సిలికాన్ సిటిలో నిఘా అంతంత మాత్రమే

Posted By: Super

సిలికాన్ సిటిలో నిఘా అంతంత మాత్రమే

బెంగుళూరు : ముంబయ్ దాడులతో ఉలిక్కిపడ్డ యూవత్ దేశం అన్ని ప్రధానం ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఐటీ సంస్థలతో పాటు ఇతర అంశాలకు ప్రధాన స్థావరమైన బెంగుళూరును ఉగ్రవాద చర్యలు నుంచి కాపాడుకునేందుకు ఇక్కడి ప్రభుత్వం చేపట్టిన రక్షనాత్మక చర్యలు లోపోబయిష్టంగా ఉన్నాయి. ఆ సాంఘీక శక్తులు అడుగుజాడలను పసిగట్టేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో 500 నిఘా కెమోరాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఇప్పటికి ఆచరణకు నోచుకోలేదు.

ముంబయ్ 26/11 తరహా దాడలు జరగవచ్చని భావిస్తున్న నేపధ్యంలో ఉగ్రవాదుల కార్యకలాపాలను ముందుగానే పసిగట్టేందుకు ప్రత్యేక ఇంటెలిజెన్స్ వర్గాలను ఇప్పటికి ఏర్పాటు చేయలేదు. ఏ క్షణంలోనైనా దాడులను ఎదుర్కొనేందుకు పోలీస్ స్టేషన్ లలో ఉగ్రవాద వ్యతిరేక దళాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రత్యేక శిక్షణ పొందిన అధికారులచే మాక్ ప్రోగ్రామ్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇంతవరకు ఈ విధమైన చేపట్టలేదని పలువురు అధికారులు వాపోతున్నారు.

ఉగ్రవాదుల జాబితాలో ఉన్న బెంగుళూరులో ఏ క్షణంలో నైనా దాడులు జరగవచ్చని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 2009, జూలై 2009 సీరియల్ బాంబ్ దాడుల నేపధ్యంలో ప్రభుత్వం 200 మంది స్ట్రాంగ్ క్విక్ యాక్షన్ సిబ్బందితో ఇంటర్నల్ సెక్యూరిటీ వింగ్ ను ఏర్పాటు చేసింది. బాంబులను నిర్వీర్యం చేసే ప్రత్యేక బృందాలను పట్టణంలోని అన్ని భాగాల్లో ఏర్పాటు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.

బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బాంబు స్క్వాడ్ బృందం నిరంతర గస్తీ నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు. దాడుల నేపధ్యంలో మొబైల్ బాంబు డిస్పోజిల్ స్క్వాడ్ బృందం బుధవారం సాయంత్రం నుంచి అడుగడుగునా జల్లిడి పడుతుందని అధికారి వెల్లడించారు. దాడులను ఎదుర్కొనేందుకు తమ వద్ద 2500 ఏకే47 రైఫిల్స్ తో పాటు ఆటోమెటిక్ ఆయుధాలు , 500 జాకెట్ ఫ్రూఫ్ వెస్ట్లులతో పాటు ఇతర ఆయుధాలు తమ వద్ద ఉన్నాయిని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot