రూ.30,000 కంటే ఎక్కువ ధర ట్యాగ్‌లతో విక్రయిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Issued In The Public Interest Of Home Appliance Buyers - A Must Read.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X